పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ 2.!

Publish Date:Aug 18, 2026

Advertisement

పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తరువాత దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నాలుగో స్థానానికి పరిమితమైంది. దేశంలో పెట్టుబడుల  ఆకర్షణలో   నవ్యాంధ్రప్రదేశ్  రికార్డు స్థాయి పురోగతి  సాధించింది. పెట్టుబడుల ఆకర్షణలో గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు    రాష్ట్రాలు ఆధిపత్యం కొనసాగుతున్నది. అయితే వాటిని తోసి రాజని ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానికి ఎగబాకింది. 

బిజినెస్ స్టాండర్డ్, అలాగే..  దేశవ్యాప్తంగా పెట్టుబడుల సమాచారాన్ని ట్రాక్ చేసే   ప్రాజెక్ట్స్ టుడే తాజా నివేదిక ప్రకారం, నూతన పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్  రెండో స్థానానికి ఎగబాకింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఏపీ ఏడు స్థానాలు మెరుగుపడింది.  2023-24 ఆర్థిక సంవత్సరంలో  9వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్  2024-25 5వ స్థానానికి, ఇప్పుడు అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో  2వ స్థానానికి చేరుకుంది. 

ఈ పురోగతికి  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వ   విధానాలు , పెట్టుబడిదారులలో  కలిగిస్తున్న నమ్మకమే ప్రధాన కారణమనడంలో సందేహం లేదు.  గతంలో   ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కే పరిమితమైన నినాదాన్ని, ఇప్పుడు  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మార్చి,  పారిశ్రామిక అనుమతుల మంజూరులో చూపుతున్న వేగం,  ప్రాజెక్టుల గ్రౌండింగ్ లో జాప్యం నివారణ పద్ధతుల అమలే కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశమైన గుజరాత్ రాష్ట్రం ఈ పెట్టుబడుల పోటీలో నాలుగో స్థానంలో నిలవగా, చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానాన్ని కైవశం చేసుకోవడం ఇప్పుడుదేశ వ్యాప్తంగా పారిశ్రామిక రంగంలో చర్చనీయాంశంగా మారింది.  ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా కొత్త పెట్టుబడులను పొందుతున్నప్పటికీ, ఏపీ సాధించిన వృద్ధి వేగం ముందు అవి సాధించినది చాలా స్వల్పమనే చెప్పాలి. 

ఆంధ్రప్రదేశ్ వైపు అంతర్జాతీయ, జాతీయ పెట్టుబడిదారులు పరుగులు తీయడానికి బహుముఖ రంగాలు కారణంగా చెప్పుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం (renewable energy), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,ఐటీ, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్,  లాజిస్టిక్స్ రంగాలలో ఏపీ భారీగా మూలధనాన్ని రాబడుతోంది.  బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక..  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన  మొత్తం ప్రతిపాదిత పెట్టుబడులలో ఏపీ  25.3 శాతం వాటా దక్కించుకుంది.   సుస్థిర పాలన, పెట్టుబడిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన,  విధానపరమైన సంస్కరణలు ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మారుస్తున్నాయి. పారిశ్రామిక వృద్ధిలో పాత పరిమితులను అధిగమించి, దేశంలోనే పెట్టుబడుల రాజధానిగా ఎదిగే దిశగా ఏపీ వేగంగా అడుగులు వేస్తోంది. 

APinvestmentrankings, Chandrababu Naidu investments, APrises, 2nd rank, Gujarat 4th, Projects Today report, Speed of doing business AP

