వివేకా హత్యపై మరో సినిమా.. వస్తారు మొత్తం బయటకు వస్తారు

Publish Date:Jan 21, 2025

Advertisement

మాజీ మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో వైఎస్ జగన్ పార్టీ విజయానికి ఈ హత్య ద్వారా వెల్లువెత్తిన సానుభూతి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికలకు ముందు వివేకా హత్య వెనుక ఉన్నది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ అంటూ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.

సొంత మీడియాలో నారాసుర రక్త చరిత్ర అంటూ కథనాలు వండి వార్చింది. సరే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి అంటే 2019 ఎన్నికల సమయానికి గతంలో వైసీపీ చేసిన ప్రచారం ఇప్పుడు బూమరాంగ్ అయ్యింది. దర్యాప్తులో ఈ హత్య వెనుక ఉన్నది వైసీపీయే అన్నది దాదాపుగా తేలిపోయింది. కోర్టులు నిర్ధారించి తీర్పు వెలువరించలేదు కానీ.. దర్యాప్తు సాగిన తీరు, దానిని అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నించిన విధానాన్ని గమనించిన జనాలకు ఈ హత్య వేనుక ఉన్నది ఎవరు? వారిని కాపాడుతున్నది ఎవరు అన్న విషయంలో సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి. సరే 2019 ఎన్నికలలో వైసీపీకి సానుభూతికి ప్రోది చేసిన వైఎస్ వివేకా హత్య.. 2024 ఎన్నికల సమయానికి వైసీపీకి, జగన్ కు పెద్ద ప్రతికూల అంశంగా మారిపోయింది.

ఈ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్ కొమ్ము కాయడం, వివేకా హత్య కేసు విషయంలో జగన్ కు వ్యతిరేకంగా డాక్టర్ సునీత నిలబడటం, ఆమెకు జగన్ స్వంత సోదరి షర్మిల మద్దతు ఇవ్వడంతో విషయాలన్నీ సందేహాలకు అతీతంగా జనానికి అర్ధమైపోయాయి. 

ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలకు ముందు ‘వివేకం’ అనే పేరుతో వైఎస్ వివేకా హత్యపై ఓ సినిమా రూపొందింది. వివేకం సినిమా థియోటర్లలో విడుదల కాలేదు. కానీ యూట్యూబ్ ద్వారా లక్షల మంది ప్రజలకు చేరువైంది. అప్పట్లో ఈ సినిమాను షర్మిల కూడా మెచ్చుకున్నారు. వివేకం సినిమాలో వాస్తవాలే చూపారని ఆమె అప్పట్లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సరిగ్గా ఎన్నికలకు ముందు విడుదలైన ఈ సినిమా కూడా వైసీపీ ఘోర పరాజయంలో తన వంతు పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.

ఇప్పుడు వివేక హత్య కేసుపై మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా పేరు ‘హత్య’ ఈ నెల 24న ఈ సినిమా థియోటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా సెన్సార్ బోర్డు, రివిజన్ కమిటీల మధ్య దాదాపు తొమ్మిదిన్నర నెలల పాటు ఇరుక్కుపోయింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 24న విడుదల అవుతున్నా..  సెన్సార్ బోర్డు ఈ సినిమాకు దాదాపు వంద కట్స్ వేసిందని సమాచారం. 

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.