రాజధానిపై ప్రభుత్వం పునరాలోచన?

Publish Date:Jul 30, 2014

Advertisement

 

రాష్ట్ర రాజధానిని గుంటూరు-విజయవాడ ప్రాంతం మధ్య ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు చాలా మంది సానుకూలంగా ఉన్నప్పటికీ, అక్కడ రాజధాని ఏర్పాటులో ఉండే కష్టనష్టాలను, సమస్యలను శివరామ కృష్ణన్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించడంతో ఆయన పునరాలోచనలోపడినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములు లేకపోవడంతో, ఒకవేళ అక్కడే రాజధానిని ఏర్పాటు చేయదలిస్తే తప్పనిసరిగా ప్రైవేట్ మరియు వ్యవసాయ భూములను భారీ మూల్యం చెల్లించి కొనవలసివస్తుంది.

 

ఒకప్పుడు ఎకరం 20-30 లక్షల మధ్య ఉన్న ధరలు, ప్రభుత్వం అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలియగానే, కేవలం నెలన్నర రోజుల వ్యవధిలోనే భూముల ధరలు అమాంతం పెరిగిపోయి ప్రస్తుతం రూ.50-75లక్షల మధ్య ఉన్నట్లు శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులే స్వయంగా ద్రువీకరించారు. రాజధాని ఏర్పాటుకి కనీసం 20-25వేల ఎకరాల భూమి అవసరం ఉంటుందని ప్రాధమిక అంచనా. ఆ ప్రకారం చూసుకొంటే భూమి కొనుగోలుకే ప్రభుత్వం చాలా భారీ మొత్తం వెచ్చించవలసి ఉంటుంది. అసలే లోటు బడ్జెటుతో, తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమవుతున్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం అంత భారీ మొత్తం నిధుల సమీకరానా దాదాపు అసంభవమే అవుతుంది. రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఉదారంగా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ, ఏ మేరకు ఎప్పుడు ఇస్తుందో తెలియని పరిస్థితి. కనుక రాజధాని విషయంలో చంద్రబాబు పునరాలోచనలోపడినట్లు మంత్రుల తాజా స్టేట్ మెంటులే పట్టిస్తున్నాయి.

 

ఒకవేళ రాజధాని ఆ ప్రాంతంలోనే నిర్మించినప్పటికీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయము, సచివాలయము, ముఖ్యమయిన కొన్ని ప్రభుత్వభవనాలను మాత్రమే నిర్మించి, శాసనసభ, విధానసభ, హైకోర్టు వంటి వాటినన్నిటినీ వేరే ప్రాంతాలలో లేదా పరిసర జిల్లాలలో ఏర్పాటు చేస్తే ఎలాగుంటుంది? అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వంపై ఆర్దికభారం తగ్గించుకోగలగడమే కాకుండా రాజధాని కోసం వివిధ జిల్లాల డిమాండ్లను అంగీకరించినట్లవుతుంది. అధికార వికేంద్రీకరణ జరిగి రాష్ట్రంలో అన్నిజిల్లాలు సమానంగా అభివృద్ధి సాధించగలుగుతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రాజధాని అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదు. శివరామ కృష్ణన్ కమిటీ కమిటీ వచ్చే నెల 20లోగా తన తుది నివేదిక సమర్పిస్తుంది. కనుక దానిని బట్టి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. కానీ ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని గమనించినట్లయితే, బయట నుండి భారీ ఆర్ధిక సహాయం లేకుండా తనంతట తానుగా గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేయడం దాదాపు అసంభవమేననిపిస్తోంది.

By
en-us Political News

  
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.