తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు  అన్నామలై రాజీనామాను పార్టీ హైకమాండ్ ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ను అన్నామలై తన రాజీనామా లేఖ అందజేశారు. అంతకు ముందు విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అన్నామలై తెలియజేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తును అన్నామలై వ్యతిరేకించారు. దీంతో ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి. ఆయనను పార్టీలోనే కొనసాగేలా బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో బీజేపీ హై కమాండ్ అన్నామలై రాజీనామాను శుక్రవారం (జూన్ 5) ఆమోదించింది.   అన్నామలై తమిళ్‌ ఫస్ట్ అనే నినాదంతో ఓ సరికొత్త ప్రాంతీయ పార్టీని పెట్టబోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబున్నాయి.  
 కర్నాటక సీఎంగా  డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసి మంత్రిమండలి ఏర్పడిన స్వల్ప వ్యవధిలోనే ఆయన కేబినెట్ లో అసంతృప్తి రాజుకుంది.  ఆశించిన మంత్రిత్వ శాఖ దక్కలేదన్న అసంతృప్తితో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి  శాఖ తనకు  కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది.   మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.  బెంగళూరు అభివృద్ధి శాఖను తనకు అప్పగిస్తానని డీకే శివకుమార్ గతంలో ఇంటికి వచ్చి మరీ  హామీ ఇచ్చారనీ,  ప్రమాణ స్వీకారానికి ముందు రోజు కూడా ఆయన అదే మాట చెప్పారనీ రామలింగారెడ్డి అన్నారు.  ఇప్పుడు మాట తప్పారనీ చెప్పిన  అందుకే మంత్రి పదవిని వదులుకుంటున్నట్లు ప్రకటించారు.  తాను కేవలం మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు.  
కేంద్రంలో అధికారమే లక్ష్యంగా, దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే..  2023లో ఇండియా'కూటమిగా ఏర్పడ్డాయి.  అయితే ఆ లక్ష్యం దిశగా ఈ కూటమి అడుగులు మాత్రం తడబడుతున్నాయి.   2029 లోక్‌సభ ఎన్నికలకు మూడేళ్ల ముందే ఈ కూటమి మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది.  పరస్పర విశ్వాసంతో ముందుకు సాగాల్సిన ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఎవరికి వారే యమునా తీరే చందంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ తో ఇండియా కూటమిలోని మెజారిటీ పక్షాలు విభేదిస్తున్నాయి. ఒక్కటొక్కటిగా తిరుగు బావుటా ఎగురవేస్తున్నాయి.  దేశ రాజధాని ఢిల్లీలో ఈ నె 8న జరగనున్న  17 పార్టీల ఇండియా కూటమి సమావేశాన్ని తాము పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు తాజాగా   డీఎంకే  ప్రకటించింది.  దశాబ్దాలుగా తమకు నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, తమిళనాడు రాజకీయాల్లో తమకు తీరని ద్రోహం చేసిందని డీఎంకే  పేర్కొంది.  ఈ   సంక్షోభానికి అసలు కారణం ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే. ఈ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ మారుతున్న రాజకీయ సమీకరణాల నడుమ, దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న డీఎంకేను కాంగ్రెస్ పార్టీ   పక్కన పెట్టేసి.. తమిళనాడులో  ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రముఖ  నటుడు విజయ్ స్థాపించిన  తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో కాంగ్రెస్ చేతులు కలపడం డీఎంకేకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే నేత  ఇలంగోవన్ బహిరంగంగానే ఆరోపించారు. తమ మద్దతుతోనే రాజ్యసభ నామినేషన్లు దక్కించుకుని.. కూటమి ద్వారానే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు స్వార్థం రాజకీయంతో వేరే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దారుణమన్నారు. తాము ఇకపై ఇండియా కూటమిలో భాగం కాబోమని, లోక్‌సభలో కూడా కాంగ్రెస్ పక్కన కాకుండా తమకు విడిగా సీట్లు కేటాయించాలని డీఎంకే  ఏకంగా స్పీకర్‌ను కోరింది.   అయితే.. కాంగ్రెస్ కు కూటమి భాగస్వామ్య పక్షాల నుంచి తిరస్కారం ఎదురు కావడం ఒక్క తమిళనా డుకే పరిమితం కాలేదు.  మరికొన్ని కీలక రాష్ట్రాల్లోనూ ఇదే రకమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల పరాజయం తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్   అంతర్గత విభేదాలు, సొంత పార్టీ నేతల తిరుగుబాట్లతో కుదేలౌతోంది. అలాగే.. ఉత్తరాదిలో కూటమికి అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా సీట్ల సర్దుబాటు ఫ్రేమ్‌వర్క్ నుంచి అధికారికంగా తప్పుకుని కూటమికి దూరం జరిగింది.  తమిళనాడులో మతతత్వ శక్తులను అడ్డుకోవడానికి, స్థిరమైన ప్రభుత్వాన్ని అందించడానికే తాము టీవీకే తో చేతులు కలిపామని కాంగ్రెస్ సమర్థించుకుంటున్నప్పటికీ..  కూటమిలోని  ప్రాంతీయ పార్టీలు మాత్రం కాంగ్రెస్ అనుసరిస్తున్న స్వార్థ రాజకీయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి.  ఇండియా కూటమి విచ్ఛిన్నం అవుతుండటం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.  
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్‌లో సరికొత్త మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ‘నాగబంధం’ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. భారీ బడ్జెట్‌తో, విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. సమ్మర్ సీజన్ ముగిసిన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఉండే ఖాళీ సమయాన్ని క్యాష్ చేసుకోవాలనే పక్కా వ్యూహంతో మేకర్స్ ఈ డేట్‌ను లాక్ చేశారు. ఈ సినిమాకు ఎలాంటి పోటీ లేకుండా సోలోగా థియేటర్లలోకి దించాలనేది నిర్మాతల అసలు ప్లాన్. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల క్లాష్ లేకపోతే ఓపెనింగ్స్ అద్భుతంగా వస్తాయని, కంటెంట్‌పై ఉన్న గట్టి నమ్మకంతోనే అభిషేక్ నామా టీమ్ ఈ డేట్‌ను ఎంచుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడమే ఈ టీమ్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో అందరినీ ఆకర్షిస్తున్న ముఖ్యమైన అంశం యంగ్ హీరో విరాట్ కర్ణ. కెరీర్ ఆరంభంలోనే, అది కూడా కేవలం తన రెండో సినిమాతోనే ఏకంగా పాన్ ఇండియా సబ్జెక్టును టేకప్ చేయడం విశేషం. సాధారణంగా 1750ల నాటి కథ, పురాతన నిధులు, దైవిక శక్తుల నేపథ్యం అంటే స్టార్ హీరోలను ఊహించుకుంటారు. కానీ కథా బలాన్ని నమ్మి ఒక కొత్త కుర్రాడితో ఇంతటి ప్రతిష్టాత్మకమైన సినిమాను నిర్మించడం ట్రేడ్ వర్గాల్లో సైతం ఆసక్తి రేపుతోంది. గత కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో వస్తున్న మైథలాజికల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకుంటున్నాయి. స్టార్ ఇమేజ్ కంటే కూడా బలమైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిరూపితమైంది. ‘నాగబంధం’ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. పరాయి దేశాల దండయాత్రల నుండి మన దేశ సంపదను, పురాతన గుడులలో దాగి ఉన్న రహస్యాలను కాపాడే శివుని అంశతో సాగే ఈ కథ ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్‌ను ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. సీనియర్ నటుడు జగపతి బాబు ఒక కీలక పాత్రలో కనిపిస్తుండగా.. గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ కోసం నభా నటేష్, ఐశ్వర్య మీనన్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘సుర సుర’ అనే ఫోక్ సాంగ్ మాస్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చీకటికి, వెలుగుకు మధ్య జరిగే పోరాటాన్ని అద్భుతమైన వీఎఫ్ఎక్స్, ఆర్ట్ వర్క్‌తో అత్యంత రిచ్‌గా తెరకెక్కించారు. సోషల్ మీడియాలోనూ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, విజువల్స్ చూసి ప్రేక్షకులు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. జూలై 3న రాబోతున్న ఈ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద మొదటి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. ఒక యంగ్ హీరో, వినూత్నమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ‘నాగబంధం’ టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలంటే మరో నెల రోజులు వేచి చూడాల్సిందే!
  భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. వందల కోట్లు కాదు, ఏకంగా వేల కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పౌరాణిక చిత్రం 'రామాయణ', మహేష్ బాబు, రాజమౌళిల కాంబోలో తెరకెక్కుతున్న  ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'వారణాసి' చిత్రాల బడ్జెట్లపై సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఒకటే చర్చ సాగుతోంది. నివేదికల ప్రకారం రెండు భాగాలుగా రాబోతున్న 'రామాయణ' సిరీస్ బడ్జెట్ అక్షరాలా 4000 కోట్ల రూపాయలు దాటుతుందని అంచనా. అలాగే 'వారణాసి' చిత్రం కూడా దాదాపు 1400 కోట్ల రూపాయల భారీ వ్యయంతో తెరకెక్కుతుంది. రీసెంట్ గా బాలీవుడ్ అగ్ర  నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో రామాయణ', వారణాసి చిత్రాల వేల కోట్ల బడ్జెట్ ప్రచారం గురించి యాంకర్ ప్రశ్న వేసింది. అప్పుడు మనోజ్ బాజ్‌పాయ్ మాట్లాడుతు 'ఇదంతా కేవలం ఒక పీఆర్ ట్యాక్టిక్ (పబ్లిసిటీ స్ట్రాటజీ) మాత్రమే. గత 15 ఏళ్లుగా సినిమా ప్రమోషన్ల కోసం ఈ విధమైన ట్రెండ్‌ని వాడుతున్నారు. కేవలం బడ్జెట్ నంబర్లను చూసి సినిమాలు హిట్ అవుతాయనే భ్రమ కల్పించడం సరికాదు. ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు, వందల కోట్ల బడ్జెట్ సంభాషణలు సాధారణ ప్రేక్షకుల బుర్రల్లోకి ఎంతగా ఎక్కాయంటే, అది ఇప్పుడు ఒక అంటువ్యాధిలా మారింది. నేను  ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు కలిసే కొందరు సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా కథ గురించి కాకుండా, ఏ సినిమా ఎన్ని వందల కోట్లు వసూలు చేసిందనే నంబర్ల గురించే మాట్లాడుతుంటారు. అలాంటి సమయంలో నాకు చాలా కోపం వస్తుంది. అటువంటి ప్రేక్షకులని పలుమార్లు గట్టిగానే మందలించాను. Also read: చిన్న హీరో, పెద్ద సాయం..118 మంది విద్యార్థులకి ఏం సాయం చేసాడో తెలుసా!  ఆ సినిమాలకు వచ్చే 500 కోట్ల రూపాయలు, 600 కోట్ల రూపాయల లాభాల్లోంచి ఒక్క రూపాయి అయినా మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుందా? అని నేను వారిని నేరుగా అడుగుతాను. మీ అకౌంట్లోకి ఆ డబ్బులు వస్తే మీరు ఆ బాక్స్ ఆఫీస్ నంబర్ల గురించి మాట్లాడండి. లేదంటే సినిమా మీకు నచ్చిందా లేదా!. కంటెంట్‌ని  వదిలేసి, కేవలం నంబర్ల మాయాజాలంలో పడద్దంటూ వాళ్ళకి చెప్పానని మాట్లాడటం జరిగింది. ప్రస్తుత్తం ఈ  వ్యాఖ్యలు  నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.    
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'మెగా 158' (Mega158) రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ చిత్రం.. ప్రస్తుతం సరికొత్త షెడ్యూల్ కోసం తమిళనాడులోని అందమైన లొకేషన్ పొల్లాచ్చికి చేరింది. ప్రస్తుతం పొల్లాచ్చి పరిసర ప్రాంతాల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు ప్రధాన తారాగణంపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలు, టాకీ పార్ట్‌ను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారు. వాల్తేరు వీరయ్యను మించిన ఒక ఊరమాస్, హై-వోల్టేజ్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని బాబీ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ని మునుపెన్నడూ చూడని ఒక పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ రోల్‌లో చూపించబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' (Peddi) సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొల్లాచ్చి షెడ్యూల్ సెట్స్ నుండి చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌కు, 'పెద్ది' చిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పొల్లాచ్చిలో షూటింగ్ లో ఉన్నప్పటికీ, తన మనసు అంతా పెద్ది చుట్టూనే తిరుగుతుందని చిరంజీవి రాసుకొచ్చారు. అలాగే 'మెగా 158' సెట్స్ నుండి చిత్ర యూనిట్ కూడా ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. పొల్లాచ్చి షెడ్యూల్ సెట్స్ నుండి 'మెగా 158' టీమ్ మొత్తం రామ్ చరణ్‌కు, 'పెద్ది' చిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షల వీడియోను షేర్ చేసింది. మెగాస్టార్ సెట్స్ నుండి కొడుకు సినిమా విజయానికి ఇలా విషెస్ పంపడం సోషల్ మీడియాలో మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలను హ్యాండిల్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా కోసం విపరీతంగా జిమ్‌లో కష్టపడి తన బాడీని సరికొత్త మాస్ లుక్‌లోకి మార్చారు. పొల్లాచ్చిలో జరుగుతున్న ఈ భారీ షెడ్యూల్ మరో రెండు వారాల పాటు కొనసాగనుంది. తండ్రీకొడుకుల సినిమాలు ఒకే సమయంలో ఒక వైపు థియేటర్లలో రికార్డుల వేట, మరోవైపు సెట్స్ పై షూటింగ్ హడావిడితో సాగుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో మునిగిపోయారు.  
సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘మొహబ్బత్’ (Mohabbat). ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని అందిస్తూ మ్యాక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం శుక్రవారం నాడు ఘనంగా జరిగింది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నవీన్ యాదవ్ క్లాప్ కొట్టగా చిత్ర నిర్మాత అఫ్రోజ్ షేక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం నవీన్ యాదవ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని కూడా లాంచ్ చేశారు.  చిత్రయూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ .. "మొహబ్బత్ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. అఫ్రోజ్ అన్న నిర్మాతగా కొత్త వారికి ప్రోత్సాహం అందిస్తున్నారు. సినీ కార్మికుల కష్టాలు నాకు తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాల్ని నిర్మిస్తూనే ఉంటారు. ఈ చిత్రానికి పని చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఇది పాన్ ఇండియాగా రిలీజ్ కాబోతోంది. దర్శకుడు మ్యాక్‌కి మంచి సక్సెస్ రావాలి. ఈ సినిమా మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను" అన్నారు. దర్శకుడు సలీమ్ మాలిక్ (మ్యాక్) మాట్లాడుతూ .. "నిర్మాత అఫ్రోజ్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ‘మొహబ్బత్‌’ను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఎమోషనల్ యూత్ ఫుల్ జెన్ జీ చిత్రంగా ‘మొహబ్బత్’ రానుంది. త్వరలోనే మా సినిమా పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది" అన్నారు. నిర్మాత అఫ్రోజ్ షేక్ మాట్లాడుతూ .. "నా ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద మొదటి ప్రాజెక్ట్‌గా ‘మొహబ్బత్’ను నిర్మిస్తున్నాను. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. మ్యాక్ మంచి దర్శకుడు. సంతోష్, శ్రేయాసిలకు ఈ సినిమాతో మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాను. మా కోసం వచ్చిన నవీన్ యాదవ్ గారికి, శ్రీశైలం యాదవ్ గారికి ధన్యవాదాలు" అన్నారు. హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ .. "మొహబ్బత్ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. ఈ కథ నాకు చాలా నచ్చింది. ఇది నాకు రెండో చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మ్యాక్ గారు, అఫ్రోజ్ గారికి థాంక్స్" అన్నారు. హీరో సంతోష్ కల్వచెర్ల మాట్లాడుతూ .. "అఫ్రోజ్ గారికి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. మా డైరెక్టర్ మ్యాక్ అద్భుతమైన టాలెంటెడ్. ఇలాంటి ఓ ప్రేమ కథకు సంగీతం ప్రధానం. సునీల్ కశ్యప్ గారితో పని చేస్తుండటం ఆనందంగా ఉంది" అన్నారు. స్టోరీ, డైలాగ్ రైటర్ కలాం మాట్లాడుతూ .. "మొహబ్బత్’ కథ అద్భుతంగా వచ్చింది. కథ, మాటలను నేను అందించాను. ఎమోషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి" అన్నారు.  
    కొందరు హీరోలు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను తామేంటో నిరూపించుకుంటూ ప్రజల హృదయాల్లో రియల్ హీరోలుగా నిలిచిపోతారు. అలాంటి వారిలో యువ నటుడు సంజోష్ ఒకరు. ‘బేవార్స్’, ‘సోదర’ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరో, సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సమాజంలో వెనుకబడిన, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చదువే అసలైన ఆయుధమని నమ్మిన సంజోష్, అందుకోసం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తున్నారు. తాను సంపాదించిన దానిలో కొంత భాగమైనా సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉన్నత ఆశయంతో ఆయన స్థాపించిన ‘సంజోష్ ఫౌండేషన్’ నిరంతరం అద్భుతమైన సేవలను అందిస్తోంది. ఇటీవల తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరునాగారం పరిసర ప్రాంతాల్లో సంజోష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక చారిత్రాత్మక స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. చదువుకోవాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ, ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్న గిరిజన, వెనుకబడిన, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. కేవలం ఆర్థిక సాయం అందించడమే కాకుండా, వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి మరింత ప్రోత్సహించడమే ఈ సేవా యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం. గిరిజన గూడాల్లో, అటవీ ప్రాంతాల్లో సరైన వనరులు లేకపోయినా కష్టపడి చదివిన విద్యార్థుల ముఖాల్లో ఈ కార్యక్రమం కొండంత ఆనందాన్ని నింపింది. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా పరిధిలోని వివిధ గ్రామాలకి చెందిన  118 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి వారికి స్కాలర్‌షిప్‌లు అందజేశారు. విద్యార్థులను ఎంపిక చేయడంలో ఫౌండేషన్ పారదర్శకమైన, కఠినమైన ప్రమాణాలను పాటించింది. 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులని, ఇంటర్మీడియట్ విద్యలో 900 కంటే ఎక్కువ మార్కులు సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన వారిని గుర్తించి ఈ పురస్కారాలకి  ఎంపిక చేశారు. ఇలా అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనూ విద్యా ప్రమాణాలను చాటిన 118 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి  2,000 చొప్పున నగదు స్కాలర్‌షిప్‌లను హీరో సంజోష్ స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు. also read: Peddi: పెద్దిపై గాయని సుమంగళి సంచలన వ్యాఖ్యలు ఈ నగదు పురస్కారం కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, ఉన్నత చదువులు చదవాలనుకునే ఆ పేద గిరిజన బిడ్డల భవిష్యత్తుకు సంజోష్ ఇచ్చిన ఒక నమ్మకం, ఒక పెద్ద భరోసా. మారుమూల గిరిజన ప్రాంతాలలో విద్యా దీపాన్ని వెలిగించడానికి సంజోష్ ఫౌండేషన్ చేస్తున్న ఈ కృషీ వలయానికి స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. కేవలం స్కాలర్‌షిప్‌లు ఇవ్వడమే కాకుండా, రాబోయే రోజుల్లో గిరిజన ప్రాంతాలలోని పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం వంటి మరెన్నో విస్తృతమైన సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు సంజోష్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.   
సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) మార్క్ మాస్ ఎంటర్‌టైనర్ల కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన ఇండస్ట్రీలో సరికొత్త సంచలనానికి తెరలేపారు. వర్సటైల్ యాక్టర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ 'స్లమ్‌డాగ్ -33 టెంపుల్ రోడ్' (Slumdog: 33 Temple Road).  ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచే సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి జగన్నాథ్ సిగ్నేచర్ స్టైల్ కు తగ్గట్టుగా ఎంతో రా అండ్ రస్టిక్ గా, ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. 'రా స్ట్రీట్స్.. రియల్ స్కార్స్.. రూత్‌లెస్ ఎమోషన్స్' అంటూ ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ను మేకర్స్ అప్పుడే పరిచయం చేశారు. ఒక ఊరమాస్ లోకల్ స్ట్రీట్ గ్యాంగ్‌స్టర్ కథాంశంతో, పూరి జగన్నాథ్ తనదైన మార్క్ డైలాగ్స్ మరియు క్యారెక్టరైజేషన్ తో విజయ్ సేతుపతిని మునుపెన్నడూ చూడని విధంగా వెండితెరపై ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీకి సంబంధించిన లేటెస్ట్ క్రేజీ అప్‌డేట్ ని మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే పవర్‌ఫుల్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. 'స్లమ్‌డాగ్' సినిమాకు సంబంధించిన మైండ్ బ్లోయింగ్ అండ్ స్ట్రైకింగ్ టీజర్ ను జూన్ 8 సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విడుదలైన కొన్ని నిమిషాల్లోనే విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పోస్టర్ లో హీరో కళ్ళకు నల్లటి గుడ్డ కట్టుకుని, చేతిలో రక్తం అంటిన కత్తితో ఊరమాస్ లుక్ లో కనిపిస్తూ వెనుక నుంచి పోజు ఇవ్వడం సినిమా ఏ రేంజ్ వైల్డ్ యాక్షన్ తో ఉండబోతుందో హింట్ ఇస్తోంది.  జూన్ 8న సాయంత్రం 6 గంటలకు రాబోయే ఈ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రొల్ల సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు సీనియర్ నటి టబు, క్రేజీ బ్యూటీ సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటులు శరత్ కుమార్, బ్రహ్మాజీ, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని కేవలం తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ డైరెక్షన్, విజయ్ సేతుపతి ఇంటెన్స్ యాక్టింగ్ తో కూడిన ఈ 'స్లమ్‌డాగ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.   https://x.com/PuriConnects/status/2062852267271970826
Mega Power Star Ram Charan’s Peddi has registered a huge opening at the worldwide box office. Despite releasing on a working day, the film has reportedly maintained strong occupancies across centres, with Day 2 bookings also remaining encouraging. But the word-of-mouth has been mixed with many targeting director Buchi Babu for his portrayal of Janhvi Kapoor's character. Also, several memes have been going around stating that the movie has no logic and magic did not work too. Mainly, Janhvi's scenes will be problematic for families to watch it in theatres. Well, thanking audiences for such a huge resposne, Buchi Babu addressed press and stated that he he has been receiving lengthy messages continuously since the premiere shows. He said many families have been watching the film with children and sharing how inspirational they found the story and character. He also stated that he is thrilled to see the kind of response for an inspiring story that Peddi is and he encouraged audiences to watch it with their children in theatres.  Distributor Mythri Ravi also echoed same sentiment. He stated that he is happy with the occupancies and thrilled to see their predictions come true. He thanked Ram Charan for giving Industry respite after a dry season. He predicted movie to go on and smash many records.  Producer Satish Kilaru stated that the film received unanimous positive response and they are happy that there is no negativity about the film at any corner. He stated that the film should be watched with kids and families. But the social media posts are saying something completely opposite.    Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా వచ్చిన  స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది' (peddi) థియేటర్లలోకి వచ్చిందో లేదో అప్పుడే పెద్ద వివాదంలో చిక్కుకుంది. మూవీలో ఒకవైపు సమాజంలో అణచివేత, ఆత్మగౌరవం, హక్కుల గురించి సుదీర్ఘమైన సందేశాలు ఇస్తూనే, మరోవైపు జాన్వీ పోషించిన ఆచ్చాయమ్మ క్యారక్టర్ ని  కేవలం గ్లామర్ బొమ్మగా మార్చేసి  మితిమీరిన శృంగారభరితంగా చూపించారంటూ ప్రముఖ సింగర్ సుమంగళి అరియనాయగం చేసిన సంచలన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.  సుమంగళి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో  "సమాజంలో బలహీనులుగా మారిపోవడం వల్ల వచ్చే బాధ, గాయం గురించి కథ రాయడానికి ఒక గది నిండా పవర్‌ఫుల్ మగవాళ్లంతా కూర్చున్నారు. కానీ, అదే ఊపులో వారు జాన్వీ కపూర్ క్యారక్టర్ ని కేవలం కెమెరా లెన్స్ ముందు ఒక అందాల ప్రదర్శన వస్తువుగా, బలవంతపు ముద్దు సీన్ కోసం ఒక ప్రాప్‌గా మార్చేశారు. కేవలం పాటలు ముగిసిపోగానే పక్కన పడేసే ఒక సాధనంగా వాడుకున్నారు" .సినిమా రూపకర్తలకి మానవ గౌరవం అంటే ఏంటో బాగా తెలుసని, కానీ ఆ గౌరవానికి ఈ పాత్ర అర్హురాలు కాదని వారే స్వయంగా నిర్ణయించుకున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే ఒక కథానాయికకి జరిగిన అత్యంత ఖరీదైన అవమానం ఇదేనంటూ పోస్ట్ చేసింది. ఈ వివాదం ఇంతటితో ఆగలేదు, స్వయంగా జాన్వీ కపూర్ ఈ విమర్శల పోస్ట్‌ను లైక్ చేయడం ఇండస్ట్రీ వర్గాలని సైతం విస్మయానికి గురిచేసింది. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఈ విధమైన మితిమీరిన గ్లామర్ షాట్స్ మరియు బలవంతపు రొమాంటిక్ సీన్స్ పట్ల జాన్వీ కపూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. Also read: Karuppu: కరుప్పు విజయంపై కొత్త వివాదం.. విజయ్ vs సూర్య  సినిమా దర్శకుడు బాక్సాఫీస్ నంబర్ల కోసం, కలెక్షన్ల కోసం ఒక నటి యొక్క ప్రొఫెషనల్ సరిహద్దులను, ఆమె సమ్మతిని పూర్తిగా పక్కనబెట్టి ఫైనల్ ఎడిట్‌లో ఆ సీన్స్‌ను అలాగే ఉంచేశారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. జాన్వీ ఈ పోస్ట్‌ను లైక్ చేయడంతో, డైరెక్టర్ బుచ్చిబాబు సన ప్రవర్తనపై మరియు సినిమాలో హీరో ప్రవర్తించే విధానాన్ని 'రొమాన్స్' అని సమర్థించడంపై నెటిజన్లు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'పెద్ది' సినిమాలో మహిళల ప్రాధాన్యత, వారి పాత్రల చిత్రీకరణపై ఒక పెద్ద చర్చ నడుస్తోంది. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పెద్ది తొలి రోజు 135 .36 కోట్లు సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది.  
