అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్...మృత్యుంజయుడు ఆవేదన

Publish Date:Jun 12, 2026

Advertisement

 

ప్రమాద దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది రామ్మోహన్‌ నాయుడు..

దేశాన్ని కుదిపేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ ఘోర దుర్ఘటనలో మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోగా.. కేవలం ఒకే ఒక్కడు మృత్యువును జయించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ఒంటరి సర్వైవర్ విశ్వాస్ కుమార్ రమేశ్ ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తాజాగా భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తాను శారీరకంగా బతికి ఉన్నప్పటికీ, అంతర్గతంగా ప్రతిరోజూ నరకం చూస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బ్రిటన్‌లో స్థిరపడిన విశ్వాస్ కుమార్ గతేడాది గుజరాత్‌లోని తన కుటుంబ సభ్యులను కలిసి తిరిగి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆ దురదృష్టకర రోజున ఆయన విమానంలో ‘11-A’ నంబర్ సీటులో కూర్చున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం అదుపుతప్పి కూలిపోవడంతో, విశ్వాస్ కూర్చున్న సీటు విరిగి కిందపడిపోయింది. దీనివల్ల ఆయనకు మంటలు అంటుకోకుండా ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో ఆయన తన సొంత సోదరుడు అజయ్‌ను కోల్పోవడం గమనార్హం.

రక్తపు మరకలతోనే నడుచుకుంటూ వచ్చి విశ్వాస్ అంబులెన్స్ ఎక్కిన దృశ్యాలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఏడాది గడిచినా ఆ భయానక రాత్రి తనను వెంటాడుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. తాను ఇప్పటికీ తీవ్ర నిద్రలేమి, ఆందోళనతో పోరాడుతున్నానని జాతీయ మీడియాతో చెప్పారు. కేవలం తాను ప్రాణాలతో బయటపడటమే అందరికీ కనిపిస్తోందని, కానీ నాలుగు గోడల మధ్య తన మనసు పడుతున్న క్షోభ ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.

బాధిత కుటుంబాల తరఫున విశ్వాస్ కుమార్ అధికారులను ఒకే ప్రశ్న అడుగుతున్నారు. జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, కానీ ఈ ప్రమాదానికి అసలు కారణాలేంటో బాధితులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. బాధిత కుటుంబాల మనసుల్లో ఉన్న ఎన్నో సందేహాలకు ప్రభుత్వం నుంచి నిజాయతీతో కూడిన సమాధానాలు రావాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన తుది దర్యాప్తు నివేదిక రావడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ ప్రమాద తీవ్రతపై ఎయిరిండియా మాతృ సంస్థ టాటా గ్రూప్ కూడా కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు 96 శాతం బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం అందించామని పేర్కొంది. అలాగే 91 శాతం కుటుంబాలకు కోటి రూపాయల పూర్తి నష్టపరిహారాన్ని చెల్లించినట్లు స్పష్టం చేసింది. అయితే తమ ఆత్మీయులను కోల్పోయిన బాధలో ఉన్న 15 కుటుంబాలు.. మృతుల వ్యక్తిగత వస్తువులను తిరిగి తీసుకోవడానికి నిరాకరించడం అందరినీ కలచివేస్తోంది.

మరోవైపు, విమానం హాస్టల్ భవనంపై కూలడంతో మరణాల సంఖ్య 260కి చేరిన సంగతి తెలిసిందే. ఆ ధ్వంసమైన హాస్టల్ ప్రాంగణాన్ని ఒక ఉపయోగకరమైన కేంద్రంగా మార్చాలని గుజరాత్ సర్కార్ నిర్ణయించింది. అక్కడ రూ.547 కోట్ల భారీ వ్యయంతో అత్యాధునిక మెడికల్ హబ్‌ను నిర్మించనున్నట్లు రాష్ట్ర మంత్రి ప్రఫుల్ పన్సేరియా వెల్లడించారు. వైద్య విద్యార్థులకు మెరుగైన వసతులు, అవకాశాలు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. 

