గోటితో పోయే దానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నాడు.. అల్లు అర్జున్ పై పవన్ కల్యాణ్ విసుర్లు

Publish Date:Dec 30, 2024

Advertisement

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా జరుగుతున్న చర్చ ఏదైనా ఉందంటే అది పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు, మధ్యంతర బెయిలు, తెలంగాణ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల చర్చ అంశాలపైనే. కాగా ఈ అంశంపై తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఎలాంటి భేషజాలకూ పోకుండా ఈ సంఘటనపై ఆయన స్పందన చాలా ముక్కుసూటిగా ఉంది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటకు సంబంధించి ఆయన ఎవరినీ బాధ్యులను చేయలేదు. అదే సమయంలో ఎవరికీ మద్దతుగా మాట్లాడలేదు. కానీ స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఈ విషయంలో అల్లు అర్జున్ తీరును ఆయన తప్పుపట్టారు. సరిగా స్పందించడంలో విఫలమై అల్లు అర్జున్ గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మరణించడం, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం తెలిసిందే. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమైనదని పేర్కొన్న పవన్ కల్యాణ్.. సంఘటన జరిగిన తరువాత అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని తప్పుపట్టారు. అల్లు అర్జున్ లేదా ఆయన ప్రతినిథులు ఎవరో ఒకరు వెళ్లి బాధిత కుటుంబాన్ని ఓదార్చి ఉండాల్సిందన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన తీరును పవన్ కల్యాణ్ మెచ్చుకున్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు వంటివి పరిశ్రమను ప్రోత్సహించడానికి దోహదపడతాయేమో కానీ.. అలా ప్రోత్సహించడం కోసం శాతి భద్రతల విషయంలో రాజీ పడటం సరైనది కాదనీ, అందుకే రేవంత్ వ్యవహరించిన తీరు నిష్పాక్షికంగా ఉందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదన్నారు.  చట్టానికి ఎవరూ అతీతులు కారని రేవంత్ చాటారనీ, హీరోలైనంత మాత్రాన వారేం పైనుంచి దిగి రాలేదని   రేవంత్ నిరూపించారని చెప్పారు.  

చిరంజీవి కూడా అభిమానులతో కలిసి సినిమా ప్రదర్శనలు చూసేవారనీ, అయితే ఆయన చాలా సాదా సీదాగా, ఎవరి కంటా పడకుండా థియేటర్ కు వెళ్లేవారని వివరించిన పవన్ కల్యాణ్.. అల్లు అర్జున్ ఆర్భాటంగా సంధ్యా థియేటర్ కు రోడ్ షో చేస్తూ వెళ్లడమే తొక్కిసలాటకు కారణంగా కనిపిస్తోందన్నారు. సంఘటన జరిగిన తరువాత  అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు సమస్యను పెద్దది చేసిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. 

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఏపీలో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపుపై చంద్రబాబు సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ ఒక్క సారిగా జోరందుకుంది. అలాగే నిర్మాత దిల్ రాజు ఆహ్వానం మేరకు ఆయన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెడతారా అన్న చర్చ కూడా మొదలైంది. ఒక సమయంలో ఆయన బెనిఫిట్ షోలు, టికెట్ల ధర పెంపు వంటివి సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు దోహదపడతాయని, అలాగే శాంతి భద్రతల విషయంలో రాజీ కూడదని అనడంతో కొన్ని షరతులతో ఏపీ సర్కార్ సంక్రాంతి సినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్ల ధర పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని పరిశీలకులు అంటున్నారు. 

 

By
en-us Political News

  
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.