కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసినట్టు...జగన్ అరెస్టు ఎందుకు సాధ్యం కాదు?
Publish Date:Jan 30, 2026
Advertisement
టీటీడీ లడ్డూలో జంతు కొవ్వు లేదని సంకలు గుద్దుకుంటున్న వైసీపీ ఎంతకు తెగించిందంటే.. ఏకంగా నిందా నివారణ యాగాలు చేసే వరకూ వచ్చింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో జంతు కొవ్వు లేదని సంకలు గుద్దుకుంటున్న వైసీపీ ఎంతకు తెగించిందంటే.. ఏకంగా నిందా నివారణ యాగాలు చేసే వరకూ వచ్చింది. ఇప్పటి వరకూ చరిత్రలో ఇలాంటి యాగాలు ఎవరూ చేసి ఉండరు. అయితే వైదీకంలో ప్రాయశ్చిత్త పూజలు కానీ చేసి ఉంటారేమోగానీ.. ఇలా యజ్ఞ యాగాలు చేయడం అన్నది ఇంత వరకూ లేదు. బహుశా చరిత్రలో ఇదే మొదటి సారేమో తెలీదు. ఇందు మూలంగా భూమన చెబుతున్న మాట ఏంటంటే.. జగన్ ని రాజకీయ సమాధి చేయడం కోసం చంద్రబాబు, పవన్ కలసి ఒక నాటకం ఆడి.. ఆ రోజుల్లో శ్రీవారి ప్రసాదంలో పంది కొవ్వు, చేప కొవ్వు కలిపారన్న దుష్ప్రచారం చేశారనీ.. అదిప్పుడు తప్పని తేలిందని అంటారు భూమన. అయితే సీబీఐ సుప్రీం కోర్టుకు ఇచ్చిన నివేదికలో జంతుకొవ్వు ఆనవాళ్లున్నట్టు రాయలేదనీ. దీంతో తమపై పడ్డ ఈ నిందను తుడిపేసుకోవడం కోసం ఈ యాగం నిర్వహించినట్టు చెప్పారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన. ఇదంతా ఇలా ఉంటే ఇక్కడ జంతు కొవ్వు అంశం విషయంలో కూటమి సెల్ఫ్ గోల్ వేసుకుందా? అన్న కామెంట్ ఒకటి బలంగానే వినిపిస్తోంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఆనాటి ఈవో శ్యామలరావు, సీఎం చంద్రబాబును తప్పుదోవ పట్టించలేదు కదా? అన్న మాట కూడా ప్రచారంలో ఉంది. ఇక ఇదే అంశంలో వెలుగులోకి రావల్సిన అసలు విషయమేంటంటే.. జంతుకొవ్వు అన్నదిక్కడ పాయింట్ కాదు. తెలిసో తెలీకో అది హైలెట్ అయ్యింది కానీ ఇక్కడ శ్రీవారికి నివేదించిన లడ్డూల్లో అసలు నెయ్యి లేక పోవడం. ఈ విషయం పక్కదారి పట్టి జంతు కొవ్వు మీదే ఎక్కువ ఫోకస్ అవుతోంది. ఇదిలా ఉంటే.. సిట్ సిట్ పునః విచారణ ప్రారంభించనుంది. అనుబంధ సప్లిమెంట్ ద్వారా.. మరికొందరిని విచారించనుంది. ఇక వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్ అకౌంట్ నుంచి నగదు బదిలీ జరిగితే అంతిమ లబ్దిదారులు ఎవరు? అన్న విషయంలో ఒక క్లారిటీ వచ్చేలా సిట్ తమ విచారణ ముందుకు కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఇల్లు అలకగానే పండగ చేసుకోవద్దని అంటోంది కూటమి. ఇక ఇదే అంశంపై వైవీ సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్తామని అంటుంటే, రోజా అయితే కూటమి పాలకులను నేపాల్‌లో తరిమి కొట్టినట్టు కాట్టాలని పిలుపునిస్తోంది. ఇందులో మరో ముఖ్యమైన విషయమేంటంటే.. కల్తీ నెయ్యి విషయం సదరు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి చెప్పినా.. ఆయన అదే కొనసాగించమని చెప్పడంతో తాము కొనసాగించామని అంటారు అధికారులు. దీంతో పీఏ చిన్నప్పన్ పై మరింత అనుమానం వస్తోంది. మరో కీలకమైన అంశం ఏంటంటే ఢిల్లీ మద్యం పాలసీ మార్పు వ్యవహారంలో నాటి సీఎం కేజ్రీ వాల్ ని అరెస్టు చేసినపుడు.. ఆ సూత్రం ఇక్కడెందుకు వర్తించదు? అన్నది కూడా మేజర్ ఎలిమెంట్ గా మారింది. ఈ విషయంలో చొరవ చూపించాల్సిన కేంద్రం జగన్ అనగానే ఎందుకలా వెనకడుగు వేస్తుంది? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అక్కడ కల్తీ జరిగిందన్న మాట పక్కన పెట్టి కొవ్వు కలవలేదన్న అంశమే ఎక్కువగా హైలెట్ కావడంలోనూ కూటమి ప్రభుత్వం తప్పు సరిదిద్దుకోవల్సిన అవసరం ఉందని అంటున్నారు. కూటమి నాయకులు.. మహాపాపం నిజం పేరిట కొన్ని క్యాంపెయిన్లు నడుపుతున్నా.. అది జగన్ పార్టీ, ఆయన సోషల్ మీడియా ముందు వెలవెలబోతున్నట్టుగానూ భావిస్తున్నారు. తొలి నాటి నుంచీ కల్తీ అన్నది హైలెట్ చేయకుండా.. జంతుకొవ్వు అనే పదాన్ని బాగా ఫోకస్ చేయడంతోనే అసలు చేటు తెచ్చినట్టుగా భావిస్తున్నారు.ఇదిలా ఉంటే పరకామణి కేసు వాయిదా ఫిబ్రవరి ఐదవ తేదీకి వేశారు. దీంతో అప్పటివరకూ వైసీపీ ఈ అంశాన్నే బాగా హైలెట్ చేసి నలుపుతారు. ప్రస్తుతం దీన్ని పెద్ద ఎత్తున తిప్పి కొట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోందని కొత్త ఆయుధాలు సిద్ధం చేయాలని సూచిస్తున్నారు కొందరు కూటమి మద్ధతుదారులు.
ఏది ఏమైనా నెయ్యి వందకు వంద శాతం అయితే కల్తీ అయ్యిందనీ.. 36 మంది నిందితులతో 600 పేజీల అనుబంధ చార్జ్ షీట్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కిలోకి రూ.600 రూపాయలు పలికే నెయ్యి రివర్స్ టెండరింగ్ విధానంలో రూ.319కే ఎలా వచ్చింది? లో కెపాసిటీ గల వ్యక్తులకు కాంట్రాక్టు ఎందుకిచ్చారో చూస్తే.. అందుకు భూమన ఇచ్చే సమాధానం.. మరోకటిగా ఉంది. స్టార్టప్ లకు కూడా కేంద్రం ప్రోత్సాహం అందివ్వడమే ఇందుకు కారణమని అంటున్నారాయన. అందుకే తాము వారికి కాంట్రాక్టు కట్టబెట్టినట్టు చెబుతున్నారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన.
http://www.teluguone.com/news/content/adulterated-ghee-in-tirumala-36-213260.html





