జంతువులతో మాట్లాడేస్తామా?.. వాటి భాషను డీకోడ్ చేస్తున్న ఏఐ

Publish Date:Jun 5, 2026

Advertisement

మనం పంచతంత్రం కథలలో జంతువులు మాట్లాడతాయని చదువుకున్నాం. నక్కబావ, కొంగ, కుందేలు, పులి, సింహం, ఏనుగు ఇలా జంతువులు మాట్లాడుకోవడం విన్నాం.. కాదు కాదు చదివాం. 
ఇప్పుడు ఆధునిక సాంకేతికత ఆనాటి ఊహాజనితమైన జంతువుల భాషను జనాలకు అర్థమయ్యేలా చేసే రోజులను తీసుకు వచ్చేస్తోంది. ఔను..   మనం రోజూ చూసే పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయో మనకు అర్థమైతే.. ఆ ఊహే గొప్పగా ఉంది కదూ? సముద్ర గర్భంలో ఉండే భారీ తిమింగలాలు ఒకదానితో ఒకటి ఏం చెప్పుకుంటున్నాయో తెలుసుకోవడం ఎంత బాగుంటుంది?   సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో  మనం చూసిన  ఇటువంటి వింతలు, విడ్డూరాలు త్వరలోనే   నిజ జీవితంలోనూ  సాకారం కాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత   సాయంతో జంతువులు,  పక్షుల భాషను పూర్తిగా డీకోడ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సాంకేతిక విప్లవం మూగజీవాల  నోటి నుంచి   శబ్దాలను మనుషులు సులభంగా అర్థం చేసుకునేలా మారుస్తోంది.

ఈ సరికొత్త ప్రయోగాల కోసం ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడుతున్న చాట్‌జీపీటీ వెనుక ఉన్న అత్యాధునిక సాంకేతికతనే శాస్త్రవేత్తలు  ఉపయోగిస్తున్నారు. మూగజీవాల నోటి నుంచి వచ్చే  శబ్దాల వెనుక దాగి ఉన్న అసలు సిసలైన అర్థాలను, వాటి వెనుక ఉన్న భావోద్వేగాలను కనిపెట్టడానికి   ఏఐ అల్గారిథమ్స్ దోహదపడుతున్నాయి. ఇటీవలి కాలంలో ఎలుకలు, డాల్ఫిన్లు, కోతులు, రంగులు మార్చే కటిల్‌ఫిష్, పక్షులు, తిమింగలాలు వంటి  జీవులపై జరిగిన పరిశోధనల్లో నమ్మలేని  నిజాలు,  ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. జంతువుల సమూహాల్లో ఒకదానికొకటి హెచ్చరించుకోవడానికి లేదా సమాచారం పంచుకోవడానికి చేసుకునే   శబ్దాలను లోతుగా విశ్లేషించడంలో ఏఐ సిస్టమ్స్ శాస్త్రవేత్తలకు సహకారం అందిస్తున్నాయి. 

ఈ పరిశోధనల్లో భాగంగా ఆఫ్రికన్ చారల ఎలుకలపై చేసిన ఒక  అధ్యయనంలో ఏకంగా 1.22 లక్షల కంటే ఎక్కువ రకాల శబ్దాలను ఏఐ సాంకేతికత ద్వారా శాస్త్రవేత్తలు  విశ్లేషించారు. అంత పెద్ద మొత్తంలో ఉన్న శబ్దాల డేటాను పరిశీలించిన ఏఐ..  వాటిలో వేర్వేరు సందర్భాల్లో ఎలుకలు చేసే విభిన్న రకాల పిలుపులను, వాటి ప్రత్యేక అర్థాలను   వేరు చేసి చూపింది. ఈ సంఖ్యలు, పరిశోధనల సరళిని బట్టి జంతు ప్రపంచంలో  కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందని  అర్థమవుతోంది.

అలాగే సముదరంలో నివశించే  తిమింగలాల భాషను అర్థం చేసుకోవడంపైనే ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ తిమింగలాలు ఒకదానితో ఒకటి సంభాషించుకోవడానికి చేసుకునే మిలియన్ల కొద్దీ శబ్దాలను మిషన్ లెర్నింగ్,  ఏఐ ద్వారా నిరంతరం పరిశీలిస్తున్నారు. ఈ తిమింగలాల శబ్దాలలో మనుషుల భాష తరహాలోనే ప్రత్యేకమైన పదాలు, ప్రాంతీయ మాండలికాలు, ఒకరినొకరు పిలుచుకునే పేర్లు  వంటి   నిర్మాణాత్మక నమూనాలు ఉన్నాయా అనే కోణంలో పరిశోధనలు సాగుతున్నాయి.  

జంతువుల భాషను కేవలం ఒకవైపు నుండి అర్థం చేసుకోవడమే కాకుండా, భవిష్యత్తులో వాటితో మనుషులు తిరిగి నేరుగా మాట్లాడేలా చేయడంపై కూడా శాస్త్రవేత్తలు ఇప్పుడు  దృష్టి పెట్టారు. ఇందుకోసం ఎర్త్ స్పిషీస్  వంటి అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన సంస్థలు జంతువుల శబ్దాల్లో దాగి ఉన్న రహస్య నమూనాలను విశ్లేషిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మనుషులకు, జంతువులకు మధ్య పూర్తిస్థాయిలో అర్థవంతమైన  సంభాషణలు సాధ్యమేనా అనే కీలకమైన అంశాన్ని  పరిశీలిస్తున్నాయి.  

