సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు.. సుప్రీం ఆదేశం
Publish Date:May 20, 2022
Advertisement
సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డుల ఇవ్వాలని, అదే సమయంలో వారి గుర్తింపును గోప్యంగా ఉంచాలని సుప్రీంకోర్టు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. కరోనా సమయంలో కరోనా సమయంలో సెక్స్ వర్కర్లు ఎదుర్కొన్న సమస్యలపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం యూఐడీఏఐ జారీ చేసే ప్రొఫార్మా సర్టిఫికేట్ ఆధారంగా.. సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు ఇవ్వాలని ఆదేశించింది. అదే సమయంలో వారి గోప్యతను కాపాడాలని జస్టిస్ లావు నాగేశ్వర రావు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్ల జాబితాను రూపొందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. అలాగే సెక్స్ వర్కర్లకు రేషన్ అందించాలని చెప్పింది. కమ్యునిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ గుర్తించిన సెక్స్ వర్కర్లకు ఓటర్ ఐడీలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది
http://www.teluguone.com/news/content/adhaar-cadrs-to-sex-workers-supreme-court-25-136213.html





