మంత్రి పదవి ప్లీజ్.. జగన్ కు సీనియర్ల డిమాండ్

Publish Date:Jun 25, 2021

Advertisement

రాజకీయాలలో ఉన్నవారికి పదవీ వ్యామోహం ఉండడం సహజం. అందులోనూ దశాబ్దాల తరబడి రాజకీయాలలో ఉన్నవారికి వయసు పెరిగే కొద్దీ కోరికలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఎమ్మెల్యే అయిన వారికి  మంత్రి  కావాలని ఉంటుంది, మంత్రి అయిన వారికీ ముఖ్యమంత్రి ... అలా.. అలా .. ఆశలు  పైమెట్లకు నిచ్చెనలు వేస్తూనే ఉంటాయి.  అయితే అందరి కోరికలు తీరవు. కొందరి కోరికలు కొంతవరకు తీరి ..ఇక ఆపైన కదలవు. కొందరికి పదవులు వస్తూనే ఉంటాయి కానీ, ఆశించిన పదవి అందని ద్రాక్షగానే మిగిలి పోతుంది .  

ప్రణబ్ ముఖర్జీ విషయాన్నే తీసుకుంటే, ప్రధాని పీఠంలో కూర్చోవాలన్నఆయన కోరిక తీరలేదు. చివరకు రాష్ట్ర పతి పదవి దక్కినా.. అన్ని అర్హతలు ఉన్నా ప్రధాని కాలేక పోయాననే బాధ మాత్రం ఆయన్ని వెంటాడింది. ఆ బాధను అయన దాచుకోలేదు. ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ పుస్తకంలో అందరితో పంచుకున్నారు. అందులో ఆయన ఇందుకు సంబంధించి ప్రస్తావించిన అంశాలను గమనిస్తే, రాష్ట్రపతి పదవిని అలకరించడం గర్వకారణంగా భావించినా,  ఆయన దాన్నొక కన్సొలేషన్ బహుమతిగానే తీసుకున్నారా అనిపిస్తుంది.

ప్రధాని పదవిని ఆశించి భంగపడిన వారు ఒక్క ప్రణబ్ దాదా మాత్రమే కాదు. ఇంకా ఉన్నారు. బీజేపీ అగ్ర నేత ఎల్కే అద్వానీ, అలాగే  కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, కామ్రేడ్ జ్యోతి బసు ఇలా ఎందరినో ప్రధాని పదవి ఇలా ఊరించి, అలా చేజారి పోయింది. 2004 లో సోనియా గాంధీ ఆల్మోస్ట్ చివరి మెట్టువరకు వరకు వెళ్లారు.  మద్దతు ఇస్తున్న ఎంపీలు, పార్టీల లేఖలు పట్టుకుని, రాష్ట్రపతి భవన్’ మెట్లేక్కారు బట్, అక్కడ ఏమైందో ఏమో,సీన్ మారిపోయింది. ఆమె నిరాశగా వెనక్కి వచ్చారు. అదృష్తం మన్మోహన్ సింగ్’ ను వరిచింది. అయితే, ఆమె ప్రధాని కాలేక పోయినా మన్మోహన్ సింగ్ ప్రధానిగా  ఉన్న పదేళ్ళు ఆమె  ‘సూపర్ పీఎం’ గా  చక్రం తిప్పారు.  అంతకు చాలా ముందే, యునైటెడ్ ఫ్రంట్ అధికారంలో ఉన్నరోజుల్లో జ్యోతిబసుకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. అయితే ఆయన పార్టీనే అడ్డుపుల్ల వేసింది. అవకాశం చేజారిపోయింది. ఆ తర్వాతి కాలంలో జ్యోతిబసు, అప్పటి పార్టీ  నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించారు. బాధపడ్డారు. అద్వానీ విషయానికి వస్తే పార్టీ రెండు సార్లు ఆయన్ని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించినా, ప్రజలు అవకాశం ఇవ్వలేదు. చివరకు ప్రజలు అవకాశం ఇచ్చే సమయానికి, మోడీ వచ్చి కర్చీఫ్ వేశారు.  ఆయనకు కూడా ప్రణబ్ ముఖర్జీలా రాష్టపతి గౌరవం అన్నా దక్కుతుందని ఆశించినా అదీ అందని ద్రాక్షగానే మిగిలి పోయింది.  

