Publish Date:Apr 30, 2022
వైసీపీ హయాంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు. పైగా సొంత పార్టీ కార్యకర్తలే దాడికి పాల్పడి గాయపరిచినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం తప్ప మరేం చేయలేకపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థికి కొత్తపల్లి జిల్లాలో శనివారం ఉదయం జరిగిన సంఘటన అద్దం పడుతుంది. ఏలూరు జిల్లాలో వైసీపీలో వర్గ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. చివరికి హత్య, దాడుల వరకూ వెళ్లాయి. వరుస సంఘటనలతో జి.కొత్తపల్లి గ్రామం శనివారం ఉదయం నుంచీ అట్టుడికి పోతున్నది. వైసీపీ జి.కొత్తపల్లి గ్రామ అధ్యక్షుడు శనివారం ఉదయం హత్యకు గురయ్యారు.
ఈ హత్య పార్టీలోని వైరివర్గం వారే చేశారనీ, ఆ వర్గానికి ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉందనీ ఆరోపిస్తూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేనే వైసీపీ కార్యకర్తలు చితకబాదారు. ద్వారకా తిరుమల మండలంలోని జీ. కొత్త పల్లిలో శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జి కొత్తపల్లి వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ గ్రామ అధ్యక్షుడు శనివారం ఉదయం హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక ఉన్నది గోపాలపురం ఎమ్మెల్యే వర్గమేనన్న అనుమానంతో ఈ దాడి జరిగింది.
హత్యకు గురైన గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్ముడిగా దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినా వారు దాడిని నిలువరించడంలో విఫలమయ్యారు. దాడిలో గాయపడిన తలారి వెంకట్రావును పోలీసులు అతి కష్టం మీద అక్కడి నుంచి తరలించగలిగారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/anarchy-in-ycp-rule-ruling-party-mla-wounded-in-ycp-workers-attack-25-135249.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!