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ , సీబీఎస్‌ఈ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ కుదుపునకు దారితీసింది. ఈ పరీక్షల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వేదికగా నిరసనకు పిలుపునిచ్చింది.
ఎలాన్ మాస్క్ స్పేస్‌ఎక్స్ (SpaceX) ఐపీఓ తర్వాత ఎస్‌అండ్పీ 500 (S&P 500) ఇండెక్స్‌లోకి ఎంట్రీ ఆలస్యం కానుంది. నిబంధనల సడలింపుకు నో చెప్పిన ఎస్‌అండ్పీ డౌ జోన్స్. స్పేస్‌ఎక్స్ నష్టాల లెక్కలు మరియు కఠిన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా గ్రీన్ కార్డ్ మరియు వీసా నిలిపివేతపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి యూఎస్ ఫెడరల్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 39 దేశాల వలసలపై విధించిన కఠిన ఆంక్షలను చట్టవిరుద్ధమని కొట్టివేస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతీయుల కోడింగ్ నైపుణ్యాలను మరియు ప్రధాని మోదీ నాయకత్వాన్ని అభినందించారు. భారత్-రష్యా సహోదర బంధంపై ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇక్కడ చదవండి.
ప్రపంచవ్యాప్తంగా మనం వాడుతున్న పబ్లిక్ జీపీఎస్ (GPS) వ్యవస్థను అమెరికా మిలిటరీ రహస్యంగా ఒక గ్లోబల్ నంబర్స్ స్టేషన్‌లా మార్చేసిందనే షాకింగ్ నిజం శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడింది. మన ఫోన్లలోకి వస్తున్న ఆ సీక్రెట్ కోడ్స్ కథేంటో ఇక్కడ చదవండి.
ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో బౌలర్లు ఊచకోత కోశారు. మొదటి రెండు రోజుల్లోనే ఏకంగా 33 వికెట్లు కూలడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. కివీస్ ముందు 254 పరుగుల టార్గెట్ ఉండగా.. ఇప్పటికే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తెలంగాణలో ప్రతిరోజూ రూ. 5 కోట్లు దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు! హైదరాబాద్ పోలీసులు ఛేదించిన ₹150 కోట్ల స్కామ్, మరియు మీ బ్యాంక్ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి హెల్ప్‌లైన్ 1930 ఎలా ఉపయోగపడుతుందో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లో ఘోరం జరిగింది. ఇంటి ముందు క్రికెట్ ఆడవద్దని చెప్పిన 42 ఏళ్ల ముద్దునూరు మంజుల అనే మహిళపై, ఆమె కుమారుడిపై కొందరు యువకులు ఇల్లు చొరబడి దాడికి తెగబడ్డారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు నమ్మ మెట్రో బ్లూ లైన్ ఎయిర్‌పోర్ట్ కారిడార్ కోసం మొదటి సరికొత్త రైలు సెట్ వచ్చేసింది. సిల్క్ బోర్డ్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు ట్రాఫిక్ కష్టాలు తీర్చే ఈ మెట్రో లైన్ ట్రయల్ రన్స్, రూట్ వివరాలు, రియల్ ఎస్టేట్ మార్పుల పూర్తి వివరాలు మీకోసం.
బిట్‌కాయిన్ విలువ భారీగా పడిపోయింది. 2024 ట్రంప్ విజయం తర్వాత తొలిసారిగా $60,000 మార్కు కిందకు చేరింది. క్రిప్టో పతనానికి గల ముఖ్య కారణాలు మరియు ఎథేరియం, సోలానా వంటి కాయిన్ల తాజా పరిస్థితి ఇక్కడ చదవండి.
భారత స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, నిఫ్టీ 50 ప్రస్తుత స్థాయిల నుండి డబుల్ డిజిట్ (రెండంకెల) లాభాలను ఎలా సాధించగలదో ఒమ్నిసియెన్స్ క్యాపిటల్ నిపుణులు అశ్విని షామీ వివరించారు. ముడి చమురు ధరల తగ్గింపు మరియు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన టాప్ 5 రంగాల గురించిన పూర్తి విశ్లేషణ మీకోసం.
పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపనుందన్న ఐఎండీ చేసింది. 2026 సంవత్సరానికి సంబంధించిన రుతుపవనాల అంచనాలను సవరించింది. ఈ ఏడాది దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 90 శాతం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
భారత స్టాక్ మార్కెట్లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు వరుసగా లోయర్ సర్క్యూట్ తాకుతున్నాయి. ₹15.15 లక్షల కోట్ల ఆదాయాన్ని తప్పుగా చూపించారంటూ సెబి (SEBI) మోపిన సంచలన ఆరోపణలు, నిధుల మళ్లింపు వివాదం మరియు జెన్సాల్ ఇంజనీరింగ్ తో పోలికల వెనుక ఉన్న అసలు కారణాలను ఈ వెబ్ స్టోరీలో పూర్తిగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.