కేటీఆర్ ఫామ్‌హౌస్ కూల్చేస్తారు!

Publish Date:Aug 16, 2024

Advertisement

హైదరాబాద్‌ శివార్లలో వున్న జన్వాడలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ముచ్చటపడి కట్టుకున్న ఫామ్‌హౌస్‌ని కూల్చడానికి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నగరం పక్కనే వున్న జంట జలాశయాల పరిధిలోని 111 జీవో కిందకి వచ్చే భూమిలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పాతిక ఎకరాల భూమిని కష్టపడి సంపాదించుకున్నారు. ఆ భూమిలో కట్టడాలు నిర్మించడానికి వీల్లేదు. అయితే కేటీఆర్ మాత్రం ఎంచక్కా ఫామ్‌హౌస్ పేరుతో బిల్డింగ్స్ కట్టుకున్నారు. ఈ ఫామ్‌హౌస్‌ విజువల్స్‌ని డ్రోన్ ద్వారా తీయడానికి ప్రయత్నించారంటూ అప్పట్లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద కేసీఆర్ ప్రభుత్వం కేసులు కూడా పెట్టింది. చరిత్ర అలా వుంటే, వర్తమానంలో మాత్రం ఈ ఫామ్‌హౌస్‌ని కూల్చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తోంది. నెలలు... వారాలు కాదు.. కేవలం కొద్ది రోజుల్లోనే కేటీఆర్ ఫామ్‌హౌస్ నేలమట్టం అయ్యే అవకాశాలు వున్నట్టు తెలుస్తోంది. ఇదేదో కేటీఆర్ మీద రేవంత్‌రెడ్డి పగబట్టి చేస్తున్న చర్యగా భావించాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయే క్రమంలోనే కేటీఆర్ ఫామ్‌హౌస్ నేలమట్టం అవబోతున్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జలవనరులను ఆక్రమించి, పూడ్చేసి, జలవనరులకు ఇబ్బంది కలిగేలా నిర్మించిన పెద్దపెద్ద కట్టడాలను ‘హైడ్రా’ పేరుతో తెలంగాణ ప్రభుత్వం కూల్చేస్తోంది. రంగనాథ్ అనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌కి ‘హైడ్రా’ బాధ్యతలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పగించింది. ఆయన ముక్కసూటిగా వెళ్తూ ఇప్పటికే చాలా పెద్దపెద్ద అపార్ట్.మెంట్లని కూల్చేశారు. రాజకీయ నాయకులకు... అది కూడా అస్మదీయులైన రాజకీయ నాయకులకు సంబంధించిన కట్టడాలను కూడా ఎంతమాత్రం మొహమాటపడకుండా కూల్చేస్తున్నారు. పాతబస్తీలో ఒక కట్టడం కూల్చేస్తుంటే మజ్లిస్ ఎమ్మెల్యే వచ్చి అడ్డుపడినా కూల్చేశారు. అలాగే దానం నాగేందర్ ‘హస్తం’ వున్న కబ్జాని కూడా అడ్డుకున్నారు. ఇప్పటి వరకు హైడ్రా వందకు పైగా ఎకరాల భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యే, మిత్రపక్షం ఎమ్మెల్యేని కూడా లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న ‘హైడ్రా’ ఆధ్వర్యంలోనే  కేటీఆర్ ఫామ్‌హౌస్ త్వరలో కుప్పకూలబోతోందని సమాచారం.

By
en-us Political News

  
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.