పెంపుడు కుక్క కోసం అంబులెన్స్ బుక్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు!

Publish Date:Mar 4, 2025

Advertisement

ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించబడన సేవల దుర్వినియోగం ఏ విధంగా చూసినా నేరమే. అపరాధమే. అందులోనూ అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలు కాపాడేందుకు రోడ్లపై సైరెన్ తో పరుగులు పెట్టాల్సిన అంబులెన్స్ ను తమ స్వార్థం కోసం ఇష్టారీతిగా ఉపయోగించుకుంటున్న సంఘటనలను ఎవరైనా సరే ఖండించాల్సిందే. 

అంబులెన్స్ టోయ్ టోయ్ టోయ్ అంటూ రోడ్ల మీద పరుగులు తీస్తుంటే.. వాహనదారులు తన వాహనాలను పక్కకు తీసి మరీ దారి ఇస్తుంటారు. సిగ్నల్స్ దగ్గర కూడా అంబులెన్స్ కోసం వాహనాలు గ్రీన్ సిగ్నల్ పడినా కదలకుండా ఆగిపోతాయి. అలాంటి అంబులెన్స్ లను తమ జల్సాల కోసం, సరదాల కోసం దుర్వినియోగం చేస్తున్న ఘటనలు కోకొల్లలు. ఖాళీ అంబులెన్స్ ను సైరెన్తో స్పీడ్ గా నడిపి సిగ్నల్ క్రాస్ చేసి తాపీగా చాయ్ తాగే అంబులెన్స్ డ్రైవర్లను చూశాం. సర్వీస్ ఆటోలా రోడ్డు పక్కన ఆపి.. ప్యాసింజర్లను ఎక్కించుకుని సైరెన్ వేసుకుని సర్వీస్ చేసి డబ్బులు దండుకున్న సంఘటనలూ తెలుసు.   ఓ వ్యక్తి తన కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడానికి ఏకంగా అంబులెన్స్ ను బుక్ చేసుకుని సైరెన్ తో రోడ్ల మీద జనాలకు అదరట్టిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. 

అంబులెన్స్ సేవలను దుర్వినియోగం చేయడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులను అయోమయానికి గురి చేస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెచ్చరిల్లడంతో పోలీసులు ఇటువంటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆ డ్రైవ్ లో భాగంగా మంగళవారం నాడు పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసు స్టేషన్ సమీపంలో సైరన్ తో వేగంగా వెడుతున్న అంబులెన్స్ ను ఆపి చెక్ చేశారు. ఆ తనిఖీలో దిగ్భ్రాంతి గొలిపేలా అంబులెన్స్ లో ఓ కుక్కను తరలిస్తుండటం బయటపడింది. ఆ కుక్కను ఎక్కడికి తీసుకెడుతున్నారన్నది ఆరా తీస్తే.. ఆ కుక్కకు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు మదీనగూడలోని ఐవీ హాస్పిటల్ కు తీసుకువెడుతున్నట్లు తేలింది. దీంతో పోలీసులు ఆ అంబెలెన్స్ ను సీజ్ చేసి, అంబులెన్స్ ఓనర్ పై కేసు నమోదు చేశారు.  అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగిని మాత్రమే అంబులెన్స్‌లో సైరన్‌ వేసుకుని తరలించాల్సి ఉంటుందని, ఖాళీగా వెళ్లే సమయంలో కూడా కొంతమంది సైరన్లు వేసుకుని వెళ్తుండడం చట్ట విరుద్దమని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. అలాగే పెంపుడు జంతువులను తరలించేందుకు అంబులెన్స్ లు వాడటం కూడా చట్టరీత్యానేరమని చెప్పారు. మొత్తం మీద పెంపుడు కుక్కను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.