ఆసియా కప్ ..బాబర్, బ్రాడ్‌కాస్టర్లపైనా అక్రమ్ మండిపాటు
Publish Date:Aug 31, 2022
Advertisement
పాకిస్థాన్ లెవెన్‌తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు షానవాజ్ దహానీ జట్టులో ఉండాలనుకున్నానను...కానీ హసన్ అలీ ఆడుతున్నాడు, రౌఫ్ ఆడుతున్నాడు. నేను దహానీ ని తీసుకున్నారనుకున్నప్పటికీ, అతను జట్టులో లేడు. కుర్రాళ్లూ, ఇది ప్లేయింగ్ లెవెన్ అని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా? దహానీ ఆడుతున్నాడని యూసుఫ్ నాకు చెప్పాడు. కాబట్టి బ్యాటింగ్ కోచ్‌కు తెలియకపోతే ఎక్కడో తప్పు ఉందని అక్రమ్ అన్నాడు. టీవీ ప్రెజెంటర్ మయాంటి లాంగర్, కొన్ని నిమిషాల తర్వాత, అక్రమ్‌తో జట్టు లెవెన్‌లో లోపం గురించి చెప్పాడు, అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ అక్రమ్ ప్రసారకర్తలపై మరోసారి విరుచుకుపడ్డాడు. నన్ను సంతోషంగా ఉంచవద్దు, తప్పు జట్టును అక్కడ ఉంచే వ్యక్తిని సంతోషంగా ఉంచండి అబ్బాయిలు. ఇది పెద్ద ఆట, ఇది చిన్న తప్పు కాదు. ఇప్పుడు బాగానే ఉందన్నారాయన. దీనికి తోడు భారత్‌పై ఓటమికి కెప్టెన్ బాబరే కారణమని పాక్ ఫ్యాన్స్ ఇప్పటికే మండిపడుతున్నారు. ఇలాంటి టీ20 తరహా పిచ్ తనకు ఇష్టమని అక్రమ్ పేర్కొన్నాడు. రెండు వైపులా బౌలర్లు బౌన్సర్లు సంధించడం, వికెట్లు తీయడం చూసి ఆనందించా నన్నాడు. చివరి ఓవర్ వరకు గేమ్ కొనసాగడడం బాగుందన్న అక్రమ్.. 13 లేదంటే 14వ ఓవర్‌లో నవాజ్‌ను దించాల్సింద న్నాడు. అప్పటికే చాలా ఆలస్యమైందని అభిప్రాయపడ్డాడు. చివరి మూడు నాలుగు ఓవర్లలో మరీ ముఖ్యంగా రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటివారు క్రీజులో ఉన్నప్పుడు నవాజ్ చేతికి బంతిచ్చి బాబర్ తప్పుడు చేశాడని అక్రమ్ పేర్కొ న్నాడు.
ఆసియా కప్‌లో దుబాయ్ ఇంట ర్నేషనల్ స్టేడియంలో భారత్‌తో ప్రారంభమైన బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ లెజెండ్ వసీం అక్రమ్ ఆదివారం పాక్ జట్టుకు ప్లేయింగ్ ఎలెవన్‌ను వూహించినదానికి మరోలా చూపడం పట్ల ప్రసారకర్తలపై ఆగ్రహించాడు. నిజానికి పాకిస్తాన్ ప్రకటించిన ప్లేయింగ్ లెవెన్‌తో అక్రమ్ ఉప్పొంగిపోయాడు. అతను అంగీకరించి నట్లుగా, ఆట ప్రారంభానికి ముందు జట్టు బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసుఫ్ ద్వారా అతనికి తెలియజేశారు. అయితే, బ్రాడ్ కాస్టర్లు స్క్రీన్‌పై చూపించిన వాటిని అతను పరిశీలించి నప్పుడు, షానవాజ్ దహానీ స్థానంలో పాకిస్తాన్ హసన్ అలీని ఎంపిక చేయడంపై అతను మండిపడ్డాడు.
http://www.teluguone.com/news/content/akram-fury-on-broadcsters-and-baber-25-142977.html





