ఫైళ్ల దగ్ధం వెనుక కుట్రదారులను అరెస్టు చేయాలి!

Publish Date:Aug 19, 2024

Advertisement

వైసీపీ హయాంలో వివిధ శాఖలలో జరిగిన అవినీతి, అక్రమాలు, అన్యాయాలు వెలుగులోకి రాకూండా ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ఇప్పుడు ఫైళ్ల దగ్ధం అనే కార్యక్రమం సాగుతోందా అనిపిస్తోంది.  గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో కీలకమైన ఫైళ్లు దగ్ధం అవుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.  

ప్రభుత్వ కార్యాలయాలలో వరుసగా జరుగుతున్న ఫైళ్ల దగ్ధం వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. మదనపల్లో సబ్ కలెక్టర్ కార్యాలయంతో మొదలు పెడితే తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ఫైళ్ల దగ్ధం వరకూ జరిగిన సంఘటనల వెనుక కుట్రకోణాన్ని వెలికి తీయాలన్న డిమాండ్ జోరందుకుంటోంది. ఈ ఫైళ్ల దగ్ధం సంఘటనలపై విచారణ అంటూ కాలయాపన చేయకుండా, కుట్రదారులను వెంటనే అరెస్టు చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండ్  చేశారు.  మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలోని మదనపల్లెలో పెద్ద ఎత్తున ఫైళ్ళు ధగ్దం చేశారని, వేలాది మంది రైతుల   భూములు అన్యాక్రాంతం అయ్యాయనీ, రికార్డులు తారుమారు అయ్యాయనీ, రైతులపై దౌర్జన్యాలకు పెద్దిరెడ్డి మనుషులు తెగబడ్డారన్న వందల ఫిర్యాదులు ఉన్నాయనీ, ఈ నేపథ్యంలోనే ఫైళ్లు దగ్ధం కావడం పులు అనుమానాలకు తావిస్తోందని ఆయనో ప్రకటలో పేర్కొన్నారు.

ఇప్పుడు తాజాగా  ధవళేశ్వరం కార్యాలయంలో పోలవరం ముంపు నిర్వాసితులకు సంబంధించిన నష్టపరిహారం దస్త్రాలు దగ్ధమయ్యాయి.  దాదాపు 4,202 కోట్ల పోలవరం ప్రధాన కాలువ నిర్మాణ పనులు, భూసేకరణ దస్త్రాల దగ్ధం వెనుక కూడా కుట్ర ఉందన్నారు. అలాగే విజయవాడలోని ప్రభుత్వ కార్యాలయాలలో కూడా ఫైళ్ల దగ్ధం సంఘటనలు జరిగాయని పేర్కొన్నారు.  ఫైళ్ళు ఎందుకు దగ్ధం అవుతున్నాయో, దీని వెనుక ఉన్న కుట్ర కోణం ఏమిటో  వెల్లడి కావాలన్నారు.  వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల సాక్ష్యాలు లేకుండా చేయాలన్న దురుద్దేశంతోనే కొందరు అధికారుల సహకారం, పర్యవేక్షణతొ ఇవి జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.  ఇందులో భాగమైన ఉద్యోగులపై సస్పెన్సున్, బదిలీలతో సరిపెట్టే ధోరణి వీడి, కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు. 

By
en-us Political News

  
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.