Publish Date:Aug 17, 2026
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంలో సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సిన ఈ పదవుల కోసం ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రతిపాదించారు. సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతతో పాటు పార్టీ పట్ల అంకిత భావాన్నీ, పార్టీ కోసం పని చేసిన తీరునూ కూడా పరిగణనలోనికి తీసుకుని మరీ ఈ పేర్లు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.
శాసనమండలి ప్రాతినిధ్యంలో భాగంగా సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ సామాజిక వర్గ మహిళా నాయకురాలు, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్‌వాడీ అసోసియేషన్ అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేర్లను చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
దశాబ్దాలుగా పార్టీకి విధేయుడిగా ఉంటూ, క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో సైతం విధానపరమైన అంశాలపై గళం విప్పిన వర్ల రామయ్య సేవలకు తగిన గుర్తింపునిచ్చేందుకు వర్ల రామయ్య, అలాగే ప్రజా సమస్యలపై పోరాడుతూ స్థానిక స్థాయిలో బలమైన ముద్ర వేసిన మహిళకు అవకాశం కల్పించచాలన్న ఉద్దేశంతో దళవాయి రమాదేవిని చంద్రబాబు ఎంపిక చేశారని అంటున్నారు. వీరి అభ్యర్థిత్వంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.
AP Governor Quota MLC, Varla Ramaiah, Dalavai Ramadevi, TDP MLC Candidates, AP Legislative Council, CBN, APpolitics, TeluguOne
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-governor-quota-mlc-25-229142.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు