ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం.. విజయసాయి, మిథున్ రెడ్డి.. ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే?

Publish Date:Jan 20, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇంత కాలంగా అధికారులు, కీలక వ్యక్తులు అంటూ పలువురిని విచారించిన ఆధారాలు సేకరించిన ఈడీ ఇప్పుడు ఈ కుంభకోణంలోని పొలిటికల్ లింకులను బయటపెట్టే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఒక రోజు వ్యవధిలో ఇద్దరు కీలక వ్యక్తులకు విచారణకు రావలసిందిగా నోటీసులు జారీ చేసింది. దర్యాప్తులో భాగంగా నోటీసులు జారీ చేసి విచారణకు పిలవడంలో వింతేముంది అనుకోవచ్చు.. కానీ ఈడీ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచిన వ్యక్తులు సామాన్యులు కాదు. ఇద్దరూ కూడా వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన వారే. వారిలో ఒకరు విజయసాయిరెడ్డి. ఈయన జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచీ ఇటీవలి కాలం వరకూ జగన్ కు కుడి ఎడమ భుజాలై పార్టీ వ్యవహారాలను నడిపారు.

అన్నిటికీ మించి.. జగన్ అక్రమాస్తుల కేసులో కూడా జగన్ తో పాటు సహ నిందితుడు. 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమి తరువాత ఆయన వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారనుకోండి అది వేరు సంగతి. ఇక ఈడీ నోటీసులు అందుకున్న రెండో వ్యక్తి వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి. ఈయనకు జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. వీరిలో విజయసాయిరెడ్డిని ఈడీ ఈ నెల 22న అంటే గురువారం విచారించనుంది. ఇక మిథున్ రెడ్డిని ఆ మరుసటి రోజు అంటే శుక్రవారం (జనవరి 23) విచారణకు పిలిచింది.  వరుస రోజులలో ఇరువురినీ విచారించడానికి ఈడీ నిర్ణయించడం కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే జగన్ హయాంలో  ఆంధ్రప్రదేశ్ మద్యం విధాన రూపకల్పన, అమలులో ఈ ఇరువురిదే కీలక పాత్ర అన్న ఆరోపణలు బలంగా ఉన్న సంగతి తెలిసిందే. 

ఇక పోతే ఈ కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని ఇప్పటికే సిట్ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిలుపై ఉన్నారు. విజయసాయి అరెస్టు కాలేదు కానీ  దర్యాప్తు సంస్థ నిఘాలో ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. అన్నిటికీ మించి ఈ కేసులో ఆయన అప్రూవర్ గా మారే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఆయనను ఇప్పటి వరకూ  సిట్ విచారణకు పిలవడం తప్ప అరెస్టు చేయలేదన్న ప్రచారమూ ఉంది. సరే అదలా ఉంచితే.. ఇప్పుడు వరుసగా విజయసాయి, మిథున్ రెడ్డిలను విచారణకు పిలిచి స్పీడ్ మీద ఉన్న సిట్ ఇదే దూకుడు కనబరిస్తే.. తదుపరి నోటీసులు ఎవరికి అన్న చర్చ జోరుగా సాగుతోంది. పరిశీలకులు అయితే.. వీరిద్దరి తరువాత ఈడీ విచారణ చేయాల్సింది జగన్ నేనని అంటున్నారు. దర్యాప్తు జగన్ దగ్గరకు వెళ్లడానికి విజయసాయి, మిథున్ రెడ్డిల విచారణ బాట పరుస్తుందని అంటున్నారు.

ఎందుకంటే..మద్యం కుంభకోణం సోమ్ముల మనీల్యాండరింగ్ లో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని ఇప్పటికే ఈడీ ప్రాథమికంగా అంచనాకు వచ్చిందంటున్నారు. కుంభకోణం సొమ్ముల సేకరణ,వాటి రూటింగ్ లెక్కలను ‘పై’కి చేరవేయడం వంటి విషయంలో మిథున్ రెడ్డే పాత్రధారి, సూత్రధారి అన్న ఆరోపణల నేపథ్యంలో మిథున్ రెడ్డి విచారణ కీలక అంశాలను బయటపెట్టే అవకాశం ఉందంటున్నారు. ఇక విజయసాయి రెడ్డి విషయానికి వస్తే.. ఇప్పటికే ఆయన మద్యం కుంభకోణం వ్యవహారంలో సిట్ ఎదుటే చెప్పాల్సింది, చెప్పగలిగింది అంతా చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఈడీ దర్యాప్తు తదుపరి అడుగు జగన్ తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తడుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  

By
en-us Political News

  
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.