ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం ఏపీలో కలకలం సృష్టిస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీకి అనుకూలంగా పని చేశారని... దేశ రక్షణ వ్యవస్థను దెబ్బతీశారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.... ఉద్యోగులను వేధిస్తోందని చంద్రబాబు అంటున్నారు. ముఖ్యంగా ఏబీ వెంకటేశ్వరరావుపై ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు వైసీపీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏబీ వెంకటేశ్వరరావు కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసం పని చేశారని ఆరోపించారు. వైసీపీని దెబ్బతీయడానికే నిఘా వ్యవస్థను ఉపయోగించారని సజ్జల విమర్శించారు. అయితే, పోస్టింగులు ఇవ్వకుండా ఉద్యోగులను, పోలీసు అధికారులను ప్రభుత్వం వేధిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ట్విట్టర్‌లో ఫైరయ్యారు చంద్రబాబు. గత ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన చినరాజప్ప కూడా జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఏబీ వెంకటేశ్వర్రావును ప్రభుత్వం సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు.... ముఖ్యమంత్రి, అలాగే, ఇతర ముఖ్య నేతలతో సన్నిహితంగా ఉండటం సాధారణమేనని అన్నారు. అంతమాత్రాన తర్వాత వచ్చిన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదన్నారు. ఒక ప్రభుత్వంలో పని చేశారని... మరో ప్రభుత్వంలో కక్ష సాధించడం గర్హనీమయమన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. కులం పేరుతో, పార్టీ పేరుతో ఉద్యోగులను బలిపెట్టడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్ వేటుపై ఏబీ వెంకటేశ్వర్రావు స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మానసికంగా తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. బంధుమిత్రులను ఉద్దేశించి వెంకటేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. అక్రమాల కారణంగా తనపై చర్య తీసుకున్నారనేది అవాస్తవమన్నారు. మిత్రులు, బంధువులు తన సస్పెన్షన్ పై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. సస్పెన్షన్ పై చట్టపరంగా ముందుకు వెళ్తానన్నారు. ఆ తర్వాత ఏంటి అనేది క్రమంగా అందరికీ తెలుస్తుందన్నారు. అయితే, ఏబీ వెంకటేశ్వరరావుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయంటోంది ప్రభుత్వం. మొత్తానికి, ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం ఏపీలో ముదురుతోంది. ఏబీపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరుపాలన్న ఆలోచనలో సర్కార్ కనిపిస్తోంది. మరి, ఏబీ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-govt-suspended-ips-officer-ab-venkateswara-rao-25-94028.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.