మంత్రి రోజాకు మరో బిరుదు.. కలెక్షన్ క్వీన్ .. ట
Publish Date:Jul 14, 2022
Advertisement
దిసీజ్ ... టూమచ్ అండ్ టూ బాడ్, ఐ సే .. లేదంటే ఏంటండి.. ఒక ఆడ కూతురు .. ఎంతో కష్ట పడి .. కాలి నడకన కొండెక్కి వెంకన్న స్వామికి ఇంకెందరో దేవుళ్ళకు మొక్కి, ఇంకెన్నెన్నో చేసి ఒక మంత్రి పదవి తెచ్చుకుంటే, ఆమెను అన్నేసి మాటలంటారా? ఈజ్ ఇట్ నాట్ బార్బేరియస్, ఇది మహా దుర్మార్గం కాదా, మహా పాపం కాదా ..అని అడుగుతున్నా. అయినా, నాకు తెలియక అడుగుతాను.. మంత్రి పదవి రాగానే, ముడుపులు ముట్ట రాదు, లంచాలు పుచ్చుకోరాదు అని రూలు ఏమైనా ఉందటండి, లేదు కదా. అలాగే, ఇన్ని రోజులు, ఇన్ని వారాలు,ఇన్ని నెలలు అయిన తర్వాతనే చేతులు పైకి తీయాలి, లంచాలు పుచ్చుకోవాలి జేబులు నింపుకోవాలి అనే రూలు ఏమైనా వుందా? రాజ్యాంగంలో, ఐ మీన్ .. రాజారెడ్డి రాజ్యాంగంలో అలా అని ఏమైనా రాశారా? లేదు కదా, మరి కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నట్లు, ‘రారే’ రాజ్యాంగానికి, ‘రారే’ రాజ్యాంగ నిర్మాత జగనన్నకు లేని దురద, ఈ తెలుగు దేశం పార్టీ వాళ్ళకు ఎందుకని అడుగుతున్నా.. ఇంత మాత్రంకే,, ఆమెను కలెక్షన్ క్వీన్ అనేస్తారా? నిజానికి, ఇచ్చే వాళ్ళుంటే ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే నిక్షేపంగా ముడుపులు పుచ్చుకోవచ్చని కదా గౌరవ పెద్దలు చెప్పింది, చేసి చూపింది. అలా పెద్దలు చూపిన బాటలో మినిస్టర్ రోజా నడిస్తే అది కూడా తప్పేనా.. అంత మాత్రం చేతనే ఆమె ‘కలెక్షన్ క్వీన్’ అయిపోతారా? ఇటీజ్ టూ బాడ్..ఇదేనా మీరు ఒక మహిళా మంత్రికి ఇచ్చే గౌరవం అని కూడా అడుగుతున్నా. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇంకెప్పుడు రోజా మంత్రి పదవి చేపట్టి వంద రోజులు అయినా అవలేదు అప్పుడే కాష్ కౌంటర్ ఓపెన్ చేశారు. కోట్లు సంపాదిస్తున్నారు .. అంటూ గోల చేయకండి .. అస్సలు ఉన్నదే రెండు సంవత్సరాల టైము ... మళ్ళీ ముందస్తు ఎన్నికలు అంటున్నారు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, పదవిలో ఉండగానే నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని ఆమె అనుకుంటే అది కూడా తప్పు పట్టడం తప్పు కాదా.. అయినా కోటిన్నర అంటే ఎంతండి? ఇంత చిన్న మొత్తానికే ఇంత గొడవ అవసరమా? రెండు రేపులు రేపులు కాదు.. కోటిన్నర ముడుపులు ముడుపులు కాదు, అని ఈ జనాలు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ..ఏమో అదలా ఉంటే, మినిస్టర్ రోజా.. అప్పాయింట్మెంట్ కే రూ. 50 వేలు తీసుకుంటున్నారని, ఇంకొక మాట అంటున్నారు. అవునండి తీసుకుంటే తీసుకుంటారు.. కాలం విలువ, దటీజ్ టైం వేల్యూ.. అది తెలిసిన వారు కాబట్టి తీసుకుంటే తీసుకుంటారు. జబర్దస్త్’ షోలో ఓ గంట అలా కూర్చుని విరగబడి, పగలబడి నవ్వినందుకే అక్షరాల లక్షల్లో రెన్యూమరేషన్ తీసుకున్న ఆమెకు టైము విలువ బాగా తెలుసు కాబట్టి.. తీసుకుంటే తీసుకుంటారు. అయినా మంత్రి పదవికోసం ఎంతగా తపించారో తెలుసు కదా.. అడంతా ఉత్తినే చేశారా .. లేదు కదా.
అయినా రోజా అంటే ఎవరు .. మనందరినీ వెండి తెరమీద, బుల్లి తెరమీద ఎంతగానో అలరించిన ఓ అందాల నటి ... జగనన్న ముద్దుల చెల్లి, అంతటి ఆమెను పట్టుకుని అన్నేసి మాటలంటారా? అసలు ఆమె నవ్వుకే ఇవ్వవచ్చును కదండీ ఎన్నో వేల వరహాలు.. అలాంటిది, జస్ట్ ఓ కోటిన్నర పెట్టి కొడుకు కోసం మెర్సిడెజ్ బెంజ్ కారు కొని, అబ్బాయికి గిఫ్ట్’గా ఇస్తే ఇంత రాద్ధాంతం చేస్తారా? ఓ ఆడ లేడీ మీద మీకున్న గౌరవం ఇదేనా ... అసలు మీకేమైనా, ఇంగిత జ్ఞానం ఇత్యాదులున్నాయా? అని కూడా అడుగుతున్నా.
http://www.teluguone.com/news/content/another-award-to-minister-roja-collection-queen-25-139758.html





