తల్లిని చంపి ఇంట్లో పాతిపెట్టిన కూతురు

Publish Date:Mar 25, 2026

Advertisement

 

 

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న అంజు అనే మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపగా, చిన్న కూతురు ఇషిక తల్లి అంజుతో కలిసి ఉంటోంది. అయితే సంవత్సరం క్రితం అంజు అనుమానాస్పదంగా కనిపించకుండా పోయింది. తల్లి కనిపించకపోవడంతో పెద్ద కుమార్తె ఆందోళనకు గురై జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించినప్పటికీ అంజు ఆచూకీ లభించలేదు. దీంతో కేసు ముందుకు సాగకపోవడంతో నిర్లక్ష్యానికి గురైంది.

ఇక తాజాగా అంజు పేరుతో ఉన్న వాహనాన్ని అమ్మేందుకు చిన్న కూతురు ఇషిక, ఆమె ప్రియుడితో కలిసి ప్రయత్నించింది. వాహనం కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తికి వీరు ఇచ్చిన సమాధానాలు అనుమానాస్పదంగా ఉండటంతో అతనికి సందేహం కలిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. క్లూస్ టీంతో కలిసి అంజు ఇంటికి వెళ్లిన పోలీసులు తవ్వకాలు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే… అంజు తన చిన్న కూతురు ఇషికతో కలిసి నివాసం ఉండేది. అయితే ఇషిక ప్రవర్తనపై తల్లి తరచూ అభ్యంతరం వ్యక్తం చేసేది. ఈ కారణంగా తల్లి-కూతుర్ల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గత ఏడాది కూడా ఇషిక తన ప్రియుడిని ఇంటికి తీసుకురాగా, వారిద్దరి మధ్య సరదాగా గడుపుతున్న సమయంలో తల్లి అంజు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోపోద్రిక్తులైన ఇషిక మరియు ఆమె ప్రియుడు కలిసి అంజుపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

హత్య అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే గోతిలో పాతిపెట్టి, ఎవరూ గుర్తుపట్టకుండా పైగా టైల్స్ కూడా వేసి ఆధారాలు దాచిపెట్టినట్లు దర్యాప్తులో బయటపడింది.అప్పటి నుంచి తల్లి కనిపించడంలేదని వివిధ కథలు చెప్పుతూ చిన్న కూతురు పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు తెలిసింది. ఇటీవల వాహనం అమ్మే ప్రయత్నంలో బయటపడిన అనుమానాల నేపథ్యంలో కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇంట్లో తవ్వకాలు జరపగా మట్టిలో పాతిపెట్టిన మృతదేహం బయటపడింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ దర్యాప్తు అనంతరం బయటపడనున్నాయి.

By
en-us Political News

  
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ ఎంతగానో అభివృద్ధి చెందుతోంది.
ప్రపంచానికే తలమానికంగా నిలిచేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కన ఒక ట్రాన్స్‌జెండర్ కూర్చుని ముచ్చటిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాదు.. పార్టీ క్యాడర్ నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తొంది.
తాజాగా ఈడీ పిలుపు మేరకు విజయసాయి గురువారం మరో సారి విచారణకు హాజరయ్యారు.
తన జట్టు ఓడిపోవడంతో స్టాండ్స్‌లో కూర్చున్న సన్‌రైజర్స్ కో-ఓనర్ కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మైదానంలోనే ఆమె కన్నీటి పర్యంతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు. అయితే ఆ తరువాత కావ్యామారన్ ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తికి క్రీడాభిమానులు ఫిదా అయ్యారు.
Police conduct scene reconstruction in lawyer murder case, Lawyers murder, Waqf Board, Advocate Moinuddin, CM Revanth reddy, Telangana goverment, DGP C.V. Anand, CP Sajjanar
కెన్యా దేశంలో గుండెల్ని పిండేసే అత్యంత విషాదకరమైన ఘోర ప్రమాదం ఒకటి చోటుచేసుకుంది.
ఇక 2014 నుంచి పవన్ తో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎవ‌ర‌ని చేస్తే.. నాదెళ్లమనోహర్, లింగమనేని రమేష్, తాళ్లూరిరామ్.. వీరంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. చివరి ఇద్దరూ కూడా ప‌వ‌న్ కి, ఆయ‌న పార్టీ జ‌న‌సేన‌కు ఆర్థికంగా అండ‌గా నిల‌బ‌డిన వాళ్లే. పార్టీ ఆఫీస్ కూడా వీరిలో ఒక‌రిచ్చిన స్థలంలో కట్టిందే.
తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం చేశారు
రూఫ్ టాప్ సోలార్ ప్లాంటును ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా వివిధ బ్యాంకులు వినియోగదారులకు లోన్ మంజూరు చేస్తున్నాయి. అంతేకాకుండా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండడంతో వినియోగదారులపై భారం గణనీయంగా తగ్గుతోంది. గృహంపై 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ. 1.5 లక్షలు వ్యయం అవుతుండగా, అందులో రూ. 60,000లను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ
భువనేశ్వర్‌లో విమానం ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. అనంతరం అక్కడ కొంతసేపు నిలిపిన విమానాన్ని అర్ధరాత్రి తిరిగి శంషాబాద్‌కు తీసుకువ చ్చినట్లు సమాచారం. ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర అయోమయానికి గురయ్యారు.
లుత ఎన్ఆర్ఐ టిడిపి నేతలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు సమాజానికి ఎన్టీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలు, తెలుగు సంస్కృతికి ఆయన తెచ్చిన గుర్తింపును ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ టిడిపి సభ్యులు కొనియాడారు.
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారనీ, ఆయన ఆశయాలను ప్రస్తుత ముఖ్యమంత్రి, టీడీపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి పయనింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేష్ కూడా అవిశ్రాంతంగా పని చేస్తున్నారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.