ఏపీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల, దాళవాయి రమాదేవి?

Publish Date:Aug 17, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంలో సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సిన ఈ పదవుల కోసం ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రతిపాదించారు.  సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతతో పాటు పార్టీ పట్ల అంకిత భావాన్నీ, పార్టీ కోసం పని చేసిన తీరునూ కూడా పరిగణనలోనికి తీసుకుని మరీ ఈ పేర్లు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.    
శాసనమండలి ప్రాతినిధ్యంలో భాగంగా సీనియర్ నాయకుడు, తెలుగుదేశం  పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య,  రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ సామాజిక వర్గ మహిళా నాయకురాలు, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్‌వాడీ అసోసియేషన్ అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేర్లను చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

 దశాబ్దాలుగా పార్టీకి విధేయుడిగా ఉంటూ, క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో సైతం విధానపరమైన అంశాలపై గళం విప్పిన వర్ల రామయ్య సేవలకు తగిన గుర్తింపునిచ్చేందుకు వర్ల రామయ్య, అలాగే  ప్రజా సమస్యలపై పోరాడుతూ స్థానిక స్థాయిలో బలమైన ముద్ర వేసిన మహిళకు అవకాశం కల్పించచాలన్న ఉద్దేశంతో దళవాయి రమాదేవిని చంద్రబాబు ఎంపిక చేశారని అంటున్నారు.  వీరి అభ్యర్థిత్వంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.   

AP Governor Quota MLC, Varla Ramaiah, Dalavai Ramadevi, TDP MLC Candidates, AP Legislative Council, CBN, APpolitics, TeluguOne

By
en-us Political News

  
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిని "ఆంబోతు" అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
వైసీపీ హయాంలో  గ్రంథాలయ రంగానికి చెందాల్సిన సెస్ నిధులను ఖజానాకు మళ్లించారని, తమ ప్రభుత్వం రాగానే ఆ నిధులను తిరిగి గ్రంథాలయ బోర్డుకు జమ అయ్యేలా చర్యలు చేపట్టామన్న ఆయన..
రాష్ట్ర బీజేపీలో  అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే ఈ పరిస్థితికి  కారణమన్నారు.  గతంలో జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత లభించేదని, కానీ ఈసారి ఒక్కరంటే ఒక్క తెలంగాణ నేతకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించకపోవడం పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధమేనని రాజాసింగ్ పేర్కొన్నారు. 
ఎమ్మెల్సీగా వర్ల రామయ్య బుధవారం (ఆగస్టు 20) ప్రమాణ స్వీకారంచేశారు. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు వర్ల రామయ్య చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 
చెన్నైలోని తిరువికా నగర్ అసెంబ్లీ నియోజకవర్గం టీవీకే తరఫున విజయం సాధించిన పల్లవి తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. ప్రజాప్రతినిధిగా    సభకు  బిడ్డతో హాజరుకావడం పట్ల నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గత ప్రభుత్వం జీవోల ద్వారా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24.15 శాతానికి  తగ్గించిందని, ఇందు వల్ల దాదాపు 16 వేల 800 మంది బీసీ నాయకులు తమ రాజకీయ అవకాశాలను, ప్రాతినిధ్యాన్ని కోల్పోయారని చంద్రబాబు వివరించారు.
 ప్రజా సమస్యలపై పోరాడేందుకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన విజయసాయి..   ప్రజల తరఫున నిలబడి వారి హక్కుల కోసం ప్రశ్నించే బలమైన గొంతుకగా తాను నూతన పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తూమాటి మాధవరావు శాసనమండలి కార్యదర్శికి  తన నామినేషన్ పత్రాలను   సమర్పించారు. రాష్ట్ర శాసనమండలిలో  వైసీపీకి సంఖ్యా బలం స్థానం ఉండటంతో..  డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన ఎన్నిక కావడం లాంఛనమే. 
కంగుతిన్న వైసీపీ అసెంబ్లీలో లోకేష్ ప్రసంగంపై ప్రజలలో చర్చ జరగకుండ ఉండేందుకు మండలి వేదికగా బొత్స పెద్ద డ్రామాకు తెరతీసి.. అచ్చెన్నాయుడు తనను అవమానించారు, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నించారన్నారు. 
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్, వారి కుటుంబ సభ్యులపై  జోగి రాజీవ్ భార్య  మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరకట్న వేధింపులు, గృహహింస, మతమార్పిడి ఒత్తిళ్లు అంటూ మేఘన  ఫిర్యాదు మేరకు 11 మంది పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.