జగన్ కు హెడ్‌మాస్టర్ ఏపీ హైకోర్టు!
Publish Date:Aug 30, 2022
Advertisement
ఎవరూ కోర్టు, ఆస్పత్రి మెట్లు ఎక్కకూడదనే అనుకుంటారు. కోర్టు మెట్లెక్కితే పేరంటానికి పిలిచినట్టు విచా రణకు పిలుస్తూనే ఉంటారు. దానికి సమయం, సందర్భం అన్నీ కోర్టు చేతిలోనే ఉంటాయి. కోర్టు పక్షులు కొందరు ఉంటారు. జీవితాంతం ఏదో ఒక కేసులో కోర్టుకు వెళుతూంటారు, అనేక ప్రాంతాల్లో కూడా కోర్టుల పిలుపులు వస్తూంటాయి. కొన్ని కేసుల్లో మొట్టికాయలు పడుతూంటాయి. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ పరిస్థి తి ఇదే. ఇప్పటికే హైకోర్టు చేతిలో హెచ్చరికల దెబ్బలు తిన్నారు. ఇపుడు తాజాగా కొవ్వూరు బ్యాంక్ ఎన్ని కల కేసులో మళ్లీ మరో దెబ్బ తిన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల వ్యవహారం రచ్చకెక్కడం తెలిసిం దే. ఈ ఎన్నికల్లో తెలుగు దేశం సంబంధించినవారు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కానీ అది సహించలేక వైసీపీ వర్గాలు అసలా ఎన్నికలు సరిగా జరగలేదని గోల చేసి రద్దు చేశారు. ప్రభుత్వం నిర్ణయానికి టీడీపీ మండిపడింది. ఎన్నిక ఏకగ్రీవం అయిన తర్వాత అవి సక్రమంగా జరగలేదని వైసీపీ గొడవచేయడమే వారికి సంబంధించినవారు ఎంపిక కాలేదన్న కోపంతోనే ఎన్నికను రద్దుచేయడానికి నిర్ణయం తీసుకుం ది. అంటే ఏ ఎన్నికయినా వైసీపీవారికే అనుకూలించాలన్నపట్టుదల ఆ పార్టీవారు ప్రదర్శించడం అర్ధం లేనిది. ఏక గ్రీవం ఎందుకు అయిందీ తెలిసినా అది వైసీపీ సహించలేకపోతోంది. కోర్టు తీర్పు పట్ల కూడా వైసీపీ నాయకత్వానికి గౌరవం లేకపోవడం వారి తీరుకు అద్దంపడుతోంది. ఎన్నికలు రద్దు చేసి, పాలకవర్గానికి బదులు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారని టీడీపీ వర్గీయులు మండి పడ్డారు. ఈ వ్యవ హారం హైకోర్టు వరకు వెళ్లింది. దీనిపై హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎన్నికలు రద్దు చేసి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేశారని విమర్శించారు. కొవ్వూరు కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని తెలిపారు. హైకోర్టు ఇచ్చి న తీర్పు జగన్ కు చెంప పెట్టు వంటిదని బాబు అన్నారు. బ్యాంకు పాలకవర్గం స్థానంలో ప్రభు త్వం త్రిసభ్య కమిటీ తెచ్చిందని, త్రిసభ్య కమిటీ చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టమైందని చంద్ర బాబు వివరించారు. అధికార వ్యవస్థలను సైతం జగన్ భ్రష్టుపట్టించారని ఆరోపించారు. న్యాయంగా జరిగిన ఎన్నికలను ఒప్పు కునేందుకు సీఎం సిద్ధంగా లేరని విమర్శించారు. న్యాయవ్యవస్థ ఒకటుందని జగన్ గుర్తించాలని చంద్రబాబు హితవు పలికారు. ఇప్పటికైనా చట్టాలు, నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచిం చారు.
http://www.teluguone.com/news/content/ap-highcourt-is-hm-to-jagan-25-142965.html





