Publish Date:Aug 11, 2022
కుటుంబాలు పిల్లల విషయంలో చిత్రమైన ఆలోచనలతో ఉంటారు. కొడుక్కి కొడుకే పుట్టాలని, కూతురు ఇంటికి భారమని. ఇది పరమ పాతచింతకాయ పచ్చడి భావన. కానీ దురదృష్టవశాత్తూ చాలా ప్రాంతాల్లో ఇప్పటికే అదే ధోరణిలో తల్లిదండ్రులు ఉన్నారు. చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడితే పెళ్లి సమ యంలో అన్నీ అదే సర్దుకుపోతాయన్న భావనకు ఆధునిక తల్లిదండ్రులు పాత సిద్ధాంతాల్ని కొట్టి పారే స్తున్నారు. ఆడపిల్ల కావాలనుకునేవారు మగపిల్లలకు చిన్నపుడు పిలకలు వేయడం, బొట్టుపెట్టి వీలయి తే ఓ గౌనూ తొడిగి వారి సరదా తీర్చుకుంటారు. అదో ఆనందం. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల పుడితే నిక్కరూ, టీషర్లూ వేసి క్రాఫ్ కూడా అలా స్టయిల్‌గా చేసి ఆనందిస్తుంటారు.
ఎవరి ఆనందం వారిది. కానీ వాంకోవర్‌లో ఓ నాలుగేళ్ల పిల్లాడు తాను గర్ల్ కాదు బాయ్‌నే అని ప్రకటించి అందర్నీ ఆశ్యర్యపరిచాడు. ఈమధ్య వరకూ ఆడపిల్ల అనుకున్నవారంతా హఠాత్తుగా వీడు ఇలా అంటు న్నాడేవిటా అని ముక్కు వేలే సుకున్నారు. ఊరికే.. అందర్నీ ఆటపట్టించడానికి అలా అన్నాడని ఊరు కున్నారు. కానీ వాడి అమ్మమ్మ మాత్రం వాడు చెప్పేది అక్షర సత్యం అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యం లో ముంచెత్తింది.
ఇంతకీ చాలారోజులకు తన సంగతి బయటపెట్టిన పిల్లాడి పేరు చార్లీ లాయడ్. బ్రిటీష్ కొలంబియా, కెనడాలో పుట్టాడు. చార్లీ నిజానికి ఆడపిల్లగానే జన్మించాడు. కానీ క్రమేపీ మగపిల్లవాడి లక్షణాలే ప్రదర్శి స్తూ వచ్చాడని అతని తల్లి 27 ఏళ్ల అలైనా బోరెల్ అన్నది. ఈ మధ్యనే అందరితో కలిసి ఓ సమావేశంలో ధైర్యంగా లేచి గట్టిగా ప్రకటించాడు..యామ్ నాట్ గర్ల్..యామ్ బాయ్!.. అని. అందరూ గట్టిగా నవ్వుకున్నా రు, వాడిని కావలించుకుని ముద్దలు పెట్టారు. ఐస్‌క్రీమ్‌లు ఇచ్చాడు. కలర్ బాంబులు పేల్చారు.. అయినా వాడు మాత్రం కించిత్ కదల్లేదు. నిజాన్ని మీరు ఆలస్యంగానైనా తెలుసుకుంటారు. మీరు నన్ను ఆదరిస్తా రేననుకుంటాను.. అని పరుగున ఇంట్లోకి పారిపోయాడు.
చార్లీ అబ్బాయిగానే జీవితాంతం ఉండాలనుకున్నాడు. అధికారికంగా తనను అలానే గుర్తించాలని కోరాడ ని అతని తల్లి అన్నది. మరి పెద్దయితే?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/am-boynot-girl-25-141715.html
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.