టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా...ఎందుకంటే?
Publish Date:Jan 9, 2026
Advertisement
టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడుకు పంపారు. తనపై ఓ ప్రముఖ పత్రికలో తనపై వచ్చిన తప్పుడు కథనాల వల్ల మనస్తాపంతో రిజైన్ చేస్తున్నానని లేఖలో జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. అయితే జంగాకు టీటీడీ కేటాయించిన భూమిని కేబినెట్ రద్దు చేయడమే కారణమని తెలుస్తోంది. ఈ కారణంతోనే ఆయన మనస్థాపం చెందారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం జంగా రాజీనామా చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో తిరుమల బాలాజీనగర్‌లో ప్లాట్ నెంబర్ 2ను జంగాకు కేటాయించారు. ఇప్పటికీ ఆ స్థలం ఖాళీగా ఉండటంతో మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జంగాకు కేటాయించిన భూమిని రద్దు చేయాలని తీర్మానించారు. గతంలో తనకు కేటాయించి.. రద్దు చేసిన భూమిని తాను చైర్మన్‌గా ఉన్న ఓం శ్రీ నమో వెంకటేశ్వర గ్లోబల్ ట్రస్ట్‌కు మళ్లీ కేటాయించాలని టీటీడీని కోరానంటూ జంగా కృష్ణమూర్తి ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. ఇది ఎలా తప్పు అవుతుందంటూ జంగా ప్రశ్నించారు . తాను ఈ నిర్ణయం తీసుకోకుంటే ప్రభుత్వానికి, టీటీడీ బోర్డుకు ఇబ్బంది వస్తుందనే ఈ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు. ముచ్చటగా మూడోసారి తిరుమల శ్రీవారి సేవ చేసుకోవడానికి సీఎం చంద్రబాబు తనకు అవకాశం కల్పించారని కృష్ణమూర్తి తెలిపారు.
http://www.teluguone.com/news/content/janga-krishnamurthy-resigns-from-ttd-board-membership-36-212295.html





