అమెరికా, ఇరాన్ మధ్య పీక్స్ కు ఉద్రిక్తతలు.. రణరంగంగా మిడిల్ఈస్ట్.!

Publish Date:Jul 14, 2026

Advertisement

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరుకున్నాయి. పరస్పర వైమానిక, క్షిపణి దాడులతో మిడిల్ ఈస్ట్   రణరంగంగా మారింది. ఇరాన్ భూభాగంలోని సైనిక స్థావరాలు లక్ష్యంగా అమెరికా సైన్యం   వైమానిక దాడులను తీవ్రతరం చేయగా,  అందుకు ప్రతిగా కువైట్, బహ్రెయిన్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక  స్థావరాలపై ఇరాన్ బలగాలు విరుచుకుపడ్డాయి.

హర్మూజ్ జలసంధి ద్వారా  ప్రయాణించే అంతర్జాతీయ వాణిజ్య నౌకలను కాపాడేందుకే తాము ఇరాన్ మిలిటరీ సామర్థ్యాలపై  దాడులు జరిపినట్లు అమెరికా రక్షణ విభాగం చెబుతోంది. అమెరికా దాడులకు దీటుగా..  ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్  కువైట్ లోని  అలీ అల్ సలేం సైనిక విమానాశ్రయంపై   బాలిస్టిక్ క్షిపణి, 5 క్రూయిజ్ క్షిపణులు, 33 అత్యాధునిక డ్రోన్లతో దాడికి పాల్పడింది.

ఈ దాడిని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకున్నప్పటికీ..  కువైట్ నౌకాదళానికి చెందిన ఒక నౌక ధ్వం సం కాగా, నలుగురు జవాన్లు గాయపడ్డారు. అదే సమయంలో బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో నౌకాదళ కమాండ్ కార్యాలయాలపై కూడా ఇరాన్ భారీ దాడులకు పాల్పడింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా హర్మూజ్ జలసంధి పరిసరాల్లోకి ఏకంగా 21 యుద్ధనౌకలను పంపి ఇరాన్ చుట్టూ బలమైన నౌకాదళ దిగ్బంధనాన్ని విధించింది. చర్చల ప్రక్రియకు ఇరాన్ సహకరించకపోతే ఆ దేశ విద్యుత్ వ్యవస్థలను, వంతెనలను   నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. చమురు శుద్ధి కేంద్రాలపై దాడిని తమ చివరి అస్త్రంగా ఉపయోగిస్తామని కుండబద్దలు కొట్టారు.

అయితే ఎలాంటి పటిష్ట ప్రణాళిక లేకుండా అమెరికాను మరో చట్టవిరుద్ధ యుద్ధంలోకి ట్రంప్ నెడుతు న్నారంటూ అమెరికన్ సెనేటర్లు, డెమొక్రాట్ ప్రతినిధులు  అగ్రరా జ్యాధినేతపై విమర్శలు గుప్పిస్తున్నారు.  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా ఏకపక్ష దాడులపై ఇరాన్   అధికారి కంగా ఫిర్యాదు చేసింది. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోకుంటే ఈ ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యం,  చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తోంది. 

West Asia Conflict, US Air Strikes on Iran, Iran Missile Attack Kuwait Bahrain, Donald Trump Iran Warning, Hormuz Strait Blockade

