ద్వారకా తిరుమలలోనూ ప్రసాదాల కల్తీ

Publish Date:Feb 12, 2026

Advertisement

 

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయంలో ప్రసాదాల తయారీలో కల్తీ జరిగిందని సిట్ నివేదిక వెల్లడించడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. స్వామివారికి ఎంతో పవిత్రంగా భావించి సమర్పించే ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడినట్లు తేలడంపై భక్తుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ద్వారకా తిరుమల ఆలయ వ్యవహారాలపై దర్యాప్తు జరిపిన సిట్, తమ నివేదికలో దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. 

2022 నుంచి 2024 మధ్య కాలంలో ఆలయానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ కాలంలో ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యిని తిరుపతికి చెందిన వినాయక ఏజెన్సీ సరఫరా చేసినట్లు సిట్ గుర్తించింది. చిన్న వెంకన్న ఆలయంలో లడ్డూ, చక్కెర పొంగలి, స్వామివారి ఇతర కైంకర్యాలకు నెలకు సుమారు 15 వేల కేజీల నెయ్యి వినియోగిస్తారు. స్వామివారి ప్రసాదంలో కల్తీ జరగడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారి ప్రసాదాన్ని పవిత్రంగా భావించి స్వీకరిస్తామని భక్తులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ కల్తీ నెయ్యిని ఎలా గుర్తించలేకపోయారని, అధికారుల పర్యవేక్షణ లోపం దీనికి కారణమని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

By
en-us Political News

  
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్‌గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.