అమెజాన్ ప్రైమ్ డే సేల్: గ్యాడ్జెట్స్‌పై 80% వరకు భారీ డిస్కౌంట్లు!

Publish Date:Jun 30, 2026

Advertisement

షాపింగ్ ప్రియులకు సరికొత్త పండగ వచ్చేసింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో తన ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రవేశపెట్టి విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సరికొత్త ఆఫర్ల సునామీతో ముందుకు వస్తోంది. జూలై 4 నుంచి జూలై 6 వరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన "అమెజాన్ ప్రైమ్ డే డీల్స్" లైవ్ లోకి రానున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సరికొత్తగా ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలనుకునే వారికి కంపెనీ రూ.500 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అంటే సాధారణంగా రూ.1,499 ఉండే వార్షిక సబ్‌స్క్రిప్షన్ ఇప్పుడు కేవలం రూ.999 కే లభించనుంది. ప్రైమ్ మెంబర్స్‌కు మరో అద్భుతమైన సదుపాయం ఏమిటంటే, ఈ భారీ సేల్ డీల్స్ ప్రారంభం కావడానికి 72 గంటల ముందే వారు ప్రొడక్ట్స్‌ను యాక్సెస్ చేసి కొనుగోలు చేసే వీలుంటుంది. ఈసారి ప్రైమ్ డే సేల్‌లో దేశీయ మరియు అంతర్జాతీయ అగ్రశ్రేణి బ్రాండ్లకు చెందిన దాదాపు 500కు పైగా సరికొత్త ప్రొడక్ట్స్ అందుబాటులోకి రాబోతున్నాయి.

ఈ సేల్‌లో కొనుగోలుదారుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లను కూడా ప్రకటించారు. ఎస్బీఐ డెబిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మరియు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు జరిపినా, లేదా ఈఎంఐ సదుపాయాన్ని ఎంచుకున్నా 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. వీటికి అదనంగా అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించే ప్రైమ్ సభ్యులకు అపరిమితంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా దక్కనుంది. ఈ ఆఫర్ల ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ మరియు గృహోపకరణాలను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ఈ సేల్‌లో మైండ్ బ్లోయింగ్ డీల్స్ వేచి ఉన్నాయి. ముఖ్యంగా ప్రీమియం ఫోన్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై ఏకంగా రూ.15,000 భారీ డిస్కౌంట్ లభించనుంది. దీనితో రూ.84,999 ఫోన్‌ను అత్యంత తక్కువ ధరలోనే కొనుగోలు చేసే అవకాశం దక్కుతుంది. అలాగే మార్కెట్లో క్రేజ్ ఉన్న వన్‌ప్లస్ 13, ఐఫోన్ 17 సిరీస్‌లపై కూడా కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. సామ్ సంగ్ గెలాక్సి ఎం47, వన్‌ప్లస్ ఎన్6, వన్‌ప్లస్ నోర్డ్ 6, రెడ్మి ఏ7 ప్రొ 5జీ మరియు ఐక్యూ 15ఆర్ వంటి మొబైల్స్ పై భారీగా ధరలు తగ్గనున్నాయి. మొత్తంగా స్మార్ట్‌ఫోన్‌లు, వాటి యాక్సెస్సరీలపై 40 శాతం వరకు బంపర్ డిస్కౌంట్లతో పాటు తక్షణ బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర గ్యాడ్జెట్ల విభాగంలో ఆఫర్లు నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. బోట్ రాకెర్జ్ 650 ప్రొ, రే బ్యాన్ మెటా వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్, వేరబుల్స్, హెడ్ ఫోన్లు మరియు వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్ 4 ప్రొ, శామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రొలపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. గోప్రొ హీరో 13 బ్లాక్ వంటి పాపులర్ కెమెరాలు, కెమెరా యాక్సెసరీలపై 75 శాతం వరకు, డెల్ 15 ల్యాప్‌టాప్‌లు మరియు టాబ్లెట్ల పై 40 శాతం వరకు, స్పీకర్లపై 60 శాతం వరకు ధరలు తగ్గనున్నాయి. ఇక స్మార్ట్ టీవీల విషయానికి వస్తే శామ్ సంగ్, సోనీ, టీసీఎల్, ఎల్జీ, గ్జియోమీ బ్రాండ్ టీవీలపై 65 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. దీనితో పాటు రూ.12,000 వరకు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్లు, రూ.5,000 వరకు కూపన్ డిస్కౌంట్లు, 12 నెలల వరకు 'నో కాస్ట్ EMI' సదుపాయం కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

