అక్షర చిట్ ఫండ్ డైరెక్టర్ శ్రీవిద్య అరెస్టు
Publish Date:Feb 16, 2026
Advertisement
చిట్టీల పేరుతో రూ. కోట్ల మోసానికి పాల్పడిన అక్షర చిట్ ఫండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సంస్థ డైరెక్టర్ శ్రీవిద్యను బెంగళూరు అంతర్జాతీయ విమానా శ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారుల ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్షర చిట్ ఫండ్ ద్వారా భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు వరంగల్ జిల్లాలో అనేక ఫిర్యాదులు నమోదైన సంగతి తెలిసిందే. చిట్టీల పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు సేకరించి, తరువాత చెల్లింపులు చేయకుండా మోసాలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న శ్రీవిద్యపై వరంగల్ పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. విదేశాలకు వెళ్లిన ఆమె తిరిగి ఇండియాకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అమెరికా నుంచి బెంగళూరుకు చేరుకున్న వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు, అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆమె ను కస్టడీలోకి తీసుకు నేందుకు పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి విచారణలో బయటపడిన వివరాల ఆధారంగా సంస్థలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధుల వినియోగం, విదేశాలకు నిధుల మళ్లింపు వంటి అంశాలపై అధికా రులు దర్యాప్తు చేస్తున్నారు. సంస్థలో మరికొంత మంది కీలక వ్యక్తుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. అక్షర చిట్ ఫండ్ మోసానికి సంబంధించి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి బాధితులు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు అక్షర చిట్ ఫండ్ డైరెక్టర్ శ్రీవిద్య అరెస్టుతో మరిన్ని ఫిర్యాదులు నమోదు అయ్యే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. శ్రీవిద్య అరెస్ట్‌తో ఈ కేసు దర్యాప్తు వేగం పుంజుకునే అవకాశం ఉందదంటున్నారు.
http://www.teluguone.com/news/content/akshara-chit-fund-director-arrest-36-214172.html





