ఏపీ నూతన సీఎస్ సాయి ప్రసాద్ కు ఘన సత్కారం

Publish Date:Feb 28, 2026

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శనివారం ఫిబ్రవరి 28) బాధ్యతలు స్వీకరించిన శ్రీ గుట్టపల్లి సాయిప్రసాద్ కి  సచివాలయంలో ఘనంగా సత్కారం జరిగింది.  ప్రత్యేకంగా తయారుచేసిన జీడిపప్పు మాల, కిరీటం,శాలువా తో సచివాలయం లో ఆయనను   భారత సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య ఉపకార్యదర్శ మన్నె శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామ   ఉపసర్పంచ్ మన్నె చింపిరియ్య,స్వామి కుమార్ తదితరులు ఘనంగా సత్కరించారు. 

ఇలా ఉండగా  1991 ఐఏఎస్ బ్యాచ్ ఎపి క్యాడర్ కు చెందిన సాయి ప్రసాద్   1992 జూన్ నుంచి 1993 మే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్ గా పని చేశారు. అనంతరం 1993 సెప్టెంబరు నుంచి 1995 ఏప్రిల్ వరకు పాడేరు అసిస్టెంట్ కలెక్టర్ గా,1995 ఆగస్టు నుంచి 1997 మార్చి వరకు గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా పని చేశారు.  1997 మే నుంచి 1998 ఆగస్టు వరకు కడప జాయింట్ కలెక్టర్ గా, ఆ తరువాత 2000 జూలై నుండి 2003 జూన్ వరకూ కర్నూల్ కలెక్టర్ గా పని చేశారు. ఇక  2003 జూన్ నుండి 2003 అక్టోబరు వరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ గా, 2003 అక్టోబరు నుండి 2004 ఆగస్టు వరకు ఎపి ట్రాన్సుకో జెఎండిగా, 2004 ఆగస్టు నుండి 2006 మే వరకు ఇపిడిపిసిఎల్ సిఎండిగా, 2006 మే నుండి 2010 ఫిబ్రవరి వరకు ఎపి సిపిడిసిఎల్ సిఎండిగా పని చేశారు. 2010 ఫిబ్రవరి నుండి 2011 అక్టోబరు వరకు ఎపి హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా పని చేశారు.

అనంతరం 2011 అక్టోబరు నుండి 2014 జూన్ వరకు కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. ఇక  2014 జూన్ నుండి 2016 ఫిబ్రవరి వరకు సిఎం కార్యదర్శిగా, 2016 ఫిబ్రవరి నుండి 2019 మే వరకు సిఎం ముఖ్య కార్యదర్శిగా పని చేశారు.

తదుపరి 2020 జనవరి నుండి 2022 ఫిబ్రవరి వరకు ఎపి సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు సిఎండి, ఇంధన శాఖ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రెటరీగాను పని చేశారు. అనంతరం 2022 ఫిబ్రవరి నుండి 2024 జూన్ వరకు సిసిఎల్ఏగా పనిచేశారు. తదుపరి 2024 జూన్ నుండి 2025 జనవరి దాకా జలవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ 2025 జనవరి నుండి అదే హోదాలో పనిచేస్తూ సిఎం ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ పని చేశారు. ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానాన్ని ప్రభుత్వం సాయిప్రసాద్ తో భర్తీ చేసింది.  గత ఏడాది నవంబరు 29వ  ప్రస్తుత సిఎస్ విజయానంద్ పదవీ కాలాన్ని మూడు మాసాలు అంటే శనివారం (ఫిబ్రవరి 28)  వరకూ పొడిగిస్తూ, అలాగే  తదుపరి సిఎస్ గా సాయిప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. 

By
en-us Political News

  
కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీసు యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది.
హైదరాబాద్ తారామతి రిసార్ట్‌లో ఈగల్ ఫోర్స్ దాడులు.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్
ఇటీవలి పరిణామాలు సంప్రదాయ పోరాటాల నుండి ఇరాన్ యొక్క వ్యూహాత్మక సైనిక మౌలిక సదుపాయాలను, ముఖ్యంగా దాని క్షిపణి మరియు అణు సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని దెబ్బతీయడం వైపు దృష్టి మళ్లుతున్నట్లు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం దేవీపట్నం మండలంలోని నేలకోట కొండ ప్రాంతాన్ని ఈ పులి తన ఆవాసంగా మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా ఈ పరిసరాల్లోనే పులి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. పశువుల కాపరులు, కొండపైకి వెళ్లే గ్రామస్థులు పులిని నేరుగా చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. రామదుర్గం కొండపై పులి కదలికలను కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు కూడా.
రిసార్ట్‌లో జాక్ అండ్ జాన్సన్ పేరిట నిర్వహిస్తున్న ఓ ఈవెంట్‌లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాల వాడకం జరుగుతున్నట్లు అధికారులకువిశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఈగల్ బృందం, హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్ సమాచారం ప్రకారం, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని హుకుంపేట మండలం జోగులపుట్టు గ్రామాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూ అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయి.
జానీ అనే వ్యక్తి రేడియో టవర్ ఎక్కి ముఖ్యమంత్రితో మాట్లాడే వరకు దిగనే దిగను అంటు హల్ చల్ చేశాడు. జానీ ఆటో నడుపుకుంటూ జీవనోపాధి కొనసాగి స్తున్నాడు. గ్యాస్ సమస్య కారణంగా ఆటో సరిగా నడపలేకపోతున్నానని దీంతో తాను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నానొ ఆవేదన వ్యక్తం చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో గెలిపించాడు. అయితే కోహ్లీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. లండన్‌లో నివాసం ఏర్పరుచుకున్న విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఐదో విదేశీ ఆటగాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయ్యస్ అయ్యర్‌‌తో పాటు పంజాబ్ ఆటగాళ్లపై జరిమానా పడింది. అది రెండో సారి కావడంతో శ్రేయస్‌పై ఐపీఎల్ కమిటీ ఏకంగా రూ.24 లక్షల ఫైన్ విధించింది. ప్లేయర్లకు రూ.6లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో పాతిక శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.
యుద్ధం వల్ల ఇరాన్ ప్రత్యక్ష నరకాన్ని, భారీ నష్టాన్ని చవిచూస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఇంధన కేంద్రాలు, సైనిక స్థావరాలు.. దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇరాన్ కరెన్సీ- రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. ద్రవ్యోల్బణం 40శాతం దాటిపోయింది, దీనివల్ల సామాన్యులకు నిత్యావసర వస్తువులు అందనంత భారమయ్యాయి.
నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతదేశానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
అమెరికా సైనిక కార్యకలాపాలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయంటూ.. ఇరాన్ ఇప్పుడు టెక్‌ దిగ్గజాలైన అమెజాన్, ఒరాకిల్ వంటి సంస్థల డేటా సెంటర్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌తో పాటు దుబాయ్‌లోని ఒరాకిల్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.