మరోవైపు ప్రమాదం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి  రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. బాధిత కుటుంబాలకు మరోసారి సానుభూతి ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా నైపుణ్యంతో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా మరియు నిష్పక్షపాతంగా నిర్ధారించడానికి, అలాగే విమానయాన భద్రతను మరింత మెరుగుపరచడానికి మేము కట్టుబడి ఉన్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

By
en-us Political News

  
యోగా గురు  బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం  జరిగిన ఈ  కార్యక్రమంలో వేలాది మంది   పాల్గొని రికార్డు సృష్టించారు.
ఈ నెల 26వ తేదీ వరకు మధ్యం తర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు బండి భగీరథ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌ పై విడుదలయ్యారు.
. ఆ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల కోసం అందుబాటులో ఉన్న వసతులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పోషకాహార సేవలపై ఆరా తీశారు. కేంద్రంలోని నిల్వల రిజిస్టర్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది సరికొత్త ఇండక్షన్ స్టవ్‌పై తయారు చేసిన రాగి జావను సీఎంకు అందించగా.. ఆయన చిన్నారుల పక్కనే కూర్చుని దానిని సేవించారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా అంగన్‌వాడీ ఆవరణలో ఒక మొక్కను నాటారు.
2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడానికే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం హార్దిక్ బౌలింగ్ చేసేందుకు పూర్తిగా ఫిట్‌గా లేడని సమాచారం. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా హార్దిక్ ఆడటం లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పల్నాడు జిల్లా పర్యటనలో ఒక సామాన్య గృహస్థుడిగా మారిపోయారు. స్థానిక రైతు క్షేత్రంలో ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనెను కొనుగోలు చేసే క్రమంలో ఆయన తన సతీమణి భువనేశ్వరికి ఫోన్ చేశారు. చేసి వేరుశనగ నూనె కొనమంటావా అని అడిగారు.
సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగర్ సుల్తానా 36 పరుగులు, శోభన మోస్తరీ22 పరుగులతో రాణించారు. ఇక చివరి ఓవర్లలో షోర్నా అక్తర్ కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్ల సాయంతో అజేయంగా 39 పరుగులు సాధించడంతో బంగ్లా జట్టు ఆ మాత్రం స్కోరైనా చేరగలిగింది. పాకిస్థాన్ బౌలర్లలో ఫాతిమా సనా రెండు వికెట్లు పడగొట్టింది.
ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అంపైర్ ఇచ్చిన పెనాల్టీ రన్స్ తో కలిసి టీమ్ ఇండియా తొలి ఓవర్ లో ఏకంగా 23 పరుగులు సాధించింది. దీంతో 2004లో బంగ్లాదేశ్‌పై తొలి ఓవర్లోనే 22 పరుగులు సాధించి నెలకొల్పిన పాత రికార్డు కనుమరుగైపోయింది.
ఇందులో సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు ఆధునిక ప్రపంచానికి అవసరమైన ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలపై కాలేజీలోనే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత డిగ్రీ చివరి సంవత్సరం అంటే మూడో ఏడాదిలో విద్యార్థులు నేరుగా క్షేత్రస్థాయి పరిశ్రమలతో అనుసంధానమైన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లోకి అడుగుపెడతారు.
అయితే బస్సును సీజ్ చేసిన తర్వాత ప్రయాణికుల గమ్యస్థానానికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులతో సహా ప్రయాణికులందరూ రాత్రంతా సీజ్ చేసిన బస్సులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నగరంలోని వీఆర్సీ సెంటర్ సమీపంలో, అలాగే రూరల్ పరిధిలో ఆమె ఒక పక్కా ప్లాన్ ప్రకారం నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని తన దందా సాగించింది.
బడ్జెట్ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ మరియు టాటా టియాగో ఈవీ కార్ల ధర, మైలేజ్ రేంజ్, బ్యాటరీ సామర్థ్యం మరియు సేఫ్టీ ఫీచర్ల పూర్తి వివరాలు మీకోసం.
ముంబై నగర తాగునీటి జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకరంగా 9 శాతానికి పడిపోయాయి. అప్పర్ వైతర్ణ డ్యామ్ పూర్తిగా ఎండిపోగా, ఐఎండీ జూన్ 22 నుండి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద నిధుల నిరోధక గ్లోబల్ సంస్థ FATF వైస్ ప్రెసిడెంట్‌గా భారత ఐఏఎస్ అధికారి వివేక్ అగర్వాల్ చారిత్రాత్మక నియామకం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.