పోలవరంపై జగన్ మాటలు నీటి మూటలేనా? ఏం చెప్పారు, ఏం జరిగింది?

Publish Date:May 9, 2024

Advertisement

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమ‌రావ‌తిపై, పగబట్టినట్టుగానే పోలవరంపై కూడా పగబట్టారు. ఆ పనులను నిలిపివేయించారు. కాంట్రాక్టర్లను బెదిరించి పక్కకు తప్పించారు. రివర్స్ టెండర్లు అంటూ పెద్ద డ్రామా నడిపించి.. తమకు అత్యంత దగ్గరివారైన మేఘా కంపెనీకి కాంట్రాక్టును కట్టబెట్టారు. రివర్స్ టెండరింగ్ వ్యవహారం ద్వారా ఇన్ని కోట్ల రూపాయలు ఆదా చేశామంటూ మాయమాటలు వల్లించారు.  అప్పటి నుంచి పోలవరం పనులు పూర్తిగా పడకేశాయి. 

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పనుల్ని శ‌ర‌వేగంతో ప‌రుగెత్తించారు. ప్రతి సోమవారం.. పోలవారం అన్నట్టుగా ఆ ప్రాజెక్టు పనులు గురించి సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. అంత శ్రద్ధగా అధికారులను వెంటపడుతూ పనులు చేయించ‌డం వ‌ల్ల‌ ఆ ప్రాజెక్టు 75 శాతం వరకు పూర్తయింది.

పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదో, ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో కేంద్రమంత్రి గడ్కరీ  బ‌య‌ట‌పెట్టారు. ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్రమంత్రి గడ్కరీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రానికి మేలు చేసే ప్రాజెక్టు కోసం కేంద్రం ఇప్పటిదాకా 60 వేల కోట్లు విడుదల చేసినా జగన్ సర్కారు పూర్తిచేయకపోవడం చేతగానితనం అని విమర్శించారు. జ‌గ‌న్ నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఏటా అనవసరంగా 1300 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని గ‌డ్క‌రీ చెప్పారు. పోల‌వ‌రం పూర్తి చేయడంలో జగన్ పూర్తిగా ఫెయిలైయ్యార‌ని,  వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల‌ని ఆయ‌న ఓట‌ర్ల‌కు పిలుపునిచ్చారు.

పోలవరం ప్రాజెక్టు.. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని.. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించింది. పోలవరం జలాశయం, ఆంధ్రప్రదేశ్ తోపాటు.. ఛత్తీస్‌ఘఢ్, ఒడిశా, తెలంగాణలో కూడా విస్తరించి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా.. 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా నదిలోకి మళ్లిస్తారు. ఇది పూర్తయ్యాక.. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాకుండా.. విశాఖ మహానగరం తాగునీటి అవసరాలు, దాని చుట్టుపక్కలనున్న తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు తీరుస్తుంది. విద్యుదుత్పత్తి, జలరవాణాలోని ఇబ్బందులను అధిగమించడానికి.. చేపల పెంపకానికీ ఉపయోగపడుతుంది.

వాస్తవానికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను చట్టం ప్రకారం.. కేంద్రమే అందించాలి.   పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో చిక్కుకున్న తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందిస్తే ఊళ్లు ఖాళీ చేస్తామని నిర్వాసితులు చెబుతున్నారు. పునరావాస కాలనీలు పూర్తి చేయాలని అడుగుతున్నారు. దానికి కేంద్రమే నిధులు ఇవ్వాలి.

సీఎం జగన్ 2022 లో చింతూరులో చెప్పిన విధంగా జరిగితే ప్లస్ 41 కాంటూరు పరిధిలో అందరికీ పరిహారం అందించాల్సి ఉంది. పునరావాస కాలనీలు పూర్తి చేసి వారిని తరలించాల్సి ఉంది.  తమ కోసం నిర్మిస్తున్నట్టు చెప్పిన పునరావాస కాలనీ సిద్ధం కాలేదు. సి.ఎం. జ‌గ‌న్ ఇచ్చిన హామీలు  ఆచరణ రూపం దాల్చకపోవడంతో నిర్వాసితులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

"ముఖ్యమంత్రి జ‌గ‌న్ మాటలు మాత్రమే మిగిలాయి. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారు. జాతీయ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కేంద్రం నాన్చుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిలదీయలేకపోతోంది. ఫలితంగా నిర్వాసితులకు అన్యాయం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల నిర్వాసితులు నష్టపోవాల్సి వస్తోంది.

- ఎం.కె. ఫ‌జ‌ల్‌

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.