వైసీపీ నేత‌ల్లో వ‌ణుకు.. నెక్ట్స్ జైలుకెళ్లేది వాళ్లేనా!

Publish Date:Aug 13, 2024

Advertisement

వైసీపీ నేత‌ల్లో వ‌ణుకు మొద‌లైంది. ఎప్పుడు ఎవ‌రు జైలు ఊచలు లెక్క‌పెట్టాల్సి వ‌స్తుందోన‌న్న ఆందోళ‌న వారిలో నెల‌కొంది.  తాజాగా మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.  నేడో రేపో చంద్ర‌బాబు ఇంటిపై దాడి కేసులో జోగి ర‌మేశ్ కూడా అరెస్ట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.   తెలుగుదేశం కార్యాల‌యంపై దాడి కేసులో వ‌ల్ల‌భ‌నేని వంశీ కోసం పోలీసుల‌ వేట కొన‌సాగుతోంది. మొత్తానికి వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించిన నేత‌ల‌కు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు కూట‌మి ప్ర‌భుత్వం పావులు క‌దుపుతోంది. ఎలాంటి హ‌డావిడి లేకుండా చ‌ట్ట‌ ప్ర‌కారం వీరి అరెస్టుల విష‌యంలో ప్ర‌భుత్వం ముందుకెళ్తుండ‌టం గ‌మ‌నార్హం. తెలుగుదేశం కూటమి  ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండు నెల‌లు అయ్యింది. ఈ స్వ‌ల్ప కాలంలో సీఎం చంద్ర‌బాబ నాయుడు రాష్ట్రంలో అభివృద్ధిని ఉరుకులు పెట్టిస్తున్నారు. శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉండ‌టంతో ప్ర‌జ‌లు సైతం ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జీవ‌నం సాగిస్తున్నారు. వైసీపీ ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం చంద్ర‌బాబు పాల‌న ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో వైసీపీ హ‌యాంలో హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తించిన నేత‌ల అరెస్టుల వ్య‌వ‌హారాన్ని ప్ర‌జ‌లు స‌మ‌ర్ధిస్తున్నారు.

వైసీపీ హ‌యాంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న సాగించారు. రాష్ట్రంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించి ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టి వాళ్లను జైళ్ల‌కు పంపించేందుకే అధిక ప్రాధాన్య‌త‌ ఇచ్చారు. ఈ క్ర‌మంలో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడునుసైతం అక్ర‌మంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. వైసీపీ ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించిన ప్ర‌తి ఒక్క‌రిపై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం,  జైళ్ల‌కు పంపించ‌డ‌మే ప‌నిగా జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న సాగింది. మ‌రోవైపు చంద్ర‌బాబు నాయుడు, లోకేశ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటు వారి కుటుంబ స‌భ్యుల‌పైనా వైసీపీ నేత‌లు ఇష్ట‌ారీతిగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.  చంద్ర‌బాబు స‌తీమ‌ణిని అసెంబ్లీ వేదిక‌గా అవ‌మానించారు.  క‌క్ష‌పూరిత పాల‌న‌తో పాటు రాష్ట్రంలో ఎక్క‌డా అభివృద్ధి లేక‌పోవ‌టంతో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. కేవ‌లం 11 అసెంబ్లీ స్థానాల‌కు వైసీపీని ప‌రిమితం చేసి క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం చంద్ర‌బాబు త‌న అపార పాల‌నా అనుభ‌వంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌త ఐదేళ్ల కాలంలో అదుపు త‌ప్పిన శాంతి భ‌ద్ర‌త‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. త‌ద్వారా రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీల ప్ర‌తినిధులు ముందుకొచ్చేలా ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొనేలా చేశారు. దీంతో చంద్ర‌బాబు రెండు నెల‌ల పాల‌న ప‌ట్ల అన్నివ‌ర్గాల‌ ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. 

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ నేత‌ల‌పై క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త‌నిస్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, రాష్ట్ర అభివృద్ధే త‌మ మొద‌టి ప్రాధాన్య‌తగా చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, లోకేశ్ ముందుకెళ్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు పార్టీ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను స‌ముదాయిస్తూ రాష్ట్రంలో ఎక్క‌డా ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం మంచిత‌నాన్ని సాకుగా తీసుకొని ప‌లువురు వైసీపీ నేత‌లు ఇంకా అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమేనన్నట్లుగా  వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప‌లు ప్రాంతాల్లో తెలుగుదేశం, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు దిగుతున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్రంలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను చంపేస్తున్నారంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో  తెలుగుదేశం, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా త‌మ‌పై వైసీపీ నేత‌లు దాడులు కొన‌సాగుతున్నాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వారిని సముదాయిస్తూనే  రెచ్చిపోతున్న వైసీపీ నేత‌ల‌పై కొర‌ఢా ఝుళిపిస్తున్నారు. అదే సమయంలో  గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో అవినీతి అక్ర‌మాలు, భూదందాల‌కు పాల్ప‌డిన వైసీపీ నేత‌ల‌ను చ‌ట్ట‌ప‌రంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

వైసీపీ హ‌యాంలో పెద్ద ఎత్తున భూక‌బ్జాల‌కు పాల్ప‌డినట్లు ఆరోప‌ణ‌లుఉన్న‌ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై ప్ర‌భుత్వం దృష్టిసారించింది. ప్ర‌భుత్వం ఆదేశాల‌తో అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నారు.  వంద‌లాది ఎక‌రాల భూముల‌ను పెద్దిరెడ్డి క‌బ్జాల‌కు పాల్ప‌డ్డార‌ని అధికారుల విచార‌ణ‌లో తేలింది. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లో పెద్దిరెడ్డి అరెస్టు ఖాయ‌మ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. మ‌రోవైపు చంద్ర‌బాబు ఇంటిపై దాడి కేసులో జోగి ర‌మేశ్ పై ఇప్ప‌టికే కేసు న‌మోదైంది. ఆయ‌న్ను త్వ‌ర‌లోనే విచారించి అరెస్టు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ జోగి రమేష్ కు కోర్టులో ఊరట లభించలేదు. అలాగే గన్నవరం తెలుగుదేశం కార్యాల‌యంపై దాడి కేసులో నిందితుడుగా ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీ కోసం పోలీసుల వేట కొన‌సాగుతోంది.  తాజాగా అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విష‌యంలో జోగిర‌మేశ్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.  వీరి త‌రువాత ఎవ‌ర‌నే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. కొడాలి నాని, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ తోపాటు ప‌లువురు వైసీపీ నేత‌లు త్వ‌ర‌లో అరెస్టు అవ్వ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ వర్గాలే అంటున్నారు. దీంతో  ఎవరు ఎప్పుడు అరెస్టవుతారా అన్న భయం వైసీపీ నేతలలో వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.