ఇంటర్నెట్ లో షాపింగ్... ఇంటికే పార్సిల్... ఇదో కొత్త అడిక్షన్!

Publish Date:Oct 7, 2016

Advertisement

చాలా దేశాల్లో అమ్మే సత్తా వ్యాపరస్థులకి వుంటుంది. కాని, కొనే తాహతూ, ఓపిక జనానికి వుండదు. అందుకే, దేశదేశాల్లో పెద్ద పెద్ద బిజినెస్ ఔట్ లెట్స్ బిచానా ఎత్తేస్తుంటాయి. కాని, ఇండియాలో పరిస్థితి డిఫరెంట్. ఇక్కడ లాసొచ్చి దుకాణాలు మూసుకునే బిజినెస్ మెన్ చాలా మందే వున్నా కోట్లు కొల్లగొడుతున్న తెలివైన కార్పోరేట్స్ కూడా వున్నారు. అసలు మన దేశంలో అమ్మేవాడు అమ్మాలేగాని ఏదైనా కొనటానికి జనం రేడీ.విమానం టిక్కెట్లు కూడా ఓ మంచి ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించి మార్కెట్లోకి వదిలితే... మన వాళ్లు బస్సు టిక్కెట్లలా కొనేస్తారు! ఇక స్మార్ట్ ఫోన్ల లాంటివైతే పల్లికాయలు కొన్నంత విరివిగా పర్చేస్ చేసేస్తారు! షాపింగ్ పై మనోళ్ల వ్యామోహం అలాంటిది!
ఆహార పదార్థాలు ఏ ఆఫర్ ప్రకటించాల్సిన అవసరం లేకుండానే అమ్ముడుపోతాయి. సమస్యల్లా సుఖాలు, సౌఖ్యాలు, సరసాలకు సంబంధించిన లగ్జరీ, ఫ్యాన్సీ గూడ్స్ తోనే! అందుకే ఆయా వస్తువుల అమ్మకం దార్లు రోజుకో ప్రకటనతో తో ఆకట్టుకుంటుంటారు. నెలకో ప్రకటనతో  మైమరిపిస్తుంటారు! ఉదాహరణకి చీరల షోరూం వాళ్లనే తీసుకోండి... ఎవరో ఒక కొత్త హీరోయిన్ని తీసుకొచ్చి రిబ్బన్ కట్టింగ్ చేయించింది మొదలు కస్టమర్స్ జేబులకి బాగానే కటింగ్ పెడుతుంటారు. ఆషాఢం ఆఫర్ అంటారు. దాని వెంటనే శ్రావణం సేల్ అంటారు. ఇలా పన్నెండు నెలలూ నిజం చెప్పో, అబద్ధం చెప్పో అయినకాడికి అమ్మేస్తుంటారు! ఉట్టి చీరలే కాదు దేశం మొత్తంలో బోలెడు వస్తువులు ఈ రకంగానే కంపెనీలు అమ్మేస్తున్నాయి. సబ్బులు, షాంపులు, పర్ఫ్యూమ్ లు వంటి వాటి సంగతైతే సరే సరి! 
టీవీలు, పేపర్లు, ఇంటర్నెట్ లో వచ్చే వేలాది యాడ్స్ ని ఒక్కసారి మనసు పెట్టి చూడండి... కట్ డ్రాయర్లు మొదలు కాస్ట్ లీ కార్ల వరకూ అన్నీ దొరికేస్తున్నాయి. బంగారంతో సహా అన్నిట్నీ... మా ప్రాడక్ట్ బంగారం అంటూనే అమ్మేస్తున్నారు జనానికి. ఇక ఇప్పుడు మరో కొత్త మార్కెట్ కూడా కొనుగోలుదారులకి వెర్రిక్కిస్తోంది! అదే ఆన్ లైన్ షాపింగ్... 