ఆం ధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అంతెత్తు పెద్ద కుర్చీ (స్పీకర్ చైర్) మీద ముఖం మొత్తింది.ఇప్పటికే  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో  ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు మరోసారి మంత్రిగా చేయాలని ఆయన చాలా ఆశపడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్, తమ తొలి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన సమయంలో  రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని సమూలంగా మార్చి కొత్త టీమ్’ కు అవకాశం ఇస్తామని ఇచ్చిన హామీ ఆధారంగా చాలా మంది, ముఖ్యంగా ఫస్ట్ టీమ్’ లో బెర్త్ దక్కని సీనియర్లు సెకండ్ హాఫ్ టీంమ్ పై  ఆశలు పెంచుకుంటున్నారు. అందులో తమ్మినేని కూడా ఉన్నారు. అందుకోసం ఆయన భారీ ప్రయత్నాలే చేస్తున్నారని వినికిడి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దని భావిస్తున్న తమ్మినేని,చివరిసారిగా ఆ మంత్రి హోదాను అనుభవించి వెళ్లాలని అనుకుంటున్నట్టు వైసీపీ అధిష్టానానికి విన్నవించుకుంటున్నారట.

2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జగన్ రెడ్డి, ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అని ఓటర్లను వేడుకుంటే, తమ్మినేని ఇదే నా చివరి ఎన్నిక, ఇకపై పోటీ చేయని, గెలిపించండి ప్లీజ్’ అని ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. అలాగే, గెలిస్తే తాను మంత్రి కావడం ఖాయమని నియోజకవర్గానికి కావాల్సిన పనులు చేసి పెట్టి వెళ్తానంటూ ఓటర్లకు విజ్ఞప్తులు చేశారు. అనుకున్నట్టే ఎమ్మెల్యేగా గెలిచారు కానీ.. జగన్ ఆయనకు అసెంబ్లీ స్పీకర్ పదవి కట్టబెట్టారు. అయితే అంతకుముందే రెండున్నరేళ్లే పదవుల్లో కొనసాగుతారని జగన్ స్పష్టం చేయడంతో ఆయన నిర్ణయాన్ని కాదనలేకపోయారు. ఇప్పుడు సమయం దగ్గరపడుతుండటంతో ఎలాగైనా మంత్రి కావాలని తమ్మినేని అనుకుంటున్నారట.ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన తమ్మినేని పార్టీలు మారి, ఇంచు మించుగా 15 ఏళ్లకు పైగానే మంత్రి పదవికి దూరమయ్యారు. దీంతో ఈసారి ఎలాగైనా ఒక్కసారి ఆ మంత్రి పదవిని అనుభవించి వెళ్లాలని గాఢంగా కోరుకుంటున్నారట. 

తమ్మినేని స్టొరీ ఇలా ఉంటే, గతంలో ఉమ్మడి  రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ మంత్రివర్గాల్లో  అంతకు ముందు తర్వాత కూడా మంత్రులగా పనిచేసిన ధర్మాన, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి మాజీ మంత్రులు, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీడియాలో క్రియాశీలంగా కనిపించిన,  అంబటి రాంబాబు, రోజా, భూమ కరుణాకర రెడ్డి లాంటి అనేక మంది తమ్మినేనిలానే, గెలిస్తే మంత్రి పదవి గ్యారంటీ అన్న ధీమాతో  ఉన్నారు. అయినా, జగన్ రెడ్డి హోల్సేల్ గా అందరికీ మొండి చేయి చూపించారు. అలంటి వారంతా ఇప్పుడు, ముఖ్యమంత్రి గారు మంత్రి పదవి ప్లీజ్ అని వేడుకుంటున్నారట ...  అంతా .. ఆ దేవుని దయ.

By
en-us Political News

  
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.