ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గాలలో దెందులూరు ఒకటి. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాల్లో దెందులూరు ఒకటని చెప్పవచ్చు. ఈ ఎన్నికలలో దెందులూరు ఓటరు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అన్నదే ఆసక్తిగా మారింది.
ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే తప్పా, ఇక్కడ కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు ఏమీ లేవు. పలు ప్రాంతాల్లో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉంది. డ్రైనేజ్‌లు, రహదారుల పరిస్థితి దారుణంగానే వుంది. ఇవన్నీ ఈ సారి ఎన్నికల్లో ప్రభావం చూపబోతున్నాయి.
దెందులూరు నియోజకవర్గం ఏలూరు చుట్టూ ఉంటుంది. కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ. పార్టీ ఏదైనా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నిక అవుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు కమ్మ సామాజిక వర్గం నేతలే శాసనసభలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ జరగ్గా.. వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి సుమారు 16 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయననే మళ్లీ బరిలోకి దింపారు సీఎం జగన్. ఆయనపై ఇసుక దందా సహా అనేక ఆరోపణలు వచ్చాయి.
ఎన్నికల్లో ఓడిపోగానే అబ్బయ్య చౌదరి మళ్లీ లండన్ వెళ్లిపోతారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దెందులూరులో గెలుపు కోసం టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ శ్రీలక్ష్మి శ్యామల చింతమనేని ప్రభాకర్ తరఫున ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని తొలి రోజు నుంచి నిలదీసిన నేత చింతమనేని. వైసీపీ అక్రమాలకు అడ్డుగా ఉన్నాడనే అక్కసుతోనే చింతమనేని ప్రభాకర్‌పై అక్రమ కేసులు పెట్టారు. అక్రమంగా జైలుకు పంపారు. చివరికి చింతమనేని ప్రభాకర్‌పై హత్యాయత్నం కూడా చేశారు. ఆయనపై ఐదేళ్లలో వందకు పైగా కేసులు పెట్టించారని శ్యామల ఆరోపించారు. చింతమనేనిపై నియోజకవర్గంలో సానుభూతి ఉంది. ప్రజల కోసం కష్టపడతారని.. ప్రభుత్వ పరమైనవి ఏమైనా అందరికీ అందేలా చూస్తారన్నన అభిప్రాయం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది.
చింతమనేని విజయం ఖాయమని స్థానికులు అనుకుంటున్నారు. ఈ సారి, లండన్ బాబును లండన్ పంపించి, తనకు ప్రజలు నలభై వేల మెజార్టీ ఇస్తారని నమ్మకంతో చింతమనేని ఉన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/people-are-ready-to-switch-off-the-fan-chintamaneni-prabhakar-25-175468.html
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.