Director Puri Jagannadh and actor Vijay Sethupathi's upcoming pan-India film, "Slumdog 33 Temple Road," has wrapped up its shooting schedule and is currently in the post-production phase. Moving along with its post-shoot works, the makers have announced that the official teaser for the movie will be released on June 8th. The project is being promoted with the tagline "Raw streets. Real scars. Ruthless emotions." The announcement poster hints at a gritty, violent action drama, featuring the back of a character holding a large, blood-stained weapon. This marks a notable combination between Vijay Sethupathi, known for his realistic performances, and Puri Jagannadh, recognized for his stylized, mass-market action films. Tabu, Duniya Vijay are playing pivotal roles in the film with Samyuktha Menon as leading lady. The movie is being produced by Puri Connects and JB Motion Pictures, with Charmme Kaur presenting and JB Narayan Rao Kondrolla co-producing. Harshavardhan Rameshwar is handling the music and background score.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  సూర్య వరుస ప్లాప్స్ కి మంగళగీతం పాడిన మూవీ కరుప్పు(karuppu).. ఉరఫ్ వీరభద్రుడు. పైగా సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ప్రస్తుతం 300 కోట్లరూపాయిలకి పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.  రీసెంట్ గా కరుప్పు  దర్శకుడు ఆర్ జె బాలాజీ ఒక  ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'కరుప్పు’ కథని మొదట తమిళనాడు ముఖ్యమంత్రి, హీరో  విజ‌య్‌కి రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ చేసే చివరి సినిమాగా ఈ కథ బాగుంటుందని భావించి ఆయనకు చెప్పినట్లు పేర్కొన్నాడు.  దీంతో ఈ విషయంపై ఇప్పటి వరకు పెద్దగా చర్చ జరగకపోయినా  ఎడిటర్ క‌లైవ‌న‌న్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఒకవేళ ఈ సినిమాను విజయ్ చేసి ఉంటే అది మరింత పెద్ద స్థాయిలో ఉండేదని ఆయన వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. దీంతో సూర్య అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘కరుప్పు’ విజయంలో సూర్య నటన కీలక పాత్ర పోషించిందని అభిమానులు గుర్తు చేస్తున్నారు. సినిమా విజయం సాధించిన తర్వాత కూడా హీరో ప్రదర్శనను పక్కనపెట్టి, మరో హీరోతో పోల్చడం సరైన పద్ధతి కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సూర్య ప్రదర్శించిన భావోద్వేగ నటన, డ్యాన్స్, పాత్రలో చూపించిన తీవ్రత సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అభిమానులు చెబుతున్నారు. అలాంటి పాత్రను ఎవరు చేసినా అదే స్థాయిలో ప్రభావం చూపించగలరని చెప్పడం సులభం కాదని వారు వాదిస్తున్నారు.ఎడిటర్ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య చర్చ మొదలైంది. కొందరు సినిమా కథ బలంగా ఉండటం వల్లే విజయం సాధించిందని చెబుతుండగా, మరికొందరు సూర్య నటన లేకుండా ఆ ప్రభావం సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. సినిమా విజయానికి కథ, దర్శకత్వం ఎంత ముఖ్యమో, హీరో నటన కూడా అంతే ముఖ్యమని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ వివాదం నడుమ సూర్య నేరుగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక సాధారణ పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. “ప్రేమతో ఉండండి” అనే సందేశంతో చేసిన ట్వీట్‌ని  చాలా మంది ఈ వివాదానికి పరోక్ష సమాధానంగా భావించారు. దీంతో సోషల్ మీడియాలో కొనసాగుతున్న చర్చ కొంతవరకు చల్లారినట్లు కనిపించింది. Also read: 56 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగిల్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్ వివాదం మరింత ముదరకముందే ఎడిటర్ కలైవనన్ కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను చెప్పిన మాటలు వేరే విధంగా అర్థం చేసుకున్నారని, తన ఉద్దేశం సూర్య నటనను తక్కువ చేయడం కాదని స్పష్టం చేసినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని కూడా ఆయన పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మరో ఆసక్తికర అంశం ఆర్జే బాలాజీ, సూర్య మధ్య ఉన్న అనుబంధం. గతంలో పలుమార్లు బాలాజీ, సూర్య తన జీవితంలో ఎంతో కీలక వ్యక్తి అని, తనకు అండగా నిలిచిన వ్యక్తుల్లో ఒకరని పేర్కొన్నారు. అలాంటి దర్శకుడి సినిమా చుట్టూ ఇప్పుడు హీరోల పోలికలతో వివాదం రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
 భారతదేశ  పరిమళం ఇప్పుడు సప్త సముద్రాల ఆవలి దేశాల వాతావరణంతో మేళవిస్తోంది. ఆ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు మనకంటే పూర్తిగా భిన్నమైనవి. మనం మన పెరటి మొక్కగా అంతకంటే ఎక్కువ ఇంటి దేవతగా  భావించి, ప్రతి ఉదయం, సాయంత్రం నీళ్ళు పోసి పూజించే  తులసి, ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన ముస్లిం దేశాల మొదటి ఎంపికగా మారింది. ఈ మాట తెలియగానే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది.  కానీ  ఇటీవలి డేటా , వాణిజ్య నివేదికలు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని వెల్లడించాయి. బంగ్లాదేశ్, మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో భారతీయ తులసికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇది కేవలం వాణిజ్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, భారతీయులుగా తెలుసుకోవాల్సిన విషయం. తులసిని కేవలం మొక్కగా బావించే ఎంతోమంది విదేశీయులు కూడా తులసికి ఎందుకంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. విదేశాలలో తులసి.. సనాతన ధర్మంలో, తులసిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, "సాక్షాత్తు లక్ష్మీదేవి" స్వరూపంగా భావిస్తారు. పెరట్లో తులసి ఉన్న ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించలేదని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ నేడు, ఈ నమ్మకం అన్ని హద్దులను దాటింది. ఇటీవలి నివేదికల ప్రకారం, తులసి,  దాని సారాలు భారతదేశం నుండి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ , మలేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా, ఈ దేశాలు దీనిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, ఒక "దివ్య ఔషధం"గా స్వీకరిస్తున్నాయి. విదేశాలలో తులసికి ఆదరణ.. విదేశాలలో తులసి ఆదరణ  వెనుక విజ్ఞానం  ఆధ్యాత్మికతల కలయికను ప్రతిబింబించే అనేక లోతైన , తార్కిక కారణాలు ఉన్నాయి. నయంకాని వ్యాధులకు సర్వరోగ నివారిణిగా తులసి పనిచేస్తుంది. ఈ దేశాలలో ఆయుర్వేదంపై నమ్మకం పెరిగింది. అక్కడి శాస్త్రవేత్తలు కూడా క్యాన్సర్, మధుమేహం , శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో తులసి ప్రభావవంతంగా పనిచేస్తుందని గుర్తించి దాన్ని వైద్యంలో భాగం చేస్తున్నారట. హలాల్ గుర్తించిన మూలిక.. మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో, "హలాల్" ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి ఉత్పత్తులు సహజమైనవి , స్వచ్ఛమైనవి, వీటిలో నిషేధిత రసాయనాలు ఏవీ ఉండవు. ఈ కారణంగానే అక్కడి ముస్లిం సమాజంలో వీటికి ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. తులసి టీ.. భారతీయ "తులసి టీ" కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రజలు కెఫిన్‌ను వదిలిపెట్టి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి , రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తులసి సారాన్ని ఆశ్రయిస్తున్నారు. తులసితో టీ తయారు చేసుకుని తాగుతున్నారు. మతపరమైన దృక్కోణం నుండి చూస్తే ప్రతి భారతీయుడు దీన్ని  గర్వంగా భావించాలి. మనం విష్ణువుకు ఎంతో ప్రతీకరమైనదిగా  పిలుచుకునే మొక్క పరిమళం ఇప్పుడు విభిన్నమైన ప్రార్థనా పద్ధతులున్న ఇళ్లకు చేరుతోంది. సనాతన సంస్కృతి పూజించే ప్రకృతిలోని ప్రతి అంశం మానవులకు ఎంతో మేలు చేసేది, ఆరోగ్యం చేకూర్చేది అనేటువంటి దానికి ఇదొక నిదర్శనం.   ప్రపంచ మార్కెట్లో తులసికి ప్రాధాన్యత.. భవిష్యత్తులో తులసి ప్రపంచ మూలికా మార్కెట్‌కు బిలియన్ల డాలర్ల మేర దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గత మూడేళ్లలో గల్ఫ్ దేశాలకు తులసి ఎగుమతులు 30-40% పెరిగాయట. దుబాయ్ , సౌదీ అరేబియాలోని విలాసవంతమైన స్పా మరియు బ్యూటీ పార్లర్లలో ఇప్పుడు తులసి ఆధారిత ఫేస్ మాస్క్‌లు , నూనెలను ప్రీమియం ట్రీట్మెంట్ లో భాగంగా గా అందిస్తున్నారట. భారతీయులకు ఎంతో పవిత్రమైన,  ఆయుర్వేదంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నట్టు పేర్కొన్న తులసిని భారతీయులు చిన్నతనం చేయకుండా ఉపయోగించుకోవాలి.                                      *రూపశ్రీ.
