మేం కేసులు పెడతాం.. మీరు లాగేసుకోండి!  ఏపీలో టీడీపీ టార్గెట్ గా జాయింట్ స్కెచ్

Publish Date:Jan 22, 2021

Advertisement

శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ సూత్రం ఎక్కడైనా వర్తిస్తుంది. రాజకీయాలకు అయితే మరింతగా దగ్గరగా ఉంటుంది. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు , శత్రువులు ఉండరంటారు. కలిసున్న నేతలు విడిపోతుంటారు.. బద శత్రువులుగా ఉన్నవారు ఏకమవుతుంటారు. తమ ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి మరో ప్రత్యర్థితో రాజీ చేసుకుంటూ ఉంటారు పొలిటికల్ లీడర్లు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి రాజకీయాలే కనిపిస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలపై నమోదవుతున్న కేసులు, అరెస్టులు చూస్తున్న వారికి ఇది ఇట్టే అర్ధమవుతోంది. కేంద్రం డైరెక్షన్ లోనే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. 
 
 ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని చూస్తున్న బీజేపీ..  టీడీపీ బలహీనం అయితేనే అది సాధ్యమని భావిస్తోంది. అంతేకాదు 2019 ఎన్నికల్లో తమతో విభేదించి.. ప్రధాని మోడీ. అమిత్ షాకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేయడాన్ని ఇంకా మర్చిపోలేకపోతోంది. అందుకే పార్టీ బలోపేతంతో పాటు చంద్రబాబుపై ప్రతీకారం తీసుకోవాలనే కసితో ఉంది కమలం పార్టీ. అందుకే టీడీపీని టార్గెట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఇందు కోసం  కొత్త ఎత్తులు వేస్తుందని తెలుస్తోంది. అందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సహకారం తీసుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. టీడీపీ నేతలపై రాష్ట్ర ప్రభుత్వం కేసుల పెట్టి వేధించడం.. తర్వాత బీజేపీ ఎంటరై తమ పార్టీలో చేరితే రక్షణ కల్పిస్తామని వారికి హామీ ఇవ్వడం... ఇది ఆ రెండు పార్టీల ఉమ్మడి వ్యూహమని తెలుస్తోంది. టీడీపీని బలహీనం చేయాలని బీజేపీ చూస్తుండగా... టీడీపీ తమకు కూడా ప్రధాన ప్రత్యర్థి కావడంతో వైసీపీ కూడా  అందుకు  సరే అన్నదని తెలుస్తోంది. ఏపీలో టీడీపీని ఖతం చేయడమే లక్ష్యంగా బీజేపీ, వైసీపీలు ఈ తరహా రాజకీయాలకు తెర తీశాయనే చర్చ  జరుగుతోంది.  

ఈ రెండు పార్టీల ఉమ్మడి వ్యూహంలో భాగంగానే పోలీసు కేసులు, అరెస్టులు జరుగుతున్నాయన్నది టీడీపీ నేతల మాట.  బీజేపీలోకి వెళతారని ప్రచారం జరుగుతున్న టీడీపీ నేతలే ... ఇటీవల పోలీసు కేసుల బాధితులుగా ఉంటుండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.  అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ జగన్ రెడ్డి సర్కార్ వచ్చాకా ఎక్కువ టార్గెట్ అయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి జైలుకు కూడా వెళ్లివచ్చారు. అయితే జేసీ ఫ్యామిలీ బీజేపీలోకి వెళుతుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ పెద్దలు జేసీ బ్రదర్స్ తో మాట్లాడారని కూడా చెప్పారు. కాని వాళ్లెవరు బీజేపీలోకి చేరలేదు. అందుకే వాళ్లపై పార్టీ మారేలా ఒత్తిడి పెంచడానికే కేసులు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా రాజాంలో టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావును పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. కళా వెంకట్రావును బీజేపీలోకి రావాలని సోము వీర్రాజు ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. అది జరిగిన కొన్ని రోజులకే ఈ అరెస్ట్ జరిగింది. దీంతో కళా వెంకట్రావును టీడీపీ నుంచి బయటికి లాగేందుకే అరెస్టు జరిగిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  

నిజానికి 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి భారీగా త‌మ పార్టీలోకి వ‌ల‌స‌లుంటాయ‌ని భావించారు కమలం పార్టీ నేతలు. అయితే అలాంటేది లేదు. తెలంగాణలో బీజేపీ దూసుకుపోతుండగా ఏపీ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడి లాగానే ఆ పార్టీ పరిస్థితి ఉంది. ఒక‌రిద్ద‌రు పేరున్న నేత‌ల త‌ప్ప మిగిలిన వాళ్లు క‌మ‌లం వైపు క‌న్నెత్తి కూడా చూడలేదు. దీంతో అమిత్ షా ఆదేశాల‌తో  టీడీపీ నుంచి నేత‌ల‌ను ఆక‌ర్షించేందుకు  ఏపీ బీజేపీ నేతలు న‌యా ఆఫ‌ర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. త‌మ పార్టీలోకి చెరితే వైసీపీ నుంచి వేధింపులుండ‌వ‌ని, పార్టీలో చేరితే చాలు వైసీపీ అస‌లు ప‌ట్టించుకోద‌ని ర‌హాస్య మీటింగ్స్ లో చెబుతున్న‌ట్లు టీడీపీ వ‌ర్గాల స‌మాచారం. 2019 ఎన్నికల తర్వాత ముగ్గురు టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీదీ వెంకటేష్ తో పాటు ఆదినారాయ‌ణ రెడ్డి, రావేల కిషోర్ బాబు, వ‌ర‌దాపురం సూరి వంటి నేత‌లు బీజేపీలో చేరారు. అప్ప‌టి నుంచి వాళ్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నార‌ని బీజేపీ వ‌ర్గాలు ప్ర‌చారం చేస్తోన్న‌ట్లు తెలుస్తోంది. మీరు కూడా పార్టీలోకి వ‌స్తే మీకు ఏ ఇబ్బందులు ఉండ‌వ‌ని అభ‌యం ఇస్తోన్న‌ట్లు చెబుతున్నారు. మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు వంటి నేతలను ఇలాంటి ఆఫర్లతోనే ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. 

 మరోవైపు సోమువీర్రాజు   అధ్య‌క్షుడి బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌టి నుంచి చేరిక‌లే లేక‌పోవ‌డంపై పార్టీ పెద్ద‌లు  గుర్రుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. టార్గెట్స్ సెట్ చేసి మ‌రి పార్టీలోకి అవ‌కాశం ఉన్న నేత‌లంద‌రి చేర్చుకోవాల‌ని వీర్రాజుపై ఒత్తిడి చేస్తోన్న‌ట్లు స‌మాచారం. అందులో భాగంగానే సోమువీర్రాజు కూడా గ్రౌండ్ వ‌ర్క స్టార్ చేశార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న నేత‌ల‌తో నేరుగా ఫోన్ సంభాష‌ణ‌లు కూడా చేస్తున్న‌ట్లు  చెబుతున్నారు.  త‌మ పార్టీ వ‌ద్ద ఉన్న ఆఫ‌ర్స్ వాళ్ల ముందు పెట్టి ఆలోచించుకోమ‌ని చెబుతున్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన కళా వెంకట్రావుతో నేరుగా మాట్లాడారనే చర్చ కూడా జరుగుతోంది.  

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.