Publish Date:Jun 30, 2026
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముంబైలోని అంబానీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఇందు కోసం ఆయన సోమవారం జూన్ 29) ముంబై చేరుకున్నారు. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరారు. పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా తీవ్రమైన భుజాల నొప్పితో బాధపడుతున్న సంగతి విదితమే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అంబానీ ఆస్పత్రిలో చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఇటీవల కొన్ని నెలల క్రితమే ఆయన కు హైదరాబాద్‌లో నాసల్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భుజాల నొప్పి నివారణ కోసం ఆయన అంబానీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. కాగా పవన్ కల్యాణ్ వెంట ఆయన సతీమణి అనా లెజ్నెవా కూడా ఉన్నారు.
పవన్ కల్యాణ్ భుజాల కండరాలు దెబ్బతినడం వల్లే ఆయన ఇబ్బంది పడుతున్నారని ఆయన కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. పర్యటనల్లో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చుట్టుముట్టడం, తోపులాటలు జరిగిన ఘటనలు కారణంగా ఆయన భుజాల కండరాలు దెబ్బతిన్నాయని అంటున్నారు.
ఈ సమస్యకు చికిత్స కోసమే దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తుందన్న పేరు ఉన్న అంబానీ హాస్పిటల్‌లో ఆయన సోమవారం (జూన్ 29) చేరారు. అంబానీ ఆస్పత్రిలో పవన్‌కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. భుజాల సమస్య తీవ్రతను బట్టి వైద్యులు చిన్న సర్జరీ అవసరమని తేల్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-deputy-cm-joins-amban-hospital-36-224602.html
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.