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు. తరువాత  దాని గురించి పశ్చాత్తాపపడతారు. చాలా వరకు ప్రతి వ్యక్తి తన నిర్ణయం సరైనదని నమ్ముతాడు, కానీ కాలక్రమేణా, వారి భ్రమలు తొలగిపోతాయి. ఒక వ్యక్తి తీసుకునే ప్రతి నిర్ణయం వారి మనస్సు , మెదడు డైరెక్షన్ ద్వారా నడుస్తుంది.  ఈ విషయాన్ని స్వయానా ఆచార్య  చాణక్యుడు స్పష్టం చేశాడు. మనిషి మనస్సు , మెదడు పూర్తీ సామరస్యంతో లేనంత వరకు, వారి నిర్ణయాలు తప్పు అని రుజువవుతాయని చాణక్యుడు నమ్ముతాడు. మనస్సు , మెదడు సంపూర్ణ సామరస్యంతో లేకపోతే, వారి సొంత మనస్సే వారికి శత్రువుగా మారుతుంది.ఒక వ్యక్తికి తన సొంత మనస్సే శత్రువుగా మారడానికి గల ఐదు కారణాలను ఆచార్యుడు స్పష్టంగా వివరించాడు.  అవేంటో తెలుసుకుంటే.. బాలెన్స్ లేకపోవడం.. నిర్ణయం తీసుకునే సామర్థ్యం  వ్యక్తి యొక్క మనఃస్థితి , మెదడుపై ఆధారపడి ఉంటుందని ఆచార్య చాణక్యుడు అంటాడు. అందువల్ల ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉంటే, ఆ నిర్ణయం మెరుగ్గా ఉంటుంది. అయితే వ్యక్తి భావోద్వేగాల ప్రభావంతో నిర్ణయం తీసుకున్నప్పుడు, ఫలితం ప్రతికూలంగా ఉంటుంది.  దాని వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. దురశాతో ఆధిపత్యం చెలాయించడం.. దురాశ  మనిషిని  ఆవరించినప్పుడు, వారు సరైన నిర్ణయాలు తీసుకోలేరని చాణక్యుడు చెబుతాడు. లాభాపేక్ష అనే ఆలోచనే మనిషిలో దురాశ పుడుతుంది.   ప్రయోజనాల కారణంగా జరిగే నష్టాల గురించి ఆలోచించరు. ఈ అలవాటు నేటికాలంలో చాలామందిలో చాలా ఎక్కువగా ఉంది.  వ్యాపారవేత్తలు కూడా అధిక లాభాల ఆశతో పెట్టుబడుల నుండి వచ్చే  నష్టాలను తరచుగా పట్టించుకోరు. చాణక్యుని దృష్టిలో, దురాశ , తొందరపాటు మనసును శత్రువుగా మారుస్తాయి. కోపం.. కోపం ముఖ్యమైన సంబంధాలను కూడా క్షణాల్లో విచ్ఛిన్నం చేస్తుంది.  చాణక్యుని ప్రకారం ఇది ఒక వ్యక్తి యొక్క ఆలోచనను, ఇతరులు చెప్పే విషయాన్ని వినాలనే ఆసక్తిని కూడా అణిచివేస్తుంది.  కోపంలో ఉన్నప్పుడు మనిషి తన కోపాన్ని బయటకు వ్యక్తం చేస్తాడు అంతే కానీ.. ఆలోచించి  జరిగిన విషయం గురించి ఆలోచించి సమస్యను పెద్దది కాకుండా ఆపే విచక్షణ ఉండదు. అందుకే తన కోపమే తన శత్రువు అని అన్నారు.ఈ కోపం మనిషి మనసును కూడా శత్రువుగా మారుస్తుంది. అతిగా ఎమోషనల్ బాండింగ్.. ఆచార్య చాణక్యుని ప్రకారం మితిమీరిన ఎమోషనల్ బాండింగ్ కూడా ఒక వ్యక్తికి హాని చేస్తుంది. ఒక వ్యక్తి ఎవరితోనైనా భావోద్వేగపరంగా చాలా గాఢంగా ముడిపడి ఉన్నప్పుడు, వారు నిజానిజాలు సరిచూసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ పరిస్థితిలో భ్రమల ఏది, నిజం ఏది తెలుసుకోలేరు.  తమ భ్రమ పడే విషయమే నిజం అని కూడా అనుకుంటారు. ఈ కారణంగానే అపార్థాలు కూడా చాలా సులువుగా వచ్చేస్తాయి. సందేహంతో తీసుకునే నిర్ణయాలు.. చాణక్యుడు జ్ఞానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చాడు. అసంపూర్ణ జ్ఞానం భవిష్యత్తుకు హాని కలిగిస్తుంది.    పూర్తి నిజం తెలుసుకోకుండా తుది నిర్ణయానికి రావడం చాలా ప్రమాదమని,  దీనివల్ల చాలా నష్టపోవాల్సి ఉంటుందని చెబుతాడు. సందేహంతో తీసుకునే   నిర్ణయాలు కంటే వాస్తవాలను అర్థం చేసుకుని తీసుకునే నిర్ణయాలు మనిషిని నష్టానికి దూరంగా ఉంచుతాయి.                                 *రూపశ్రీ.
