పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఆరోగ్యం విషమం?

Publish Date:Aug 18, 2026

Advertisement

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్  ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా?  ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా?  అంటే ఆ దేశ మాజీ అధ్యక్షుడు   ఆరిఫ్ అల్వీ ఔననే అంటున్నారు.  సుదీర్ఘ కాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్  వైద్య నివేదికలను పలువురు సీనియర్ వైద్య నిపుణులతో కలిసి సమగ్రంగా విశ్లేషించిన అనంతరం ఈ విషయం బయటపడిందని ఆయన చెబుతున్నారు.  

వైద్య నివేదికల ప్రకారం ఇమ్రాన్ తీవ్రమైన గుండె దడ,   రక్తపోటు,  మానసిక ఒత్తిడి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు అల్వీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయనను వెంటనే జైలు నుంచి బయటకు తరలించి,   ఆధునిక ఆసుపత్రిలో స్వతంత్ర వైద్యుల బృందం పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం  ఉందని ఆరిఫ్ అల్వీ చెబుతున్నారు.  

 ఇమ్రాన్ ఖాన్‌కు కార్డియాక్ ఆందోళనలు ఉన్నందున వెంటనే కార్డియాక్ ఎంఆర్‌ఐ, సీటీ యాంజియోగ్రామ్, స్ట్రెస్‌ టెస్ట్‌ ,  ఎకోకార్డియోగ్రామ్‌ వంటి కీలక వైద్య పరీక్షలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.  

గత మూడేళ్లుగా జైలు గోడల మధ్య ఏకాంతంగా ఉండటం ఇమ్రాన్ ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిందన్న  అల్వీ  దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత, సొంత పార్టీకి చెందిన సహచర నాయకుల అరెస్టులు, కొందరి అకాల మరణాలు ఆయనపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచాయన్నారు. దీనికి తోడు సమాచార వ్యవస్థకు దూరంగా ఉంచడం, కనీసం పుస్తకాలు, వార్తాపత్రికలు చదివేందుకు కూడా పరిమిత అనుమతులు మాత్రమే ఇవ్వడం సమస్యను   తీవ్రం చేసిందన్నారు. 

మరోవైపు, గత ఏడు నెలలుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు, వ్యక్తిగత వైద్యులకు, న్యాయవాదులకు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారని ఇటీవల  కుమారులు ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో గళమెత్తిన సంగతి విదితమే.   ఈ పరిణామాల నేపథ్యంలో  మాజీ అధ్యక్షుడు చేసిన హెచ్చరికలు ఇమ్రాన్ మద్దతుదారుల్లో  ఆందోళనకు కారణమయ్యాయి. 

పాకిస్థాన్ ప్రధానిగా 2018 నుండి 2022 వరకు సేవలందించిన ఇమ్రాన్ ఖాన్, అధికార పతనం అనంతరం 2023 నుంచి వివిధ కేసులలో జైలు జీవితం గడుపుతున్నారు. అయితే తనపై నమోదైన ప్రతి కేసూ రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగమేనని, ప్రస్తుత పాలకులు ఉద్దేశపూర్వకంగానే తనను వేధిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన పార్టీ నాయకత్వం గట్టిగా చెబుతోంది. 

Imran Khan Health Critical,  Pakistan Politics, Arif Alvi,  Adiala Jail, Pakistan News

By
en-us Political News

  
ఆగస్టు 19 నాటి బంగారం ధరల పూర్తి వివరాలు. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో 24 క్యారట్లు, 22 క్యారట్ల పసిడి ధరలు ఎంత తగ్గాయో తెలుసుకోండి.
నింటేండో స్విచ్ 2 కోసం డియాబ్లో 4 లాంచ్ డేట్ లీక్ అయింది. సెప్టెంబర్ 15న ఏజ్ ఆఫ్ హేట్రెడ్ కలెక్షన్‌తో $69.99 ధరకు విడుదల కానున్న ఈ గేమ్ వివరాలు, ఎక్స్‌పాన్షన్లు మరియు ఫిజికల్ బాక్స్ సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
ప్రైమ్ వీడియోలో దూసుకుపోతున్న జాక్ రీచర్ సిరీస్‌పై మీకున్న పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి! టామ్ క్రూజ్, అలన్ రిచ్‌సన్ మరియు లీ చైల్డ్ నవలల ఆధారంగా రూపొందించిన ఈ అల్టిమేట్ క్విజ్‌లో 70% స్కోర్ చేయడం నిజమైన అభిమానులకే సాధ్యం.
గూగుల్ తీసుకొస్తున్న సరికొత్త ఏఐ ఫోటోస్కాన్ టెక్నాలజీతో మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా బాడీ ఫ్యాట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవెల్స్ మెడికల్ గ్రేడ్ ఖచ్చితత్వంతో సులభంగా కొలవచ్చు.
ప్రపంచకప్ టోర్నీలో బెల్జియం చేతిలో చేదు ఓటమి తర్వాత సెనెగల్ ఫుట్‌బాల్ జట్టు తమ కోచ్ పేప్ తియావ్‌ను తొలగించి, ఫ్రాన్స్ దిగ్గజం ప్యాట్రిక్ వియెరాను నయా హెడ్ కోచ్‌గా నియమించింది. సెనెగల్ జట్టులో వచ్చిన ఈ సంచలన మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి రూపాయి విలువ 95.73 వద్ద స్థిరపడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల మధ్య ఆర్‌బీఐ సమర్థవంతమైన జోక్యంతో భారత కరెన్సీకి లభించిన ఊరటపై పూర్తి వివరాలు ఇవే!
ఏఐ స్టాక్స్ సుడిగుండంలో చిక్కుకోవడంతో ఆసియా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. కొరియా కోస్పీ 5.2% తగ్గగా, శామ్‌సంగ్, ఎన్‌విడియా సహా దిగ్గజ టెక్ షేర్లు పడిపోయాయి. పెరుగుతున్న చమురు ధరలు, మార్కెట్ నష్టాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
భారతీయ యంగ్ క్రికెటర్ దేవదత్ పడిక్కల్ డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. షెహనాజ్ గిల్ మరియు రియాంజలి నంజప్పతో ఆయనకున్న రూమర్స్, ఐపీఎల్ స్టాండ్స్‌లో జరిగిన సంఘటనలు మరియు క్రికెట్ ప్రదర్శన వివరాలతో కూడిన సమగ్ర కథనం చదవండి.
బైయర్న్ మునిచ్ స్టార్ మిడ్‌ఫీల్డర్ జామల్ ముసియాలా 4 రోజుల్లో 2 సార్లు మైదానంలో కుప్పకూలారు. తనకు న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించిన జర్మనీ ఫుట్‌బాల్ స్టార్. పూర్తి వివరాలు ఇవే!
ఇంగ్లాండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ రికీ పాంటింగ్ ఆల్‌టైమ్ టెస్టు రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం 79 పరుగుల దూరంలో ఉన్నాడు. స్వదేశంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రూట్ సృష్టించబోతున్న చారిత్రాత్మక రికార్డు వివరాలు ఇవే!
గత నెల  25న సీవాన్ ప్రాంతంలోని  జేపీ చౌక్ సమీపంలో  విద్యార్థులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టిన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో విధుల్లో  పోలీస్  అభిషేక్ కుమార్   ఏకే47తో కాల్పులకు తెగబడ్డాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.