సీఎం రేవంత్ పది రోజుల విదేశీ పర్యటన.. ఎందుకంటే?
Publish Date:Aug 18, 2026
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం (ఆగస్టు 20) నుంచి పది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన ఈ పది రోజులలో బ్రిటన్, అమెరికాలలో పర్యటిస్తారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం రేవంత్ విదేశీ పర్యటన సాగనుంది. ఆయన తిరిగి ఆగస్టు 30న హైదరాబాద్ చేరుకుంటారు. అంతకు ముందు అంటే బుధవారం (ఆగస్టు 19)న రేవంత్ రెడ్డి హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఆ సమావేశం అనంతరం అదే రోజు రాత్రి ఆయన ఢిల్లీ నుంచే నేరుగా లండన్ బయలుదేరతారు. అక్కడ గురువారం(ఆగస్టు 20) ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ కుమార్తె వివాహవేడుకకు హాజరౌతారు. కాగా తన విదేశీ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ వర్సిటీల ప్రతినిధులతో భేటీ, బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ సందర్శన ఉన్నాయి. అలాగే.. ఎమిరేట్స్ స్టేడియంలో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ ప్రెజెంటేషన్‌కు రేవంత్ రెడ్డి హాజరవుతారు. అనంతరం ఆగస్టు 23న అమెరికాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ బోస్టన్‌లోని హార్వర్డ్, ఎంఐటీ క్యాంపస్‌లను సందర్శిస్తారు. నార్త్‌ఈస్టర్న్, వర్జీనియా టెక్ యూనివర్సిటీల ప్రతినిధులతో భేటీ అవుతారు. న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఆగస్టు 27, 28 తేదీల్లో గ్లోబల్ సీఈవోలు, క్యాపిటలిస్టులు, బహుళజాతి సంస్థల అధిపతులతో రౌండ్‌టేబుల్ సమావేశాలలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులపై ఆయన ఈ సమావేశాల్లో ప్రసంగిస్తారు. Telangana cm Revanth reddy foriegn tour, Tendays, America, England, Investments, Aim
http://www.teluguone.com/news/content/telangana-cm-revanth-reddy-foriegn-tour-36-229220.html





