స్వదేశానికి చేరుకున్న అనురూప్ రెడ్డి భౌతికకాయం
Publish Date:Jun 9, 2026
Advertisement
అమెరికాలో స్నేహితులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ యువకుడు అనురూప్ రెడ్డి భౌతికకాయం స్వదేశానికి చేరు కుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవిడిపల్లి గ్రామానికి చెందిన అనురూప్ రెడ్డి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి కంప్యూ టర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు. ఇటీవల లూసియానా రాష్ట్రంలోని ఓ సరస్సులో జరిగిన ప్రమాదంలో తన స్నేహి తులు చిక్కుకున్న సమయంలో వారిని కాపాడే ప్రయత్నంలో నీటిలోకి దిగిన అనురూప్ రెడ్డి, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పలువురు హృద యాలను కదిలించివేసింది. అయితే.. ఆయన భౌతికకా యం ఇప్పుడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్ర యానికి చేరుకోగా, కుటుంబ సభ్యులు, అధికారులు కన్నీటి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ కిరణ్మయి, ఎంఆర్వో అమర లింగం గౌడ్ కుటుంబ సభ్యులకు అధికారికంగా భౌతికకాయాన్ని అప్పగించారు.స్నేహితుల కోసం ప్రాణత్యాగం చేసిన అనురూప్ రెడ్డి త్యాగం పట్ల గ్రామస్తులు, అధికారులు, పలువురు ప్రముఖులు అతని త్యాగాన్ని అభినం దిస్తూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/anurup-reddy-mortal-remains--reached--india-36-222344.html