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా,  భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉంటారని కూడా పేర్కొంటారు.  అయితే కేవలం జాతకాల ఆధారంగా జీవిత భాగస్వామిని ఎంచుకోవడం సరిపోదని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. బలమైన , సంతోషకరమైన సంబంధం కావాలంటే..  ఆలోచనలు, విలువలు, ప్రవర్తన , భవిష్యత్తు గురించి సరైన ప్రణాళిక, అవగాహన అన్నీ కూడా పొంతన కుదరడం జాతకాల కంటే ముఖ్యమైన విషయం. ఇందకోసం వివాహానికి మందు జాతకాల పొంతన కుదిరిందా లేదా అనే విషయం కంటే ఇటీవల వివాహానికి ముందు  కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా భాగస్వామిని ఎంచుకోవడం మంచిదని, ఇలా చేయడం వల్ల జీవితం ఎంతో బాగుటుందని అంటున్నారు. ఇంతకీ వైవాహిక బంధంలోకి వెళ్ళేముందు కాబోయే భాగస్వామిని అడగవలసిన ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. సంతోషకరమైన జీవితం అంటే.. పెళ్లికి ముందు తెలుసుకోవలసిన  ముఖ్యమైన విషయం ఏమిటంటే..  సంతోషకరమైన జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోవడం. కొందరు వృత్తికి, విజయానికి ప్రాధాన్యత ఇస్తే, మరికొందరు కుటుంబానికి, స్థిరమైన జీవితానికి విలువ ఇస్తారు. ఇద్దరికీ జీవితంపై వేర్వేరు అంచనాలు ఉంటే, అది భవిష్యత్తులో విభేదాలకు దారితీయవచ్చు. అందువల్ల, ఇద్దరి కలలు , ప్రాధాన్యతల గురించి ఓపెన్ గా  చర్చించుకోవడం ముఖ్యం. ప్రేమ అంటే అర్థం.. ఒక సంబంధానికి పునాది ఇద్దరు భాగస్వాముల ప్రేమ ఎలా ఉంటుంది అనే విషయం పైన ఆధారపడి ఉంటుంది. బాల్యం, కుటుంబ నేపథ్యం , గత అనుభవాలు తరచుగా మనం ప్రేమను చూసే విధానాన్ని  తీర్చిదిద్దుతాయి. భార్యాభర్తల మధ్య సంబంధంలో గౌరవం, నమ్మకం , ఒకరితో ఒకరు మాట్లాడే తీరు.. వీటన్నింటి గురించి భాగస్వామికి  ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవడం ముఖ్యం. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది చాలా విషయాలలో ముడి పడి ఉంటుంది. అంచనాలు.. కుటుంబానికి సంబంధించిన అంచనాల గురించి కూడా స్పష్టంగా చర్చించుకోవాలి. వివాహం తర్వాత కుటుంబ పాత్ర, తల్లిదండ్రులతో కలిసి జీవించాలా లేక విడిగా జీవించాలా, పిల్లల గురించి  అభిప్రాయాలు, నిర్ణయాలు ఏమిటి, ముఖ్యమైన విషయాలు, నిర్ణయాలలో  కుటుంబ సభ్యుల ప్రమేయం ఎంతవరకు ఉండాలి వంటి విషయాలపై ముందుగానే స్పష్టత ఉండటం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో తలెత్తే అనేక గొడవలను ఈ స్పష్టత నివారిస్తుంది. బంధం నిర్వహణ.. ప్రతి సంబంధంలోనూ అభిప్రాయ భేదాలు రావడం సహజం, కానీ వాటిని ఎలా పరిష్కరిస్తారనేదే అత్యంత ముఖ్యం. పెళ్లికి ముందు కోపం, ఒత్తిడి లేదా అభిప్రాయ భేదాల వంటివి ఎదురైనప్పుడు   భాగస్వామి ఎలా స్పందిస్తారో అర్థం చేసుకోవడం ముఖ్యం. వారు మాట్లాడటం  ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారా లేదా వాటిని తప్పించుకుంటారా అనేది సంబంధం ఎంత బలంగా ఉంటుంది అనే విషయంలో  కీలక పాత్ర పోషిస్తుంది. అలవాట్లు, ప్రవర్తన.. పైన చెప్పుకున్న విషయాలే కాకుండా  రోజువారీ అలవాట్లు , ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థిక నిర్వహణ, బాధ్యతలను నిర్వర్తించడం, ఒత్తిడి గా ఉన్నప్పుడు దాన్ని నియంత్రించుకోవడం,  పరస్పర ప్రవర్తన వంటి చిన్న విషయాలు  సంబంధాన్ని ఎన్నేళ్లు గడిచినా ఎంతో సంతోషంగా ఉంచగలవు.  ఈ అలవాట్లు వివాహం తర్వాత అకస్మాత్తుగా మారవు, కానీ ఎక్కువగా బాగా స్పష్టంగా కనిపిస్తాయి. పైన చెప్పుకున్న విషయాలను పెళ్లికి ముందు భాగస్వాములు ఇద్దరూ మాట్లాడుకోవడం వల్ల పెళ్లి తర్వాత అబిప్రాయ బేధాలు లేదా మనస్పర్థలు రాకుండా ఉండేందుకు సహాయపడతాయి.   జీవితంలో ఒక్కసారి ముడిపడే బంధాన్ని జీవితాంతం పదిలంగా ఉంచుకోవచ్చు.                                         *రూపశ్రీ.
  చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో 'ఖల్లీ వాతం' అని అంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి ఇంట్లోనే ఉండి ఎలాంటి ఖర్చు లేకుండా చేసుకోగలిగే ఆయుర్వేద పరిష్కారాలు ఏమిటో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మ (MD-Ayurveda) గారు చెప్పిన మాటలు ఈ VIDEO ద్వారా తెలుసుకుందాం.   కాళ్ల పిక్కలు పట్టేయడానికి ప్రధాన కారణాలు: శరీరంలో వాత దోషం పెరగడం. డీహైడ్రేషన్ లేదా శరీరంలో నీటి శాతం తగ్గడం. రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం. విటమిన్లు, ఖనిజాల (మెగ్నీషియం, పొటాషియం) లోపం. డా. చిట్టిభొట్ల సూచించిన అద్భుత ఆయుర్వేద హోం రెమెడీ: ఈ సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి పొందడానికి మన వంటగదిలో దొరికే మూడు సహజసిద్ధమైన పదార్థాలతో సులువైన మందును తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: శొంఠి పొడి (Ginger Powder) మిరియాల పొడి (Black Pepper Powder) జీలకర్ర పొడి (Cumin Powder) తయారుచేసే విధానం మరియు వాడే పద్ధతి: పైన పేర్కొన్న మూడు పదార్థాలను సమాన మోతాదులో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు లేదా మీ వైద్యుల సలహా మేరకు అర టీస్పూన్ మోతాదులో కొద్దిగా గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాలి. ఈ చిట్కా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, వాతాన్ని తగ్గించి, కండరాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు వైద్యులు కూడా ఓఆర్ఎస్ తీసుకోమని చెబుతుంటారు. ఓఆర్ఎస్ అనగానే మార్కెట్లో దొరితే  రెడీమేడ్ ఓఆర్ఎస్ గుర్తుకు వస్తుంది.  వీటిని బాగా మరిగించి చల్లార్చిన నీటిలో కలిపి తాగాలని చెబుతారు.   కానీ వాటిని ప్రతిరోజూ కొనడం ఖర్చుతో కూడుకున్నది. ఇది మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో మార్కెట్లో దొరికే రెడీమేడ్ ఓఆర్ఎస్ కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. అందుకే ఇంట్లోనే ఈజీగా ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. ఇది ఖర్చు తక్కువ, పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంట్లోనే ఓఆర్ఎస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే.. ఓఆర్ఎస్ తయారు చేసే విధానం.. కావలసిన పదార్థాలు..  1 లీటరు శుభ్రమైన లేదా మరిగించిన చల్లటి నీరు  6 టీస్పూన్ల చక్కెర (సుమారు 30 గ్రాములు)  ½ టీస్పూన్ ఉప్పు (సుమారు 3 గ్రాములు) ఎలా తయారు చేయాలి? ముందుగా 1 లీటరు నీటిని మరిగించి చల్లారనివ్వాలి. శుభ్రమైన పాత్రలో లేదా సీసాలో నీళ్ళు పోయాలి. దానికి 6 టీస్పూన్ల చక్కెర , అర టీస్పూన్ ఉప్పు కలపాలి. పంచదార, ఉప్పు పూర్తిగా కరిగే వరకు మిశ్రమాన్ని బాగా కలపాలి.  ఇలా చేస్తే ఇంట్లో తయారు చేసుకున్న ఓఆర్ఎస్ సిద్ధంగా ఉంది. దీనిని కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.. విరేచనాలు, వాంతులు లేదా అధికంగా చెమట పట్టడం వల్ల శరీరంలో  డీహైడ్రేషన్ కలగవచ్చు. ఓఆర్ఎస్ శరీరాన్ని తిరిగి హైడ్రేట్ గా మార్చడంలో  సహాయపడుతుంది. ఓఆర్ఎస్ లో ఉండే ఉప్పు , చక్కెర శరీరంలో సోడియం, పొటాషియం , ఇతర ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. డీహైడ్రేషన్  వల్ల కలిగే అలసట, తలతిరగడం , నీరసాన్ని తగ్గించడంలో ఓఆర్ఎస్ ప్రభావవంతంగా పనిచేస్తుంది.  తీవ్రమైన వేడి , వడగాలుల సమయంలో ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది , అంతేకాదు వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. విరేచనాలు, వాంతుల సమయంలో పిల్లలు, వృద్ధులు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ చాలా సహాయపడుతుంది. అనారోగ్యం లేదా ఇన్ఫెక్షన్ తర్వాత శరీరంలోని నీరు , ఖనిజాల లోపాలను భర్తీ చేయడం ద్వారా వేగంగా కోలుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఓఆర్ఎస్ తాగేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. ఓఆర్ఎస్ ను 24 గంటల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు.  ఎల్లప్పుడూ శుభ్రమైన, మరిగించిన నీటిని వాడాలి. ఉప్పు, చక్కెర పరిమాణాన్ని సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ లేదా తక్కువ పరిమాణం హానికరం కావచ్చు. విరేచనాలు, వాంతులు లేదా డీహైడ్రేషన్ సమస్య తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.  చిన్న పిల్లలు , తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి కోసం ఓఆర్ఎస్ ను నమ్ముకోకుండా  వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.                                         *రూపశ్రీ.
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం తెచ్చుకుంటూ ఉంటారు. అసలు అంత కోపం ఎందుకు వస్తుంది అనే విషయం కూడా అర్థం కానట్టు ఉంటుంది. కోపం అనేది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు.. అది  మనస్సు , శరీరానికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు, వారి శరీరం పూర్తిగా అల్లకల్లోలానికి గురవుతుంది. అతిగా కోపం తెచ్చుకోవడం వెనుక ఉన్న శాస్త్రీయ నిజం ఏమిటో తెలుసుకుంటే.. మెదడులోని ఈ భాగమే కారణం... మన మెదడులో అమిగ్డాలా అనే ఒక చిన్న ప్రాంతం ఉంటుంది. దీనిని  శరీరపు అలారం అని కూడా పిలవవచ్చు. మనకు ఏదైనా విషయం గురించి బాధగా అనిపించినప్పుడల్లా, ఈ అలారం వెంటనే మోగుతుంది. కోపానికి లోనయ్యే వ్యక్తులలో ఈ ప్రాంతం చాలా చురుకుగా ఉంటుంది. ఇది మెదడులోని ఆలోచనా భాగాన్ని అడ్డుకుంటుంది, దీనివల్ల తొందరగా కోపం వచ్చే వారు  ఆలోచించకుండానే మాటలు మాట్లాడతారు లేదా పనులు చేస్తారు. కోపం రాగానే జరిగేది ఇదే.. అమిగ్డాలా చురుకుగా మారినప్పుడు అది అడ్రినలిన్ , కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్లను శరీరంలోకి విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ల విడుదల శరీరంలో ఈ క్రింది ప్రధాన మార్పులకు కారణమవుతుంది. గుండె కొట్టుకోవడం చాలా వేగంగా అవుతుంది. రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది. కండరాలు పూర్తిగా వ్యాకోచిస్తాయి. శ్వాస చాలా వేగంగా , నిస్సారంగా మారుతుంది. ముఖానికి, చేతులకు రక్త ప్రసరణ పెరగడం వల్ల ముఖం ఎర్రగా మారుతుంది. మితిమీరిన కోపం ఏదైనా వ్యాధికి సంకేతమా? పదే పదే  మితిమీరిన కోపం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. నిరంతర కోపం శరీరాన్ని ఎప్పుడూ  ఒత్తిడికి గురి చేస్తుంది. ఇది గుండెపోటు, పక్షవాతం , నిద్రలేమి వంటి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో మానసిక ఒత్తిడి, కుంగుబాటు లేదా నిద్రలేమి కూడా కోపం పెరగడానికి దోహదం చేస్తాయి. మితిమీరిన కోపాన్ని ఎలా శాంతపరచాలి? కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అసాధ్యం కాదు. కోపం వచ్చినప్పుడల్లా వెంటనే దీర్ఘంగా, లోతుగా శ్వాస తీసుకోవాలి. 1 నుండి 10 వరకు అంకెలను వెనక్కి లెక్కించండి. కాసేపు ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్లడం, చల్లటి నీళ్లు తాగడం కూడా కోపాన్ని  తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ యోగా, ధ్యానం చేయడం మనసును ప్రశాంతపరచడానికి, అమిగ్డాలాను నియంత్రించడానికి సహాయపడుతుంది.                                   *రూపశ్రీ.