నెల్లూరు నుండి అనిల్ ఔట్? తర్వాత ఏంటి సామీ..!

Publish Date:May 6, 2022

Advertisement

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా వదిలి పక్క జిల్లాకు పోతున్నారట..! లేదుర సామి.. ఈ సారి అసలు టిక్కెట్టే లేదంట కదా...?! టిక్కెట్టు ఇచ్చినా గెలిసేది ఏడరయ్యా..?! ఇది నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా మాజీ మంత్రి అనిల్ పై వైసీపీ నేతలే చేస్తున్న తాజా కామెంట్స్...! సామాన్యుడికి ఉన్నత పదవి వస్తే.. అంతకన్నా ఉన్నతంగా.. హుందాగా వ్యవహరించాలి. అప్పుడే అందరి మన్ననలూ పొందుతారు. కానీ.. అనిల్ కుమార్ నోటి దురుసే.. ఆయనను రాజకీయంగా సమాధి చేసేట్లు కనిపిస్తోందని చెబుతున్నారు నెల్లూరు జిల్లా వాసులు.

నిన్నటి దాకా తల ఎగరేసి మరీ హద్దూ.. అదుపూ లేకుండా మాట్లాడిన అనిల్ ఇప్పుడు వైసీపీ నేతల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి తెచ్చుకున్నారంటున్నారు. నాదే నెల్లూరు అని విర్రవీగిన అనిల్ ఇప్పుడు ఎక్కడి నుండి పోటీచేయాలో దారి తెలియక దిక్కులు చూస్తున్నారట. తాజా పరిణామాలు వైసీపీర్టీలో అనిల్ ను ఒంటరిని చేశాయనే చెప్పాలి. దీంతో నెల్లూరు టౌన్ లో ఆయన మళ్లీ గెలిచే అవకాశాలు తక్కువని అంటున్నారు. అసలు నెల్లూరు టౌన్ నుంచి అనిల్ కు టిక్కెట్ వస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ దృష్టి శ్రీ బాలాజీ జిల్లాలోని వెంకటగిరి వైపు మళ్లిందని వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అయినా అనిల్ అక్కడికి వెళితే గెలిచే ఛాన్స్ లేదురా నాయనా అనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు.

ఇప్పటికే వెంకటగిరిలో కొమ్ములు తిరిగిన నేతలు ఖాళీగా ఉన్నారు. మాజీ సీఎం తనయుడు నేదురుమల్లి రాంకుమారెడ్డి.. వెంకటగిరి రాజాలు లాంటి ఉద్దండులు వెంకటగిరిలో ఉండగా..అనిల్ కు అక్కడ ఆదరణ లభించడం కష్టమనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అనిల్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలను పరుష పదాలతో దూషించడానికి కొంత సమయం.. నెల్లూరు జిల్లాలో సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు మిగిలిన సమయం వృథా చేశాని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మంత్రి పదవి పోయే నాటికి అనిల్ కొండంత చెడ్డ పేరు మూట కట్టుకున్నారంటున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగర ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు కూడా ఆయన దూరం అయ్యారనేది వాస్తవం అని చెబుతున్నారు.

నెల్లూరు నగరంలో ఆనం ఫ్యామిలీ అండతో కార్పొరేటర్ అయి.. వారి పుణ్యంతోనే అనిల్ ఎమ్మెల్యే టిక్కెట్టు సంపాదించుకున్నారు. అయితే వైసీపీ పంచన చేరిన తరువాత ఆనం ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో జిల్లా వాసులకు అనిల్ దూరం కాక తప్పలేదంటున్నారు మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు పెద్దారెడ్లకు కొద్దిగా కూడా అయినా మర్యాద ఇవ్వకుండా అనిల్ వ్యవహరించారట. దీన్ని మనసులో ఉంచుకున్న నెల్లూరు పెద్దారెడ్లు సమయం కోసం ఎదురు చూశారంటారు. ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది. మంత్రి పదవి పోయాక ఆ పదవి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి దక్కడంతో నేతలంతా జోరీగలు తగులుకున్నట్టు అనిల్ ను తగులుకున్నారు.

తాజాగా.. నెల్లూరులో ఆనం ఫ్యామిలీ ఫ్లెక్సీలతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ఫ్లెక్సీలు కూడా చించేయడంతో అనిల్ ఖేల్ ఖతమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అనిల్ కుమార్ కు మళ్లీ నెల్లూరు నగరం నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇస్తే.. రెడ్లు వైఎస్సార్సీపీకి దూరం అవుతారని జగన్ చెవిలో వేశారట వేమిరెడ్డి. అంతేకాదు అనిల్ ప్రవర్తన పార్టీకి నష్టం కలిగించేలా ఉందని చెప్పారట.  దీంతో ఈ సారి అనిల్ కు టికెట్ ఇవ్వకుండా పక్కన పెడదామని జగన్ చెప్పడంతో వేమిరెడ్డి, నెల్లూరు నేతలు శాంతించినట్లు తెలుస్తోంది. ఈ సారి ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరిలో పోటీచేసే అవకాశాలు చాలా తక్కువ. అక్కడ యాదవ సామాజికవర్గం ఓట్లు ఉండడంతో అక్కడికి వెళ్ళేందుకు అనిల్ ప్రయత్నాలు సాగించారు. ఇది తెలిసిన వెంకటగిరి నేతలు స్థానికేతరుడైన అనిల్ తమ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఓడిస్తామని ఇప్పటికే హెచ్చరికలు చేశారని సమాచారం. దీంతో అనిల్ పని అయిపోయింది. నెక్స్ట్ ఏంటి..? పార్టీలో ఉంటారా..? లేదంటే అనిల్ నే పార్టీ పూర్తిగా పక్కన పెట్టేస్తుందా..? అని టాక్ జిల్లాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఎనభై సంవత్సరాలుగా రాజకీయంగా చక్రం తిప్పిన ఆనం ఫ్యామిలీ నెల్లూరు పంటరెడ్ల జోలికి వెళ్ల లేదు. అలాంటిది కన్నూ మిన్నూ తెలియకుండా ఆనం వారితో పాటు నెల్లూరు పంటరెడ్లను అవమానకరంగా చూసిన అనిల్ కు భవిష్యత్తు ప్రశ్నార్థకం కావచ్చని అనుకుంటున్నారు. జగన్ అండ, మంత్రి పదవి శాశ్వతం అనుకున్న అనిల్ ఇప్పుడు ఒంటరైపోయి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో..! ముందు ముందు ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో చూడాలి.. జగన్ ఫ్యాన్ గాలిలో గెలిచిన నేతలు సొంత గాలి ఉండేలా పనిచేయకపోతే.. ప్రతిసారీ.. గాలి ఉండదు కదబ్బా అంటున్నారు కొందరు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.