Publish Date:Jul 22, 2022
ఒకప్పుడు ఐటీ అంటే ఏపీ నంబర్ వన్ అనుకునేది ప్రపంచం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు హయాంలో ఐటీ పరుగులు తీసింది. బెంగళూరు చెన్నైలను మించి ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేయడం కోసం ఐటీ పరిశ్రమలు పోటీలు పడేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు హయాంలో బెంగళూరు దిగదుడుపే అన్నట్లుగా ఏపీ పరిస్థితి ఉండేది.
ఐటీ ర్యాంకింగ్స్ లో ఏపీ మేటిగా ఉండేది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఐటీ విషయంలో ఏపీ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ముఖ్యంగా ఐటీ రంగంలో తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్ లో దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు వేసిన పునాదిని అలంబనగా చేసుకున్న తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
స్టార్టప్స్ ఎకోసిస్టం విషయంలో తాజా ర్యాంగింక్సలో ఏపీ పరిస్థితి ఇది. ఇదొక్కటే కాదు.. ఏ రంగం తీసుకున్నా పొరుగు రాష్ట్రమైన తెలంగాణ పైపైకి వెడుతుంటే.. ఏపీ మాత్రం కిందకి దిగజారిపోతోంది. తాజాగా విడుదల చేసిన ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్‌లో కూడా గతంలో ఉన్న మెరుగైన స్థానాన్ని ఏపీ కోల్పోయింది.
సృజనాత్మకత, పెట్టుబడుల ఆకర్షణ, విద్య, హ్యూమన్ ఇండెక్స్ ఆంశాల ఆధారంగా ఎంపిక చేసిన ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్‌లో కర్ణాటక ఫస్ట్ ప్లేస్‌లో నిలిస్తే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. అన్ని రంగాల సగటును పరిగణనలోకి తీసుకుంటే ఉత్తమ పనితీరు కనబర్చి ‘బెస్ట్ పర్‌ఫార్మర్ స్టేట్’గా తెలంగాణకు మొదటి స్థానంలో నిలిస్తే.. ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. గత ఏడాది నాలుగో స్థానంలో ఉన్న ఏపీ మూడు స్థానాలు దిగజారిపోయింది. పలు అంశాలపై నీతి ఆయోగ్, కాంపెటెటివ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తగా 2021 సంవత్సరానికి చేసిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడించింది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-last-in-it-rankings-25-140294.html
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.