అమెరికా అమెరికన్లకే.. ట్రంప్ నినాదం, విధానం ఎటు దారితీస్తుంది?
Publish Date:Apr 24, 2026
Advertisement
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో సారి పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత అమెరికన్లకే అమెరికా అన్న నినాదం, విధానం గట్టిగా, బలంగా వినిపిస్తున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ఇది అక్కడ స్థిరపడిన భారతీయులలో ఆందోళన పెరుగుతోంది. స్వదేశానికి మరళిపోవడమే బెటరా అన్న ఆలోచన రేకెత్తిస్తున్నది. అదే సమయంలో లక్షల మంది ఇమ్మిగ్రేంట్స్ లో భవిష్యత్ పట్ల భయం పెరిగేలా చేస్తున్నది. డొనాల్డ్ ట్రంప్ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన ప్రవాస విధానాలు మరింత కఠినతరమయ్యాయి. అమెరికా ఫర్ అమెరికన్స్ ఓన్లీ అనే రాజకీయ నినాదం, వాస్తవానికి వలస వ్యతిరేక భావజాలానికి అధికారిక ముద్ర వేసినట్లుగా అనేక విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేకంగా భారతీయ మూలాలున్న వలసదారులో తమ ఉద్యోగ భద్రత, వీసా స్థిరత్వం, కుటుంబ భవిష్యత్ వంటి విషయాలలో వంటి అంశాలపై తీవ్రమైన అనిశ్చితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో దాదాపు 40శాతం మందిలో అమెరికా వదిలి వెళ్లక తప్పదా? అన్న ఆలోచన మొదలైదని ఒక అంచనా. తాజా కార్నెగీ ఎండౌమెంట్ సర్వే ప్రకారం.. అమెరికాలో నివసిస్తున్న భారతీయ మూలాలున్న పౌరులలో దాదాపు 40శాతం మంది అమెరికాను శాశ్వతంగా విడిచి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఇది కేవలం వ్యక్తిగత కెరీర్ నిర్ణయం మాత్రమే కాకుండా.. అమెరికా రాజకీయ వాతావరణంపై ఉన్న లోతైన అసంతృప్తికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశం విడిచి వెళ్లాలని యోచిస్తున్న భారతీయ అమెరికన్ల శాతం 40% దాటడం, అమెరికా ఇమిగ్రేషన్ చరిత్రలోనే కీలక మలుపుగా చెప్పవచ్చు. అదే సర్వేలో.. అమెరికా విడిచి వెళ్లాలని భావిస్తున్న వారిలో 58% మంది రాజకీయ స్థిరత్వం లేకపోవడాన్నే కారణంగా చూపడం విశేషం. ట్రంప్ వలస వ్యతిరేక వ్యాఖ్యలు,జాతి, మత, వర్గ విభజనలపై పెరుగుతున్న ఉద్రిక్తత, విధానాల్లో ఆకస్మిక మార్పులు.. ఇవన్నీ కలిసి అమెరికా ఇంకెంత మాత్రం స్థిరంగా ఉండే పరిస్థితి లేదన్న భావన వలసదారులలో ఏర్పడిందన్నది నిపుణుల విశ్లేషణ. ఇకపోతే 71శాతం భారతీయ అమెరికన్లు ట్రంప్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ సర్వే ప్రకారం.. ఈ అసంతృప్తికి వలస విధానాలను కఠినతరం చేయడం, విసా ప్రక్రియలలో అనిశ్చితి, ఆలస్యం, ఇంకా సామాజిక మాధ్యమాలలో, రాజకీయ వేదికలపై వలసదారులపై పెరుగుతున్న ప్రతికూల వతావరణం తదితర అంశాలు కారణంగా చెబుతున్నారు. ట్రంప్ పాలనపై భారతీయ అమెరికన్ల అసంతృప్తి, అమెరికా భారత వలస సంబంధాల భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. 2024–25 నాటికి, అమెరికాలో 5.4 మిలియన్లకు పైగా భారతీయ మూలాలున్న ప్రజలు నివసిస్తున్నారని అంచనా. ఇది మొత్తం అమెరికా జనాభాలో సుమారు 1.5శాతం. వీరు అధిక విద్యావంతులు, టెక్నాలజీ, వైద్యం, ఫైనాన్స్, అకెడిమియా వంటి రంగాల్లో అత్యంత కీలక పాత్రపోషిస్టున్న వృత్తి నిపుణులు. ఈ ప్రొఫెషనల్స్.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన మద్దతు అందిస్తున్నారు. అయితే..ప్రొఫెషనల్సే.. ఇప్పుడు భద్రత, గౌరవం, స్థిరత్వం వంటి మౌలిక అంశాలపై ప్రశ్నలు వేస్తున్న దశకు చేరుకోవడం, అమెరికా అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నది పరిశీలకులు భావన. ఇకపోతే.. కాటో ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం.. