Hyderabad: 30వ అంతస్తు నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.!

Publish Date:Oct 12, 2026

Advertisement

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని 30వ అంతస్తు నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఉప్పల భరత్(29) బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత రెండు రోజుల క్రితమే భరత్ నానక్‌రామ్‌గూడలోని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో అద్దెకు దిగినట్లు తెలిసింది. సోమవారం భవనం 30వ అంతస్తు నుంచి దూకిన అతడు పార్కింగ్‌లో నిలిపి ఉంచిన హ్యుందాయ్ వ్యాగనార్ కార్లపై పడ్డాడు. 

పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు బయటకు వచ్చి చూడగా...భరత్ రక్తం మడుగులో పడి ఉన్నాడు . అది చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం స్థానికులు తీవ్ర గాయాలపాలైన అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని స్టార్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు.మృతుడి బంధువు ఉప్పల కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. భరత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అసలు భరత్  ఆత్మహత్య చేసుకోవడానికి గల  కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు మరణవార్త విన్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

 

 

[ Hyderabad News, Nanakramguda, Golf Edge Apartments, Software Employee Death, Uppala Bharat, Hyderabad Suicide Case, Gachibowli Police, Software Engineer Death, 30th Floor Incident, Suryapet District, Star Hospital Hyderabad, Osmania Hospital, Hyderabad Crime News ]

By
en-us Political News

  
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.