వైసీపీలో పీక్స్ కు చేరిన ఫస్ట్రేషన్..

Publish Date:May 30, 2022

Advertisement

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారపీఠం ఎక్కి మూడేళ్లు పూర్తయింది. ఈ మూడేళ్లలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ గానీ, వైసీపీ సర్కార్ కానీ ప్రజల కోసం చేసిందేమీ లేదు, సాధించింది కూడా ఏమీ లేదనేది  జనం నుంచి తీవ్రంగా వస్తున్న విమర్శ. అయినప్పటికీ ఏదో పొడిచేశామనే ఫీలింగ్ మాత్రం జగన్ అండ్ కోలో ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు. అనాలోచిత, అనుభవం లేని నిర్ణయాలతో రాష్ట్రాన్ని   ఆర్థికంగా దివాలా తీయించడమే కాకుండా.. ప్రాథమిక సౌకర్యాలను కూడా కల్పించలేక చతికిలపడిన విషయం జనానికి బాగానే అర్థం అవుతోంది.

దీంతోనే మూడేళ్లలోనే జనంలో వైసీపీ సర్కార్ పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతోంది.  ఎక్కడ చూసినా ప్రజల నుంచి నిరసనలు, వ్యతిరేకతలు వ్యక్తం అవుతున్నాయి. ‘సామాజిక న్యాయ భేరి’ పేరుతో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులు చేసిన బస్సు యాత్ర తుస్సు మంది. వైసీపీ మంత్రులు ఎక్కడ సభ పెట్టినా జనానికి కూలి ఇచ్చి మరీ తెప్పించుకున్నా.. ప్రసంగాలు  ప్రారంభం అయ్యే సమయానికే సొమ్ములిచ్చి మరీ తీసుకువచ్చిన జనం పొలోమంటూ లేచి వెళ్ళిపోయారు.

మరో పక్కన టీడీపీ కార్యక్రమాలకు జనం పోటెత్తుతున్నారు. బాదుడే బాదుడు, మహానాడు కార్యక్రమాలే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. వైసీపీ పాలనపై తమ వ్యతిరేకతను, నిరసనను జనం బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. అటు వైసీపీ కార్యక్రమాలకు వచ్చేందుకు ఇష్టపడకపోవడం, ఇటు టీడీపీ ఏ కార్యక్రమం తీసుకున్నా సక్సెస్ చేయడమే దీనికి తాజా ప్రత్యక్ష నిదర్శనం.  దీంతో సీఎం జగన్ సహా వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు, నేతల్లో ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది.

మొన్నా మధ్యన సీఎం జగన్   వెంట్రుక కూడా పీకలేరంటూ తన ఫ్రస్టేషన్ ను బహిరంగంగా వెళ్లగక్కేసారు. దీంతో ఆయన మంత్రివర్గ సహచరులు, మాజీ మంత్రులూ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ ను దాచుకునే కనీస మర్యాదను, విలువలను పాటించడం లేదు.  తాజా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో తన ఫ్రస్టేషన్ ను బయటపెట్టుకున్నారు. సభ జరుగుతుండగా ఓ మీడియా ప్రతినిధిపై విరుచుకుపడుతూనే అవంతి శ్రీనివాసరావు.. అక్కడే ఉన్న ఓ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ పై నోరు పారేసుకోవం ఇందుకు నిదర్శనం‘నీకు ఉద్యోగం ఇచ్చింది ఎందుకు.. నీ సంగతి చూస్తానం’టూ అవంతి తనలో ఉన్న ఫ్రస్టేషన్ వెళ్లగక్కారు. తాజాగా మంత్రుల ‘సామాజిక న్యాయ భేరి’ బస్సుయాత్ర అనంతపురం జిల్లాలో ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి వెళ్తూ మంత్రి బొత్స సత్యనారాయణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు బస్సుదిగి వెళ్ళారు, ఆ సమయంలొ అడ్డొచ్చిన ఓ డఫేదారుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక చైతన్య బస్సు యాత్రలో వైసీపీ మంత్రులు ప్రతి చోటా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆడిపోసుకోవడంపైనే దృష్టి సారించడం ఏంటనే ప్రశ్నలు జనం నుంచి వస్తున్నాయి. రాజకీయంగా విమర్శిస్తే సరేసరి.. కానీ వ్యక్తిగతంగా ‘చంద్రబాబు మెదడు చితికిపోయింది’ లాంటి విమర్శలు చేయడమేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  

ఈ మూడేళ్లలో ఏపీ ప్రజల బాగు కోసం తాము చేసిందేమిటో చెప్పుకోలేని వైసీపీ నేతలు ప్రతిపక్ష తెులుగుదేశం నేతలను, ఆ పార్టీ కార్యక్రమాలను టార్గెట్ గా చేసుకుని ఇష్టారీతిగా వ్యఖ్యలు, విమర్శలు చేస్తూ తమ లోని  ఫ్రస్టేషన్ బయటపెట్టుకుంటున్నారు. ఒంగోలులో జరిగిన మహానాడుపై వైసీపీ  ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించడం గమనార్హం. పనిలో పనిగా చంద్రబాబును ఆయన టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడం తమలోని అసహనాన్ని కాస్తయినా చల్చార్చుకోవడానికే నని పరిశీలకులు ఉంటున్నారు. మహానాడును ‘ఏడుపునాడు’ అంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించినా.. ‘చంద్రబాబుది అబద్ధాల ఏడుపు’ అంటూ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నా.. అదంతా వారిలో పెరిగిపోతున్న ఫ్రస్టేషనే అంటున్నారు.  ఒటమి భయమే వారిలో ఫ్రస్ట్రేషన్ రూపంలో బయటపడుతోందని తెలుగుదేశం నేతలు ఎద్దేవా చేస్తున్నారు. 

By
en-us Political News

  
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.