ప్రజారోగ్యంపై మరో పిడుగు.. అల్బెలిఒన్ ఫెనొమెనొన్
Publish Date:Jul 8, 2022
Advertisement
ప్రజారోగ్యంపై మరో పిడుగు పడిందంటున్నారు. అల్బెలిఒన్ ఫెనొమెనొన్ అనే ఒక వాతావరణ పరిస్థితి ప్రజల ఆరోగ్యంపై ప్రతి కూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ నెల 8 నుంచి ఆగస్టు 22 వరకూ వాతావరణం సాధారణం కంటే అతి శీతలంగా మారిపోతుందంటున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తోంది. అల్బెలిఒన్ ఫెనొమెనొన్ కారణంగా అతిసీతల గాలుల ప్రభావం భారత్ లో తీవ్రంగా, ఉంటుందని ప్రజలు అప్రమత్తం గా ఉండాలని పర్యావరణ వేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే అల్బెనిఒన్ ఫెనొమెనొన్ అనేది కొత్తగా పుట్టుకొచ్చిన వాతావరణ స్థితి ఏమీ కాదు. ప్రతిఏటా జూలై 8 వ తేదీన 5 గం 27 నిమిశాలాకు లకు లో ప్రారంభమై ఆగస్ట్22 తో ముగుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఏడు మాత్రం అల్బెలిఒన్ ఫెనొమెనొన్ ప్రభావం ఒకింత ఎక్కువ తీవ్రతతో ఉంటుందని పేర్కొన్నారు. దీని వల్ల ప్రజలు తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, గొంతు మంట వంటి లక్షణాలతో బాధపడే అవకాశాలు పెచ్చుగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. దీనితో పాటు దగ్గు,జ్వరం శ్వాస సమస్యలు వస్తాయని, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో సైనస్, నిమొనియా, ఆస్తమా, బ్రోంకైల్ ఆస్తమా ఉన్నవారిలో సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయనీ వైద్య రంగ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అసలే ఫ్లూ కాలం ఆపైన చల్లని గాలులు వస్తే జలుబు ముక్కు కారడం, జ్వరం, దగ్గుకు తోడు స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ వంటివి విజృంభించే ప్రమాదం ఉందంటున్నారు. మరోవైపు కోవిడ్ ముప్పు పొంచే ఉంది. అందువల్ల ప్రజలు తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలంటున్నారు. శరీరానికి రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటే శరీరంలోని కణజాలం నశిస్తుందని. ఇది దీర్ఘ కాలిక అనారోగ్యానికి దారి తీయకుండా చూసుకోవా లని నిపుణులు హెచ్చరిస్తున్నారు.శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే విటమిన్ ఇ ఖనిజ లవణాలు సమృద్ధిగా సమతుల పోషకాహారం తీసుకోవాలని సూచించారు.ప్రతి రోజూ వ్యాయామం చేయాలని, మానసికంగా శారీరకంగా కుంగ దీసే ఒత్తిడులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలనీ హెచ్చరిస్తున్నారు. తరచుగా చేతులు కడుక్కోవడం.జలుబు తగ్గడానికి విటమిన్ సి యాంటి బాయిటిక్స్ తీసుకోవడం,ఆహారం లో తాజా పళ్ళ రసాలు,కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అల్బెలిఒన్ ఫెనొమెనొన్ ప్రభావం వల్ల అనారోగ్యానికి దూరంగా ఉండొచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.
http://www.teluguone.com/news/content/amoher-threat-to-people-health-25-139362.html





