ఢిల్లీ స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు
Publish Date:Dec 20, 2025
Advertisement
దేశ రాజధాని నగరం కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ముఖ్యంగా చిన్న పిల్లలు కాలుష్యం కారణంగా అనారోగ్యం పాలౌతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులను కాలుష్యం బారి నుంచి కాపాడే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని మొత్తం స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న దాదాపు 38 వేల స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. వీటికి అయ్యే వ్యయం పర్యావరణ సెస్ నిధుల నుంచి ఉపయోగించనున్నట్లు తెలిపింది. తమ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉందని ప్రకటించిన ఢిల్లీ విద్యాశాఖ మంత్రి కాలుష్యం బారి నుంచి విద్యార్థులను కాపాడేందుకే స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే ఢిల్లీలో కాలుష్య సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన అవన్నీ త్వరలో ఫలితాన్నిస్తాయన్నారు.
http://www.teluguone.com/news/content/aip-purifiers-in-delhi-schoola-36-211313.html