By
en-us Political News

  
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనల్లో భాగంగా వాంగ్‌చుక్ నిరవధిక నిరశన చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందంటూ దాఖలైన ఒక అత్యవసర పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో దాడులు విపరీతంగా పెరిగిన సంగతి విదితమే. ముఖ్యంగా మొంబాసా బి, అల్ బహ్యా, జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ వెద్యాన్, అల్ రెకయ్యాత్ వంటి వాణిజ్య నౌకలపై జరిగిన వరుస దాడులు అంతర్జాతీయ నౌకాయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి.
ఆంక్షల ప్రకారం, సాధారణ పౌరులకు గానీ, దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు గానీ కోట ప్రాంగణంలోకి ప్రవేశం ఉండదు. కేవలం ఈ వేడుకల ఏర్పాట్లలో పాల్గొనే ఉన్నతాధికారులు, సిబ్బంది,  అధికారిక అనుమతి పత్రాలు ఉన్న  వ్యక్తులను మాత్రమే కఠిన తనిఖీల అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు.
పాకిస్తాన్ సైనిక బలగాలు తమ ప్రాంతాన్ని చట్టవిరుద్ధంగా, అక్రమంగా ఆక్రమించుకున్నాయని అమ్జాద్ అయూబ్ మీర్జా ప్రకటించారు. ఈ ప్రాంతం ఎంతమాత్రం స్వతంత్రమైనది కాదని, పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను బానిసలుగా చూస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
విద్యా రంగానికి సంబంధించి మొత్తం ఐదు పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో మూడు సాధారణ డే స్కూళ్లు కాగా, మిగిలిన రెండు పూర్తి స్థాయి వసతులతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాలలు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్.. దానినుంచి బయటపడేందుకు డిస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. అగ్రరాజ్యం విధించే కఠినమైన వ్యూహాత్మక నిబంధనలకు తలవొగ్గుతూ తన సొంత రక్షణ వ్యవస్థను పరాధీనం చేసుకుంటోందన్నది ఆ కథనాల సారాంశం.
మిడిల్ ఈస్ట్ యుద్ధ ఉద్రిక్తతలు మరియు వంద డాలర్లు దాటిన క్రూడాయిల్ ధరల మధ్య భారత స్టాక్ మార్కెట్లు అద్భుత రికవరీ సాధించాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24100 మార్కును దాటింది. మార్కెట్ తదుపరి గమనంపై విశ్లేషకుల అంచనాలు మీకోసం.
స్విట్జర్లాండ్‌లోని ETH జ్యూరిచ్ శాస్త్రవేత్తలు గిటార్ సూత్రాంతర్భాగంగా పనిచేసే సరికొత్త వేలి గోరు పరిమాణపు క్వాంటం చిప్‌ను ఆవిష్కరించారు. ఈ చిప్ విద్యుదయస్కాంత తరంగాల కంటే 1,00,000 రెట్లు చిన్న శబ్ద ప్రకంపనలను ఉపయోగించి డేటాను భద్రపరుస్తుంది, ఇది క్వాంటం ర్యామ్ (QRAM) పరిశోధనలో ఒక పెద్ద మైలురాయి.
స్కల్‌కాండీ సరికొత్త ప్రీమియం హెడ్‌ఫోన్స్ Crusher 1080 ANC విడుదల చేసింది. బోస్ సంస్థకు చెందిన బెస్ట్ ఇన్ క్లాస్ నాయిస్ క్యాన్సిలేషన్, స్పేషియల్ ఆడియో ఫీచర్లతో, 60 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో సగం ధరకే అందుబాటులోకి వచ్చిన ఈ గ్యాడ్జెట్ పూర్తి వివరాలు చూడండి.
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గోల్ఫ్ టోర్నమెంట్ ది ఓపెన్ 2026 రాయల్ బర్క్‌డేల్‌లో ప్రారంభమైంది. స్కాటీ షెఫ్లర్, రోరీ మెక్‌ఇల్రాయ్ తలపడుతున్న ఈ మెగా ఈవెంట్‌ను మొబైల్ మరియు టీవీల్లో ఉచితంగా ఎలా చూడాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అమెరికా ఐటీ దిగ్గజం ఐబీఎం (IBM) 25% ఘోర పతనాన్ని చవిచూసినప్పటికీ, మెరుగైన క్యూ1 ఫలితాల అండతో భారతీయ ఐటీ షేర్లు మార్కెట్లో నిలదొక్కుకున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బంగారం మరియు గ్లోబల్ స్టాక్స్ వైపు మళ్లుతున్న భారతీయ పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన 5 ప్రధాన రిస్కులు ఇవే. అమెరికా బాండ్ ఈల్డ్స్, క్రూడ్ ఆయిల్ ధరలు మరియు భౌగోళిక ఉద్రిక్తతల వల్ల మీ పోర్ట్‌ఫోలియోపై పడే ప్రభావం గురించి పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా ఘనవిజయం సాధించిన తర్వాత ఆటగాళ్లు ప్రదర్శించిన లాస్ మాల్బినాస్ సన్ అర్జెంటీనాస్ బ్యానర్ ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమైంది. 1982 ఫాక్‌లాండ్ యుద్ధ గాయాలను రేపిన ఈ నినాదం వెనుక ఉన్న అసలు కథ, ఫిఫా నిబంధనలు మరియు అర్జెంటీనా జట్టు ఎదుర్కోబోయే చర్యల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.