అన్న క్యాంటీన్లకు స్పందన అద్భుతం.. సామాజిక విప్లవంగా మారిన వైనం

Publish Date:Apr 14, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరించిన  అన్న క్యాంటీన్లకు అద్భుతమైన ప్రజా స్పందన లభిస్తున్నది.   రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ క్యాంటీన్లలో భోజనం చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.  పేద, మధ్యతరగతి ప్రజలకు కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన అన్న క్యాంటిన్ పథకం..  ఇప్పుడు  లక్షలాది మంది ఆకలి తీరుస్తూ ఒక సామాజిక విప్లవంగా మారింది. తాజా లెక్కల ప్రకారం, ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు  .8 కోట్ల మంది ప్రజలు ఈసేవలను వినియోగించుకున్నారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా   ప్రాంతాల్లో 207 అన్న క్యాంటీన్లు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. నిత్యం దాదాపు  2.10 లక్షల మందికి పైగా ప్రజలు ఈ క్యాంటీన్ల ద్వారా ఉపాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాన్ని స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా కూలీలు, చిరుద్యోగులు వివిధ పనుల నిమిత్తం నగరం, పట్టణాలకు వచ్చే  సామాన్యులకు ఇది ఒక వరప్రదాయినిగా మారింది. శుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకే అందిస్తుండటంతో, భోజన సమయాల్లో ఈ కేంద్రాల వద్ద భారీగా క్యూలు కనిపిస్తున్నాయి.

ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం భారీగా నిధులను వెచ్చిస్తోంది. ప్రతిరోజూ అన్న క్యాంటీన్ల నిర్వహణ   54 లక్షల రూపాయల వ్యయం అవుతోంది. ఇందులో సింహభాగం ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుండగా, మరికొంత మొత్తాన్ని దాతల నుంచి సేకరిస్తున్నారు. ఈ పథకం పునఃప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటిన్లపై  243 కోట్ల రూపాయలను వ్యయం చేసింది.   లాభాపేక్ష లేకుండా సామాన్యుడి కడుపు నింపడమే ధ్యేయంగా చేపట్టిన ఈ కార్యక్రమం నిర్విఘ్ణంగా, అశేష ప్రజలకు అన్నదాతగా కొనసాగుతోంది.  

జగన్ హయాంలో ఈ క్యాంటీన్లు మూతపడటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం వీటిని తిరిగి ప్రారంభించడమే కాకుండా..  మరింత మెరుగైన సౌకర్యాలతో  నిర్వహిస్తున్నది. ఇస్కాన్ వంటి సంస్థల సహకారంతో ఆహారం తయారీలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నది.  ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనను గమనించిన ప్రభుత్వం, రానున్న రోజుల్లో ఈ సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. 

అన్న క్యాంటీన్ల విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం త్వరలోనే గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రామాల్లోని నిరుపేదలకు కూడా 5 రూపాయలకే భోజనం అందించాలనేది ప్రభుత్వ సంకల్పం. గ్రామీణ ప్రాంతాల్లో క్యాంటీన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం అదనంగా 58 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో విజయవంతమైన ఈ మోడల్‌ను పల్లెల్లో కూడా అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఆకలి చావులు లేని సమాజాన్ని నిర్మించవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. 

ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకుని మరిన్ని  క్యాంటీన్ల ఏర్పాటుకు   కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి రద్దీ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించింది. అన్న క్యాంటీన్లు కేవలం ఆహార కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ప్రభుత్వ సామాజిక బాధ్యతకు చిహ్నంగా నిలుస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి.   

By
en-us Political News

  
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.