హెర్మూజ్ రక్షణపై చేతులెత్తేసిన అమెరికా

Publish Date:Apr 2, 2026

Advertisement

హెర్మూజ్ జలసంధి రక్షణ విషయంలో అమెరికా చేతులెత్తేసింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని రక్షించుకోవాల్సిన బాధ్యత అమెరికాకు లేదన్ని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కుండబద్దలు కొట్టేశారు. ఆ మార్గంలో చమురు రవాణాపై ఎక్కువగా ఆధారపడే దేశాలే హెర్మూజ్ జలసంధిని రక్షించుకోవాలని అల్టిమేటం ఇచ్చారు. హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా ఆగిపోతే తీవ్రంగా నష్టపోయే ఏడు దేశాలూ అక్కడ తమ యుద్ధనౌకలను మోహరించాలన్నారు.  

 హెర్మూజ్ జలసంధి గుండా జరిగే చమరు రవాణా అమెరికాకు పెద్దగా అవసరం లేదన్న ఆయన.. తాము ఆ మార్గం గుండా కేవలం ఒక శాతం చమురునే పొందుతున్నట్లు గుర్తు చేశారు.   అమెరికా  సొంత ఇంధన వనరులతో స్వయం సమృద్ధి సాధించిందన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఆయన లక్ష్యం ప్రధానంగా చైనా, జపాన్, కొరియా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలేనని అవగతమౌతోంది.

 ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. అమెరికా హెర్మూజ్ జలసంధి విషయంలో చేతులెత్తేయడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  ఇప్పటికే బ్రిటన్ ఈ యుద్ధం తమది కాదనీ, తాము జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా చెప్పేసింది. ఇతర దేశాలు కూడా ట్రంప్ అల్టిమేటంపై స్పందించడానికి ముందుకు రావడం లేదు.  

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రభావంతో ఉద్యోగాల కోతలు పెరుగుతున్న వేళ
ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న అత్యంత ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు చెలరేగిపోయారు.
చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ నాటికి సీఎస్కే‌ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా మారనున్నాడా
తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది.
రైతు గోస - బీజేపీ భరోసా యాత్ర మూడవ రోజుకు చేరుకుంది
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ మైనింగ్‌ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది.
పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడనుంది.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడులో సరికొత్త ఉత్సాహం, జోష్ కనిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ముగింపు దశకు చేరుకుంది.
రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్ పరిధిలోని పి.ఆర్.ఎల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో నమోదైన భారీ రియల్ ఎస్టేట్ మోసం కేసు సంచలనంగా మారింది
ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం విజయ్ కీలక భేటీ
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.