By
en-us Political News

  
 ఘటనా స్థలాన్ని సందర్శించిన మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. భద్రతా నియమాలు పాటించకపోవడం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్థారంచారు.  
 సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఎయిల్ జిల్లా మార్రాయా తీరానికి   3.5 నాటికల్ మైళ్ల   దూరంలో ఎనిమిది మంది సాయుధులైన సోమాలియా పైరేట్లు   నౌకపైకి విరుచుకుపడి, దానిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నౌకను నుగాల్ తీరం వైపు  మళ్లించారు.
లండన్ తో పాటు అమెరికాలోని ప్రముఖ నగరాలైన బోస్టన్, న్యూయార్క్ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందుకు సంబంధించిన  షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు 11 21, 21 15, 17 21తో వాంగ్ జి యి చేతిలో ఓడిపోగా, సాత్విక్ చిరాగ్ మరియు ట్రీసా గాయత్రి జోడీలు సంచలన విజయాలతో క్వార్టర్స్‌లోకి ప్రవేశించాయి. తదుపరి మ్యాచ్ వివరాలు ఇవే
ఏఎఫ్సీ విమెన్స్‌‌ చాంపియన్స్ లీగ్‌లో ఈస్ట్‌‌ బెంగాల్‌‌ ఎఫ్‌‌సీ 12 0 తేడాతో రోవర్స్‌‌ ఎఫ్‌‌సీపై చారిత్రాత్మక విజయం సాధించింది. 40 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ ఆసియా పోటీల్లో ఇండియన్ క్లబ్ సాధించిన అతిపెద్ద విజయం ఇదే!
మేటా స్మార్ట్ గ్లాసెస్‌పై UK సినిమా థియేటర్లలో నిషేధం విధించే ఆలోచన మొదలైంది. ప్రైవసీ ఆందోళనలతో పాటు రహస్యంగా సినిమాలు రికార్డు చేసి పైరసీ చేసే ప్రమాదం ఉండటంతో ఈ సంచలన నిర్ణయం వైపు అడుగులు పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆ వివాదాల పరిష్కారం దిశగా ముందుకు సాగేందుకు సదరన్ జోనల్ కౌన్సల్ దోహదం చేసిందన్న ఆశను రేకెత్తించింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ( తెలంగాణ సీఎం మినహా) ఒకే వేదికపై కనిపిండమే కాకుండా ఆత్మీయంగా ముచ్చటించుకుంటున్న దృశ్యం కన్నుల పండువగా ఉంది. 
ది బిగ్ బ్యాంగ్ థియరీ పాపులర్ స్పిన్ ఆఫ్ సిరీస్ స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ సీజన్ 2 పై క్రియేటర్స్ చక్ లోరే, జాక్ పెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షో భవిష్యత్తు ప్రణాళికలు మరియు HBO Max నిర్ణయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రపంచ దిగ్గజ సంస్థలైన సిస్కో, శామ్‌సంగ్, AWS లను వణికించిన భారీ సప్లై చైన్ సైబర్ దాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. LiteLLM టూల్ ద్వారా 2,500 కి పైగా కంపెనీల రహస్య క్లౌడ్ డేటా, కీలు ఎలా లీక్ అయ్యాయో చూడండి.
ప్రముఖ టెక్ దిగ్గజం ఏసర్ ఇప్పుడు హౌస్ ఆఫ్ ఏసర్గా అవతరిస్తోంది. ల్యాప్‌టాప్‌లకే పరిమితం కాకుండా అక్షయ్ కుమార్‌ను అంబాసిడర్‌గా పెట్టి గృహోపకరణాలు, లగేజ్, టీవీలు, స్మార్ట్ రింగ్స్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
గాజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ గాజా క్యాపిటల్ ఐపీఓ చివరి రోజు నాటికి 2.52 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. జీఎమ్‌పి, లిస్టింగ్ గెయిన్స్, లాట్ సైజు మరియు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల రేటింగ్స్ పూర్తి సమాచారం తెలుసుకోండి.
రంగారెడ్డి జిల్లా ఎమ్మార్వో దేశం శ్రీనివాస్ రెడ్డి నివాసాలపై ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ. 100 కోట్ల అక్రమాస్తులు వెలుగుచూశాయి. కేజీకి పైగా బంగారం, స్థలాలు, భవనాలు మరియు బార్‌లో పెట్టుబడులకు సంబంధించిన విస్తుపోయే నిజాలు ఈ కథనంలో చదవండి.
భారతదేశంలో ఇంటర్నెట్ సౌకర్యం లేని సుదూర గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తామని ఎలన్ మస్క్ హామీ ఇచ్చారు. 11 వేలకు పైగా గ్రామాల్లో 4G నెట్‌వర్క్ లేని పరిస్థితుల్లో, స్పేస్‌ఎక్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయం మరియు భారతీయ నిబంధనల సవాళ్లపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.