కుప్పంలో అన్నా క్యాంటిన్ ధ్వంసం.. నిరసనగా బైఠాయించిన చంద్రబాబు

Publish Date:Aug 25, 2022

Advertisement

చంద్రబాబు కుప్పం పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. సొంత నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు వైసీపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు పట్టణంలోని బస్టాండ్ వద్ద అన్నా క్యాంటిన్ ను ప్రారంభించాల్సి ఉండగా ఆ క్యాంటిన్ ను వైసీపీ శ్రేణులు ధ్వసం చేశాయి. అన్న క్యాంటిన్ ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ చంద్రబాబు అక్కడే బైఠాయించారు. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో చంద్రబాబు కూడా పాల్గొన్నారు. అర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ వరకూ ర్యాలీ కొనసాగింది. అనంతరం బస్టాండ్ వద్ద ధ్వంసం చేసిన అన్నాక్యాంటిన్ వద్ద చంద్రబాబు బైఠాయించారు. 

ఈ క్రమంలో పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో పలువురు తెదేపా కార్యకర్తలకు గాయపడ్డారు.  

పోలీసుల తీరును చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అంతకు ముందు చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్నా క్యాంటీన్‌ను ధ్వంసం చేసిన వైసీపీ కార్యకర్తలు  టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను   తొలగించారు.

  ఈ నేపథ్యంలో కుప్పంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు కుప్పం పర్యటన తొలి రోజు కూడా ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.  రామకుప్పం మండలం కొల్లుపల్లిలో చంద్రబాబు రోడ్ షో  మార్గంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన పార్టీ జెండాలకు పోటీగా   వైఎస్సార్‌సీపీ జెండా తోరణాలు కట్టారు.

దీంతో వైఎస్సార్‌సీపీ తోరణాలను తొలగించేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించడం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పంను పులివెందులగా మార్చడానికి జగన్ ప్రయత్నిస్తున్నారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. రౌడీయిజానికి భయపడేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

By
en-us Political News

  
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.