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధ వలసలు (లీగల్ ఇమిగ్రేషన్) గణనీయంగా తగ్గాయి. ఆశ్చర్యకరంగా ఈ పతనం అనధికార వలసల కంటే ఎక్కువగా నమోదైంది. ఇది అమెరికా వలస విధానంలో ఒక సంరక్షణాత్మక మలుపుగా చెప్పవచ్చు. అంటే.. క్రమబద్ధంగా, నిబంధనల ప్రకారం వచ్చే వలసదారులకే అడ్డంకులు పెరుగుతున్నాయన్నమాట. . లీగల్ ఇమిగ్రేషన్ తగ్గడం, నిబంధనలు పాటించే వలసదారులకే తలుపులు మూస్తున్నారా? అనే ప్రశ్నను తెరమీదకు తెచ్చింది. అలాగే హెచ్ 1 బి వీసాలలో పాతిక శాతం కోత, అదే సమయంలో లక్ష డాలర్ల ఫీజు.. వెరసి 87శాతం పిటిషన్లు పతనానికి దారి తీసింది. అమెరికా టెక్ రంగానికి వెన్నెముకగా భావించే హెచ్ 1 బి వీసా వ్యవస్థ కూడా ట్రంప్ రెండో పర్యాయం కాలంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. గత ఏడాది హెచ్ వన్ బీ వీసాల జారీ దాదాపు పాతిక శాతం తగ్గిపోయింది. వీసాల జారీ సుమారు 25% తగ్గింది. ఇక హెచ్ 1బి వీసాలపై పది లక్ష H-1B పిటిషన్లపై లక్ష డాలర్ల భారీ ఫీజు విధించిన తర్వాత.. కంపెనీల దరఖాస్తులు 87శాతం మేర పడిపోయాయి. అంతే కాకుండా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ వీసాల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా. ఇది భారతీయ ఐటీ నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, అమెరికాలో కెరీర్ నిర్మించాలనుకునే యువతపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. విద్యార్థి వీసాల మంజూరు సైతం కఠినతరం అయ్యింది. సోషల్ మీడియా వెట్టింగ్, ఇతర పరిమితుల వల్ల దాదాపు 40శాతం వరకూ పతనమయ్యాయి. అదే అధ్యయనాల ప్రకారం, విద్యార్థి వీసాల జారీ కూడా సుమారు 40శాతం తగ్గింది. సోషల్ మీడియా అకౌంట్లపై కఠినమైన వెట్టింగ్, భద్రతా పరిశీలనల పేరుతో పెరిగిన ఆలస్యం, వీసా ఇంటర్వ్యూలలో పెరిగిన తిరస్కరణ రేటు వంటి అంశాలు ఇందుకు ప్రధానకారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమెరికా యూనివర్సిటీలను లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ విద్యార్థుల కలలపై, వీసా పరిమితులు నేరుగా ప్రభావం చూపుతున్నాయి. దీంతో అమెరికా వెళ్లాని భావించే వారిలో నెమ్మదిగా మార్పు వస్తున్నది. గతంలో అమెరికా అంటే.. అవకాశాల భూమి. ప్రతిభకు గుర్తింపు, గౌరవం దక్కే వేదిక. అయితే.. ఇప్పుడు.. వలస విధానాల కఠినతరం, రాజకీయ విభజన, జాతి, మత, వలస నేపథ్యాలపై పెరుగుతున్న ఉద్రిక్తత.. ఇవన్నీ కలిసి అమెరికా కలను, కొంతమందికి అమెరికా సందేహం గా మార్చేస్తున్నాయి. భారతీయ అమెరికన్ల భష్యత్తు ఇప్పుడు కీలక మలుపు వద్ద ఉంది. ఒకవైపు తమ కెరీర్, కుటుంబం, పిల్లల విద్య, మరోవైపు భద్రత, గౌరవం, రాజకీయ స్థిరత్వం. వీటి మధ్య సంతులనం కోసం ఎదురు చూపులు. అదలా ఉంటే.. ట్రంప్ రెండో పర్యాయం విధానాలు అమెరికా, భారత వలస సంబంధాలపై, గ్లోబల్ టాలెంట్ మైగ్రేషన్ ధోరణులపై, అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతీయ వృత్తి నిపుణుల పాత్రపై నిస్సందేహంగా ప్రభావం చూపుతాయి. అమెరికాలో ఉండాలా? లేక తిరిగి వెళ్లాలా? అనే ప్రశ్న, ఇప్పుడు వేలాది భారతీయ కుటుంబాల డైనింగ్ టేబుల్ చర్చగా మారింది. ట్రంప్ వవలస విధానాలు కొందరి దృష్టిలో జాతీయ భద్రత, స్థానిక ఉద్యోగాల రక్షణ కోసం అవసరమైన కఠిన చర్యలుగా భవిస్తుంటే.. మరి కొందరు.. వలస వ్యతిరేక, అనిశ్చితి పెంచే నిర్ణయాలుగా అభివర్ణిస్తున్నారు. ఈ విధానం కేవలం వీసా గణాంకాలకే పరిమితం కాకుండా,వారి మానసిక భద్రత, సామాజిక స్థానం, రాజకీయ నమ్మకాలపై కూడా పడుతోంది. సంకలనం, సేకరణ: సీతారాం కంఠంనేని References: 1. https://carnegieendowment.org/research/2026/02/indian-americans-in-a-time-of-turbulence-2026-survey-results?utm_source=copilot.com
2. https://policycommons.net/artifacts/44991765/indian-americans-in-a-time-of-turbulence/45890571/?utm_source=copilot.com
3. https://carnegieendowment.org/research/2025/07/indian-americans-social-survey-data?utm_source=copilot.com
http://www.teluguone.com/news/content/america-for-americans-only-36-218153.html