ఇంటికి కావలసిన గృహోపకరణాల కొనుగోలుకు కూడా ఇదే సరైన సమయం. హియర్, శామ్ సంగ్, ఎల్జీ, గోద్రెజ్, డైకిన్ వంటి బ్రాండ్ల రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లపై 65 శాతం వరకు తగ్గింపు ఉంది. వీటిపై అదనంగా రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, రూ.17,000 వరకు ఇన్ స్టంట్ తగ్గింపు లభించనుంది. ఎల్జీ, శామ్ సంగ్, బోచ్, ఐఎఫ్బీ బ్రాండ్ వాషింగ్ మెషీన్లపై 60 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. వీటితో పాటు ఫ్యాషన్, బ్యూటీ విభాగంలో దుస్తులు, పాదరక్షలు, గడియారాలు, ఆభరణాలు మరియు లగేజీ ఉత్పత్తులపై ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన డీల్స్ లభించనున్నాయి. కాబట్టి ఈ జూలై 4 నుంచి ప్రారంభమయ్యే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ను అస్సలు మిస్ అవ్వకండి.

By
en-us Political News

  
సమాజంలో ఉన్నతమైన హోదాల్లో ఉన్న మంత్రి, ఐఏఎస్ అధికారిణి ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఈ ఫేక్ వీడియోలు ఉన్నాయంటూ తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.
గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే గతంలో రెండు సార్లు విచారణకు హాజరు కావడానికి గడువు కాలాలంటూ కోరిన గుడివాడ అమర్నాథ్ ఈ రోజు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
. ఈ సంఖ్య ఎంత పెద్దదంటే, మన దేశంలోని గోవా రాష్ట్రంలో ఉండే మొత్తం కుటుంబాల కంటే కూడా గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం ఎంత వేగంగా విస్తరిస్తోందో.. ఉపాధి కోసం ఎంతలా జనం ఇక్కడికి తరలివస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం.
అద్విత్ జ్యువెలర్స్ ఐపీఓ 212.63 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌తో రికార్డు సృష్టించింది. రూ. 46 జీఎమ్‌పీతో జూలై 1న భారీ లిస్టింగ్ లాభాల అంచనాలు. పూర్తి వివరాలు మరియు అలాట్‌మెంట్ స్టేటస్ ఇక్కడ చూడండి.
దేశవ్యాప్తంగా మహిళా క్రికెట్ ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెట్‌ లీగ్ (EWCL) లోగో జూబ్లీహిల్స్‌లో ఘనంగా ఆవిష్కరించబడింది. ఆగస్టు 15 నుంచి 16 జట్లతో ప్రారంభం కానున్న ఈ లీగ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా తీవ్రమైన భుజాల నొప్పితో బాధపడుతున్న సంగతి విదితమే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అంబానీ ఆస్పత్రిలో చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
2026 ఫిఫా వరల్డ్‌కప్‌ నాకౌట్‌లో పెను సంచలనం నమోదైంది. బలమైన జర్మనీ జట్టుకు పరాగ్వే పెనాల్టీ షూటౌట్‌లో 4 3 తేడాతో షాకిచ్చి లాస్ట్ 16కు దూసుకెళ్లింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) భారత ఫార్మా కంపెనీలు, కెమిస్ట్ అసోసియేషన్లపై దాఖలైన 14 ఏళ్ల నాటి యాంటీ కాంపిటీటివ్ కేసును కొట్టివేసింది. తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ వెలువరించిన ఈ కీలక తీర్పు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI వల్ల డబ్బు ఆదా అవుతుందని అనుకుంటున్నారా అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే. మానవ ఉద్యోగుల కంటే ఏఐ నిర్వహణకే టెక్ కంపెనీలకు విపరీతమైన ఖర్చవుతోందని ఎన్విడియా ఎగ్జిక్యూటివ్ మరియు ఎంఐటీ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీ ప్రభుత్వ సరికొత్త ఈవీ పాలసీ 2026 పూర్తి వివరాలు. మొదటి 1000 ఎలక్ట్రిక్ ట్రక్కులకు 10 ఏళ్ల నో ఎంట్రీ మినహాయింపు, కార్లపై రోడ్డు టాక్స్ రద్దు మరియు భారీ సబ్సిడీల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
బిట్‌కాయిన్ ధర మళ్లీ 60,000 డాలర్ల దిగువకు పడిపోయింది. అమెరికా ఫెడ్ నిర్ణయాలు, అంతర్జాతీయ పరిణామాల మధ్య క్రిప్టో మార్కెట్ తదుపరి గమ్యం ఏంటి? నిపుణులు సూచిస్తున్న కీలక మద్దతు ధరల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యూఏఈలో నివసిస్తున్న 35 లక్షల మంది భారతీయులకు అలర్ట్. జూలై 1, 2026 నుంచి భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు మరియు కొత్త సెంటర్ల నిబంధనల్లో కీలక మార్పులు వచ్చాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.1,41,000 మార్కు కంటే దిగువకు పడిపోగా, వెండి ధర కూడా క్షీణించింది. పూర్తి లేటెస్ట్ రేట్లు మరియు ఇన్వెస్టర్ల గైడ్ ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.