ప్రతి కాల్ వెనుక ఒక ప్రాణం... ప్రతి స్పందన వెనుక 108

Publish Date:Jun 7, 2026

Advertisement

 

గోల్డెన్ అవర్‌లో గోల్డెన్ సర్వీస్.. 

108 అంబులెన్స్ ల రూపు రేఖలు మార్చేసిన కూటమి ప్రభుత్వం.. 

ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి. ప్రతి నిమిషం ప్రాణ రక్షణే లక్ష్యంగా అత్యవసర సేవలు అందిస్తున్నాయి. భవ్య హెల్త్ కేర్ ఆధ్వర్యంలో అంబులెన్స్ లకు టెక్నాలజీ జోడించి బాధితులను గోల్డెన్ అవర్ లో ఆస్పత్రులకు చేర్చాయి. 2025 జూన్ నుంచి 2026 మే వరకు ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,78,799 అత్యవసర కేసులకు స్పందించి వేలాది కుటుంబాల్లో ఆశాజ్యోతిని వెలిగించాయి.

ప్రాణాపాయ స్థితిలో దేవుడిలా 108 సాయం

ఈ ఏడాది కాలంలో 1,13,764 మంది రోడ్డు ప్రమాద బాధితులకు 108 సిబ్బంది గోల్డెన్ అవర్‌లో అత్యవసర వైద్య సహాయం అందించారు. అలాగే 1,05,786 మంది గర్భిణీలను సురక్షితంగా ఆసుపత్రులకు తరలించి తల్లి-శిశు ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. 97,118 శ్వాసకోశ సమస్యల కేసుల్లో తక్షణ వైద్య సహాయం అందించి ప్రాణాలను కాపాడారు. 

అదేవిధంగా 49,342 వాహనేతర గాయాల కేసులు, 45,951 గుండెజబ్బుల కేసులు, 40,553 స్పృహ తప్పిన కేసులు, 34,532 కడుపునొప్పి కేసులు, 32,858 విషప్రయోగ కేసులు, 29,485 ఫిట్స్ కేసులు, 27,455 తీవ్ర జ్వరం కేసులు, 20,278 పక్షవాతం కేసులు, 15,441 దాడుల కేసులు, 14,088 జంతువుల కాటు కేసులు, 14,007 నవజాత శిశువుల అత్యవసర కేసులతో పాటు మరో 1,38,141 ఇతర అత్యవసర కేసుల్లోనూ 108 సిబ్బంది అంకితభావంతో సేవలందించి తమ చిత్తశుద్ధిని చాటుకున్నాయి. ఈ మొత్తం సేవల్లో 2,53,022 కేసులు ఒక ఆసుపత్రి నుండి మరొక ఆసుపత్రికి తరలించిన అంతర్గత బదిలీలు (IFT) కాగా, 5,25,777 కేసులు నేరుగా ప్రమాద స్థలాలు మరియు అత్యవసర ప్రాంతాల నుండి ఆసుపత్రులకు తరలించిన నాన్-IFT కేసులుగా నమోదయ్యాయి.

గుండె పోటు వంటి ఎమర్జెన్సీ కేసుల్లో ప్రాణాధారంగా 108

ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రతి నిమిషం కీలకంగా మారే గుండెజబ్బుల అత్యవసర కేసుల్లో 108 అంబులెన్స్ 108 సిబ్బంది దేవుడిలా మారి, సకాలంలో  సర్వీస్ అందిస్తూ ఎందరికో పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. ఏడాదిలో 45,951 గుండెజబ్బుల కేసులకు స్పందించి సకాలంలో వైద్య సహాయం అందించారు. దీంతో పాటు ఛాతినొప్పి, శ్వాసకోశ ఇబ్బందులు వంటి అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది వేగంగా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి సమీప ఆసుపత్రులకు తరలించారు. 

అత్యాధునిక వైద్య పరికరాలు, శిక్షణ పొందిన EMTలు మరియు సమర్థవంతమైన అంబులెన్స్ నిర్వహణతో వేలాది ప్రాణాలను కాపాడడంలో 108 సేవలు కీలక పాత్ర పోషించాయి. ఆపద సమయంలో రోగికి వైద్య సహాయం అందే వరకు EMTలు అందించే సేవలు ప్రాణరక్షణలో కీలకంగా మారుతున్నాయి. వారి సమయస్ఫూర్తి, నైపుణ్యం, సేవాభావం వల్ల వేలాది మంది ప్రాణాలు నిలబడుతున్నాయి. 

ఎమర్జెన్సీ రోగుల పాలిట సంజీవనిగా సేవలు

ఈ సందర్భంగా భవ్య హెల్త్ కేర్ మీడియా కోఆర్డినేటర్ మాట్లాడుతూ...ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సరైన సమయంలో అత్యవసర వైద్య సహాయం అందించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆధునిక సాంకేతికత, నిరంతర నిఘా వ్యవస్థలు మరియు నైపుణ్యం కలిగిన సిబ్బందితో 108 సేవలను మరింత బలోపేతం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరింత సమర్థవంతమైన సేవలు అందించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామన తెలిపారు.

108 సేవల పనితీరుపై సర్వత్రా హర్షం

ప్రమాదాలు, గుండెపోటు, ప్రసవాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో సమయానికి చేరుకుని వైద్య సహాయం అందించడం ద్వారా 108 సేవలు ప్రజారోగ్యానికి భరోసా కల్పిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందిస్తూ ప్రాణాలను కాపాడుతున్న 108 అంబులెన్స్ సేవలపై బాధితులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు 24 గంటలూ అందుబాటులో ఉండే 108 సేవలు అనేక కుటుంబాలకు ఆపద్బాంధవంగా నిలుస్తున్నాయని ప్రజలు అభినందిస్తున్నారు. అత్యవసర సమయంలో ఒక్క ఫోన్ కాల్‌తో స్పందించి బాధితులను సురక్షితంగా ఆసుపత్రులకు తరలిస్తున్న సిబ్బంది సేవాభావాన్ని కొనియాడుతున్నారు.


 

By
en-us Political News

  
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్‌లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.