కాస్త వయస్సు పెరిగిన వాళ్లు కాదుగాని... యూత్ అండ్ టీనేజర్స్ ఎవరి నోట విన్నా ఇప్పుడు ఫ్లిప్ కార్ట్, అమేజాన్ లాంటి పదాలే వినిపిస్తున్నాయి. ఇలాంటి వెబ్ సైట్స్ కూర్చున్న దగ్గర జనానికి వస్తువుల వర్షం కురిపిస్తున్నాయి. వేలాది ప్రాడక్ట్స్, పైగా ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు, ఇంటిలోకే, ఇంటర్నెట్ లోకే వచ్చేస్తాయి! ఇంకేం కావాలి? హాయిగా ఏసీలో  కూర్చుని కావాల్సిన ఐటెం ఫోటోలు, ధరలు అన్నీ చూసుకుని కొనుక్కోవచ్చు! అందుకే, భారతీయులు ఇప్పుడు ఆన్ లైన్ సాపింగ్ కు ఎగబడుతున్నారు... 
కొన్నాళ్ల కింది వరకూ ఆన్ లైన్ షాపింగ్ అంటే సరైన వస్తువు డెలివరీ అవుతుందో లేదో, రీప్లేస్మెంట్ సమస్యలు వుంటాయి కదా అని భయపడేవారు. కాని, రాను రాను ఆన్ లైన్ సేల్స్ సై నమ్మకం పెరుగుతోంది. అంతే కాదు, ట్రాఫిక్ లో వెళ్లడాలు, షోరూముల్లో గంటల తరబడి సమయం వృథా చేసుకోడాలు, రేట్ల విషయంలో బేరాలు ఆడటాలు... ఇలాంటివేవీ ఆన్ లైన్ షాపింగ్ లో వుండవు. అందుకే, రోజు రోజుకు మరింత ఎక్కువ మంది ఇంటర్నెట్ షాపింగ్ దిశగా వచ్చేస్తున్నారు. 
భారతీయులు సంవత్సరం మొత్తం చేసే షాపింగ్ ఒక ఎత్తైతే దసరా టైంలో సృష్టించే కొనుగోలు సునామీ మరో ఎత్తు! బట్టలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, బంగారం, వాహనాలు... ఇలా వేట్నీ వదిలిపెట్టరు. మరి ఇంత మంచి బంగారు బాతు లాంటి దసరా సీజన్ని ఆన్ లైన్ రీటైల్ కంపెనీలు ఎలా వదిలిపెడతాయి? రకరకాల పేర్లతో రంగంలోకి దిగాయి! బిగ్ బిలియన్ డేస్ అని ఒక సైట్ వాళ్లు హడావిడి చేస్తుంటే, గ్రేట్ ఇండియన్ సేల్ అంటూ మరో సంస్థ కలకలం సృష్టిస్తోంది! పైగా ఏదో వందల సంఖ్యలో , వేల సంఖ్యలో వస్తువులు అమ్ముకుని సంతృప్తుని పడటం లేదు. కంకణం కట్టుకుని మిలియన్ల కొద్దీ యూనిట్లు అమ్మేస్తున్నాయి ఈ ఆన్ లైన్ కంపెనీలు. ముఖ్యంగా, స్మార్ట్ ఫోన్స్, టీవీల వంటివి ఆకు కూరలు, ఆలుగడ్డల్లా అమ్మేస్తున్నాయి. ఏకంగా కొన్ని గంటల వ్యవధిలో వందల కోట్ల వ్యాపారం చేసేస్తున్నాయి!
ఈ మొత్తం ఇండియన్ ఆన్ లైన్ సేల్స్ అద్భుతం... నిజంగా ఒక ఆశ్చర్యమే! అయితే, ఇది ఒకవైపు మన భారతీయ మార్కెట్ కు వున్న అపారమైన దమ్మును చూపిస్తుంటే... మరో వైపు జనం అవసరం వున్నా లేకున్నా మార్కెట్ మాయలో పడి అవసరం లేని ఉత్పత్తుల్ని కూడా కొనేస్తున్న వైనాన్ని కళ్లకు కడుతుంది! మరీ ముఖ్యంగా, ఇప్పటి ఆల్ న్యూ జనరేషన్ కి ఆన్ లైన్ షాపింగ్... డ్రింకింగ్, స్మోకింగ్, పార్టీయింగ్ లా మరో పోష్ అడిక్షన్ అయిపోయింది!   
 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.