పాక్ అణుబాంబులు భయపెట్టడానికేనా?
Publish Date:Aug 11, 2025
Advertisement
సింధూనది పై ప్రాజెక్టు కడితే అణుబాంబులేస్తానంటోంది పాక్. మొన్నటికి మొన్న ఇదే అణు బాంబుల విషయంలో భారీ ఎత్తున భయపడబట్టే కదా? కాళ్లు పట్టుకుని మరీ ఇండియాతో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది? ఈ విషయం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మరచిపోతే ఎలా? మొన్నటి యుద్ధంలో భారత్ పాక్ ని భయపెట్టకుండా ఏకంగా ఆ దేశ అణు నిల్వలున్న ప్రాంతంలో బాంబులు జార విడిచి ఉండాల్సింది. జస్ట్ ఆ నూర్ ఖాన్ బేస్ పై బ్రహ్మోస్ లు వదిలినందుకే తల్లడిల్లిపోయింది పాక్. ఈ ఎయిర్ బేస్ కి దగ్గర్లో ఇటు ఆర్మీ చీఫ్ హెడ్ క్వార్టర్ తో పాటు అటు అణు నిర్వహణ చేసే నేషనల్ కమాండ్ ఆఫీసు కూడా ఉంటుంది. ఇక్కడ భారత్ బాంబులు పడ్డంతనే.. ఇదే పాక్ ఆర్మీ చీఫ్.. జడుసుకుని బంకర్లో దాక్కున్నాడు. అలాంటి బీరువు ఇప్పుడు మళ్లీ బీరాలు పలుకుతున్నాడు. సింధూనది మీద ప్రాజెక్టు కడుతున్నందుకే ఇలా అంటుంటే మరి బ్రహ్మపుత్రా నది మీద చైనా కడుతున్న ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? సింధూనది ఎలా కుటుంబ ఆస్తి కాదో అదీ అంతేగా? మరి చైనాపై కూడా భారత్ అణు బాంబులు వేయాలా? మొన్న పహెల్గాం దాడి తర్వాత ఇదే సింధూజలాల విషయం వెలుగులోకి వస్తే మేం అణుబాంబులు వేస్తామని అన్నారు పాక్ దేశ నాయకులు. తీరా భారత్ యుద్ధానికి దిగితే వేయాల్సిన బాంబులు వేయడం మానేసి.. బంకర్లలో దాక్కున్నారు. ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉంటే.. ప్రపంచానికే అతి పెద్ద విపత్తుగా భావించిన అమెరికా.. పాక్ విషయంలో ఎందుకో వెనకడుగు వేస్తూనే ఉంటుంది. అంటే పాక్ ద్వారా భారత్ ని భయపెట్టి ఆయుధాలు కొనిపించాలన్న యోచన అమెరికాది. అందుకే ఆ దేశ గడ్డపై నుంచి ఇలాంటి బీరాలు పలికిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెలువడుతున్నాయ్. మేం పోతే సగం ప్రపంచాన్ని లాక్కెళ్లిపోతామని మీరు భయపెడతారేమో.. కానీ భారత్ మొన్నటిలా చేసి చూపిస్తుంది. అయినా యుద్ధం జరుగుతుంటే మన దగ్గర ప్లాన్స్ లేవు ప్రేయర్సే అన్న మునీర్ కూడా .. ఇలా భారత్ ను భయపెట్టేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యంగా ఉంది. ట్రంప్ కుటుంబానికి అమ్ముడుపోయి పాకిస్థాన్ని తాకట్టి పెట్టి బతుకుతున్న మునీర్ సైన్యాధ్యక్షుడంటే ఆసియాకే అవమాన కరంగా ఉందని అంటున్నారు దౌత్య నిపుణులు.
http://www.teluguone.com/news/content/are-pakistan--nuclear-bombs-just-to-scare-39-204001.html





